వనపర్తి మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ ముఖచిత్రం
మహబూబ్‌నగర్ క్రైం: ఇటీవల శాంతిభద్రతల పరంగా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు గ్రామపంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. పూర్తిగా స్థానికత సెంటిమెంట్‌తో జరిగే సర్పంచ్‌ల ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీస్‌స్టేషన్ల వారీగా సమస్యాత్మక గ్రామాల జాబితా సిద్ధంచేస్తున్నారు. ఏ సమయంలోనైనా ఎన్నికల నగారా మోగినా సిద్ధం కావాలని పోలీసుశాఖ ఉన్నతాధికారులు సైతం ఇప్పటికే పోలీస్ బాస్‌లకు సూచించినట్లు సమాచారం.
ఈ విషయమై జిల్లాల ఎస్పీలు జిల్లా పోలీస్ సిబ్బందితో చర్చించి చర్చలకు ఉపక్రమించినట్లు తెలిసింది. ఈనెల 25 తర్వాత ఎన్నికల కోడ్ రానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ శాఖల పాత్ర మరింత కీలకం కానుంది. ఎన్నికల కోడ్ నియమావళి అమల్లోకి రాగానే మొత్తం వ్యవస్థను పోలీస్‌శాఖ తమ గుప్పిట్లోకి తీసుకోనుంది. దీంతో జిల్లాలో పోలీస్‌శాఖ ఉన్నతాధికారుల పాత్ర అత్యంత కీలకం కానుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా శాంతిభద్రతల విధులు నిర్వర్తించాల్సి ఉంది.
జిల్లాల వారీగా..
- మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా గతంలో 250 పైగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు ఉండేవి. 2013లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీటి ఆధారంగా పోలీసులు భద్రతపరంగా చర్యలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు జాబితా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. నారాయణపేట, ధన్వాడ, మరికల్, మక్తల్, దేవరకద్ర, భూత్పూర్, నవాబ్‌పేట, జడ్చర్ల, అడ్డాకుల తదితర మండలాల్లో అతి సమస్యాత్మక ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో గొడవలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పోలీసుశాఖ ప్రత్యేక వ్యూహం అనుసరించనుంది.
- వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు ఉండగా, 60 గ్రామాలను అధికారులు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘనలు చోటు చేసుకోలేదు. గత పంచాయతీ ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల చిన్నచిన్న గొడవలు జరిగినా అధికారులు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో 116 పంచాయతీలను సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు.
- నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 గ్రామపంచాయతీలు ఉండగా, గత ఎన్నికల సందర్భంగా 147 పం చాయతీలను సమస్యాత్మకంగా గుర్తించారు. అయి తే పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం కోసం ఇంకా పోలీసు సిబ్బంది ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదు.
పోలీస్‌స్టేషన్ వారీగా జాబితా
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్ల వారీగా గతంలో జరిగిన ప్రధాన సంఘటనలపై సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు ఆరాతీస్తున్నారు. బందోబస్తు అంశంతో పాటు సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల చిట్టాను సిద్ధం చేస్తున్నారు. వీటి ఆధారంగా జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
బందోబస్తు, ఇతర విధులే కీలకం
ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే పార్టీల ప్రచారం హోరెత్తనుంది. ఈ సమయంలో అనవసర ఎస్కా ర్టులు చేపట్టడం అసలు కుదరదు. ప్రస్తుతం ఉభ య జిల్లాలో కలిపి వెయ్యిమంది సివిల్, ఏఆర్ సిబ్బంది పనిచేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల సమస్యాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పార్టీల నాయకు లు పరస్పరం దాడులు చోటుచేసుకున్నాయి. ఈ తరహా ఘటనలకు ఈసారి తావు లేకుండా ముం దస్తు వ్యూహం అమలు చేయనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు సమాచారం కోసం పోలీసు శాఖలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ విభాగాన్ని ఎన్నికల సమయంలో పూర్తిగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విభాగాన్ని కింది నుంచి బలోపేతం చేసేలా చాకచక్యంగా వ్యవహరించేవారు, క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారం రాబట్టే వారిని నియమించుకోనున్నట్లు సమాచారం.
సమస్యాత్మక గ్రామాలు
Comments
Please login to add a commentAdd a comment