కైరో: ఈజిప్టులోని బాని సూఫ్ మెన్యా రహదారిపై శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి... చికిత్స అందించినట్లు చెప్పింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతం ఈజీప్టు రాజధాని కైరోకి 115 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.