ప్రొఫెసర్లు జి.హరగోపాల్, ఎం.కోదండరాం
అచ్చంపేట: విద్య వ్యవస్థ ప్రవేటీకరణ, వ్యాపారీకరణ కొనసాగితే సమాజంలో అంతరా లు, అసమానతలు పెరుగుతాయని, వీటిని నివారించేందుకు కామన్ విద్యావిధానం అమలు చేయూలని ప్రొఫెసర్ జి.హరగోపాల్, కోదండరాం అన్నారు. శనివారం స్థానిక లక్ష్మిగార్డెన్ ఫంక్షన్ హా ల్ డీటీఎఫ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రవేటీకరణ వేళ్లూనుకు పోరుుందన్నా రు. కేజీ నుంచి పీజీ వరకు సమాన విద్యావకాశాలు కల్పించాలన్నారు. బాలికల్లో విద్యాశాతం తగ్గిపోతున్నదన్నారు.
ఎస్సీ, ఎస్టీల్లో చదువుమానేస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. తరచూ సింగపూర్ పేరును ప్రస్థావన చేసే ము ఖ్యమంత్రులు కామన్ విద్యా విధానం, వైద్య విధానం లమలుకు కృషి చేయూల న్నారు. పున్నయ్య కమిషన్ సిఫారుసుల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. జీడీపీలో 6శాతం విద్యారంగ అభివృద్ధికి ఖర్చుచేయూలని కోరారు. ప్రభుత్వ రంగ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కామన్ విద్యా విధానం అమలుపై పోరాడాల్సిన బాధ్యత ప్రజా సంఘాలపై ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన చేయూలని ఉన్నత ప్రమాణాలు పాటించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
చదువుతోనే అభివృద్ధి:
ప్రొపెసర్ కోదండరాం
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వందకు 21 మంది విద్యార్థులు మాత్రమే కళాశాల వి ద్యకు వెళ్లగలుగుతున్నారని, వారిలో ఎ స్సీ, ఎస్టీల్లో 17శాతం, బీసీ24శాతం, ఇతరులు 21శాతం విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. సరళీకృత విధానాల కారణంగానే ప్రవేటీకరణ పెరిగిపోరుుందన్నా రు. పాఠశాల విద్య బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు.
పాఠశాల అవసరాలను ముందుగా గుర్తించి స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసికె ళ్లాలని సూచించారు. గ్రామాల్లో బడులను కాపాడుకుంటూ ప్రైవేట్ విద్యకు అడ్డుకట్ట వే యూలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం,నాయకులు నారాయణరెడ్డి, యం ఎస్ కిష్టప్ప, బి.మద్దిలేటి, యం.రాఘవచారి పాల్గొన్నారు.
సమాన విద్యతోనే అసమానతల నిర్మూలన
Published Sun, Dec 21 2014 3:00 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement