ఆలయంలో చోరీ | srirama lingeshvara swamy temple theft in karimanagar distict | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Published Wed, Apr 8 2015 9:32 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

srirama lingeshvara swamy temple theft in karimanagar distict

కరీంనగర్: శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారి విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వల్గొండ గ్రామంలోని శ్రీరామలింగేశ్వర ఆలయంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన వ్యక్తులు దీన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు.

గ్రామస్తులు వచ్చి చూసేవరకు ఆలయంలోని పంచలోహాలతో తయారు చేసిన స్వామి వారి విగ్రహాంతో పాటు సీతమ్మ, లక్ష్మణ, ఆంజనేయస్వాముల విగ్రహాలు కూడా చోరికి గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement