32 రంగాల్లో 50 మందికి పురస్కారాలు ఇవ్వనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాలలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినవారిని ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఒక్కొక్కరికీ లక్షా నూటపదహార్ల నగదు, జ్ఞాపికలతో సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 32 రంగాలకు సంబంధించి 50 మంది ప్రతిభావంతులు, సంస్థలు, ప్రాంతాలను ఎంపిక చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ రెండుమార్లు సమావేశమై ఈ ఎంపికలు పూర్తి చేసి ప్రభుత్వానికి అందించింది. సాంస్కృతికశాఖ వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలను శనివారం ఉత్తర్వు ద్వారా విడుదల చేసింది.
పురస్కారగ్రహీతలు వీరే..
సాహితీవేత్తలు: ముదిగొండ వీరభద్రయ్య(హైదరాబాద్), గూడ అంజయ్య(హైదరాబాద్), సుంకిరెడ్డి నారాయణరెడ్డి(నల్లగొండ జిల్లా), పోల్కంపల్లి శాంతాదేవి(మహబూబ్‌నగర్ జిల్లా), పెద్దింటి అశోక్‌కుమార్(కరీంనగర్ జిల్లా), సలావుద్దీన్ నయ్యర్(హైదరాబాద్) వేదపండితులు: కె.పాండురంగాచార్య(హైదరాబాద్) సంస్కృత పండితులు: ఆచార్య నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు(వరంగల్) అర్చకులు/ఆధ్యాత్మికవేత్తలు: గోపన్నగారి శంకరయ్య(స్థానాచార్యులు-వేములవాడ), ఆర్చ్ బిషప్ తుమ్మబాల(హైదరాబాద్), మహమ్మద్ ఉస్మాన్(ఇమాం- మక్కా మసీదు) ప్రభుత్వ లోగో రూపకర్త: ఏలె లక్ష్మణ్(హైదరాబాద్), అమరవీరుల స్తూప నిర్మాత: ఎక్కా యాదగిరిరావు(హైదరాబాద్) కళాకారులు: కె.లక్ష్మాగౌడ్(హైదరాబాద్), చుక్కా సత్తయ్య(వరంగల్), కళాకృష్ణ(హైదరాబాద్), అలేఖ్య పుంజాల(హైదరాబాద్),
జర్నలిస్టు: టంకశాల అశోక్(హైదరాబాద్) ఎలక్ట్రానిక్ మీడియా: డా.పసునూరి రవీందర్(హైదరాబాద్), సంగీతకారులు: హైదరాబాద్ బ్రదర్స్, విఠల్‌రావు(గజల్ గాయకుడు- హైదరాబాద్), జి.ఎల్.నామ్‌దేవ్(ఉద్యమ సంగీతం-కరీంనగర్) న్యాయకోవిదులు: సుధాకర్‌రెడ్డి గ్రామ పంచాయతీ: చందుర్తి, కరీంనగర్ జిల్లా ఉత్తమ మండలం: సిద్దిపేట, మెదక్ జిల్లా శాస్త్రవేత్త: డా.సి.హెచ్.మోహన్‌రావు ఎంటర్‌ప్రెన్యూర్: నర్రా రవి విద్యావేత్త: ప్రొ. శ్రీధరస్వామి(వరంగల్) క్రీడాకారులు: ముఖేశ్(రంగారెడ్డి జిల్లా), ముళినీరెడ్డి(హైదరాబాద్) వైద్యులు: డా.రాజారెడ్డి(హైదరాబాద్), డా. ఆర్.లక్ష్మణమూర్తి(వరంగల్) ఎన్‌జీవో: దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్(హైదరాబాద్) ఫొటోగ్రఫీ: భరత్ భూషణ్ (హైదరాబాద్) హస్తకళలు: అయల అనంతాచారి(పెంబర్తి-వరంగల్) చేనేత: కందకట్ల నర్సింహులు(హైదరాబాద్) అంగన్‌వాడీ: ఇ.పద్మ(కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు) ఉద్యమ గాయకులు: మాటల తిరుపతి, యోధన్(ఆదిలాబాద్ జిల్లా) ఉద్యమ గాయకురాలు: భూక్యా సుశీల శిల్పి: ఎం.వి.రమణారెడ్డి(మెదక్ జిల్లా),
ఉపాధ్యాయులు: ఎన్.విజయశ్రీ(జీపీహెచ్‌ఎస్ నాదర్‌గుల్ -రంగారెడ్డి), బండా ప్రతాపరెడ్డి(సీనియర్ లెక్చరర్-పాలిటెక్నిక్ మాసబ్‌ట్యాంక్) ప్రభుత్వ ఉద్యోగి: బి.పద్మారావు, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ(వరంగల్) వారసత్వ కట్టడాల పరిరక్షణ: పి.అనూరాధారెడ్డి(హైదరాబాద్), డా. ఎం.పాండురంగారావు (వరంగల్) చరిత్ర పరిశోధన: డా. జై శెట్టి రమణయ్య(కరీంనగర్ జిల్లా) ఉత్తమ రైతు: కర్ర శశికళ(దుగ్గేపల్లి, త్రిపురారం-నల్లగొండ జిల్లా), వొల్లాల రమేశ్(భీమదేవరపల్లి-కరీంనగర్ జిల్లా పాడిపరిశ్రమ). ఉత్తమ మున్సిపాలిటీ: మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా.
రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం
Published Sun, May 31 2015 2:58 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement
Advertisement