డమాస్కస్: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై స్థానిక సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సైనిక ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం జరిపిన దాడుల్లో 14 మంది ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురు ఉగ్రవాదులను పట్టుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. అశారా, స్వైదాన్ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న ఐఎస్ ఉగ్రవాదులపై సైన్యం తన దాడులను ముమ్మురం చేసింది. చమురు నిల్వలు అధికంగా ఉన్న ప్రదేశం కావడంతో నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది.
అయితే.. కొత్తగా ఏర్పడిన సైనిక ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ వారం మొదట్లో కూడా ఐఎస్ గ్రూప్కి చెందిన ఒక వాహనాన్ని పేల్చిన ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ఉన్నతాధికారులు గుర్తు చేశారు. సిరియా-ఇరాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన డిర్ అల్ జర్ ప్రాంతంలో పట్టు కోసం ఐఎస్ ఉగ్రవాదులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
14 మంది 'ఐఎస్' ఉగ్రవాదులు హతం
Published Wed, Jan 14 2015 12:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM
Advertisement