కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో గురువారం మధ్యాహ్నం దారుణం జరిగింది. మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన వృద్ధురాలు(70) ఒంటరిగా ఉండటంతో ఆమెపై అత్యాచారానికి ఇద్దరు యువకులు యత్నించారు. దాంతో ఆమె వారిని ప్రతిఘటించి, కేకలు వేయటంతో స్థానికులు వారు పట్టుకున్నారు. అనంతరం వారికి స్థానికులు దేహశుద్ధి చేశారు. కామాంధులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని...కామాంధులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.