నీస్ నరమేధం: 84 మంది మృతుల గుర్తింపు | All 84 killed in Nice truck attack are identified | Sakshi
Sakshi News home page

నీస్ నరమేధం: 84 మంది మృతుల గుర్తింపు

Published Wed, Jul 20 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

నీస్ నరమేధానికి పాల్పడ్డ ఉగ్రవాది మహమెద్, రోడ్డుపై మృతదేహాలు

నీస్ నరమేధానికి పాల్పడ్డ ఉగ్రవాది మహమెద్, రోడ్డుపై మృతదేహాలు

పారిస్: జాతీయ దినోత్సవం బాస్టిల్ డే రోజున ఫ్రాన్స్ నగరం నీస్ లో జరిగిన పాశవిక ట్రక్కు దాడిలో మరణించిన 84 మంది మృతుల గుర్తింపు ప్రక్తియ పూర్తయింది. కొందరు ప్రచారం చేస్తున్నట్లు నీస్ మృతుల సంఖ్య పెరగలేదని, నాటి దాడిలో ఘటనస్థలంతోపాటు ఆసుపత్రిలో మరణించిన 84 మందిని గుర్తించి, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశామని ప్రాసిక్యూషన్ కార్యాలయ అధికార ప్రతినిధి తిబాల్ట్ బుధవారం మీడియాకు తెలిపారు. నైస్ దాడిలో చనిపోయినవారిలో ఫ్రాన్స్ జాతీయులేకాక విదేశీయులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. (నీస్‌లో నరమేధం)

గత మంగళవారం(జూలై 14న) సంబరాల్లో మునిగితేలుతున్న ప్రజలపైకి భారీ ట్రక్కుతో దూసుకెళ్లి, చిన్నారులు సహా 84 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదిని మహమెద్ లావోయైజ్ బౌలెల్ ను భద్రతా బలగాలు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. పారిస్ ఉగ్రదాడి తర్వాత ఫ్రాన్స్ లో చోటుచేసుకున్న ఘోర సంఘటన నీస్ నరమేధమే. నాటి ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం దాడితో సంబందాలున్నాయనే అనుమానంతో ఆరుగురిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.(ఆ కిరాతకుడి చివరి మెసేజ్ ఏమిటో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement