సాక్షి, హైదరాబాద్ : నగరం లోని షాపింగ్ మాల్స్‌పై తూనికలు కొలతల శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యక తనిఖీల్లో భాగంగా, తూకంలో మోసాలు, ప్యాకేజ్డ్ కమోడిటీస్ నియమాల ఉల్లంఘనలపై కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారనే ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో కంట్రోలర్ అకున్ సబర్వాల్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ తనిఖీలు నిర్వహించారు. గురువారం ఒక్కరోజే జరిపిన దాడుల్లో ఏకంగా 102 కేసులు నమోదు చేశారు. దాదాపు 23లక్షల రూపాయల విలువైన వస్తువులను అధికారులు సీజ్ చేశారు.
- ఇనార్బిట్ మాల్‌లో 30 కేసులు నమోదు, 3.5 లక్షల రూపాయల జరిమానా
- జీవీకే మాల్‌లో 17 కేసులు, 3.4 లక్షల రూపాయల జరిమానా
- ఫోరం సజనామాల్ లో 15 కేసులు, రూ.90 వేల జరిమానా విధించారు
Comments
Please login to add a commentAdd a comment