వైఎస్సార్ పథకాలను కోరుకుంటున్నారు | YSR schemes to Wants | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ పథకాలను కోరుకుంటున్నారు

Published Sun, Mar 13 2016 1:56 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

వైఎస్సార్ పథకాలను కోరుకుంటున్నారు - Sakshi

వైఎస్సార్ పథకాలను కోరుకుంటున్నారు

అల్గునూర్‌లో వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరించిన భాస్కర్‌రెడ్డి
 
తిమ్మాపూర్: వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం అల్గునూర్‌లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ పథకాలతో ప్రతీ కుటుంబానికి లబ్ధి జరిగిందన్నారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధనకు పార్టీ కృషి చేస్తుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారు బాధపడే రోజులు వస్తాయని అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ ముందుకెళ్తుందని తెలిపారు.

మానకొండూర్  నియోజకవర్గ ఇన్‌చార్జి సొల్లు అజయ్‌వర్మ, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, ప్రచార విభాగం అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దేవరనేని వేణుమాధవ్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు వినుకొండ రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు రేషవేణి వేణుయాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు కొంగల సతీశ్, నాయకులు మెండ శంకర్, రాజు, అవినాశ్, అజయ్, చందు, బొడ్డు నిఖిల్, జాప సతీశ్, కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement