గాలిలో విమానం.. సాంకేతిక లోపం! | air india flight landed with 15 minutes due to technical problem | Sakshi
Sakshi News home page

గాలిలో విజయవాడ విమానం.. సాంకేతిక లోపం!

Published Wed, Jun 28 2017 8:32 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

గాలిలో విమానం.. సాంకేతిక లోపం! - Sakshi

గాలిలో విమానం.. సాంకేతిక లోపం!

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడం కలకలం రేపింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

గాలిలో ఎగిరిన 15 నిమిషాలకే సాంకేతికంగా విమానం ఇబ్బంది ఎదుర్కోవడంతో ఈ విషయాన్ని పైలట్‌ గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement