కరీంనగర్ : అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన బిజిలి నరేష్ (25) తన సమీప బంధువైన ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నరేష్‌ను బాలిక తల్లిదండ్రులు పట్టుకుని... దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు నరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.