హైదరాబాద్: కొత్త వాహనాలకు తెలంగాణ స్టేట్ (టీఎస్) కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత వాహనాలకు టీఎస్ కోడ్ అమలు చేయడానికి నాలుగు నెలలు గడువు ఇచ్చామని, అవసరమైతే గడువు ఇంకా పెంచుతామని ఆయన చెప్పారు. ఇందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు.