16న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ | TRS LP to meet Chairmanship of KCR on March 16 | Sakshi
Sakshi News home page

16న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ

Published Sat, Mar 14 2015 9:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

16న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ - Sakshi

16న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ

హైదరాబాద్:  మార్చి 16న సోమవారం సాయంత్రం 6గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. ఈ మేరకు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్లకు ఆహ్వానం పంపనున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామాస్థాయిలో పార్టీ కమిటీలు, జిల్లాస్థాయి పార్టీ ఎన్నికలు, పార్టీ మెంబర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి అంశాలపై టీఆర్ఎస్ ఎల్పీ చర్చించనున్నారు.  
 

ఇదిలా  ఉండగా,  సంస్థాగత ఎన్నికలపై తెలంగాణ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కె. తారక రామరావు దృష్టి సారించారు.  టీఆర్ఎస్ పార్టీ మండల, జిల్లా అధ్యక్ష ఎన్నికలపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న టీఆర్ఎస్ కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగనుంది. అయితే మార్చి 16న జరిగే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలను కేటీఆర్ ప్రకటించున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement