'వరకట్నం' నమోదులో ఏపీదే తొలిస్థానం! | Andhra pradesh tops list in dowry cases in 2012 | Sakshi
Sakshi News home page

'వరకట్నం' నమోదులో ఏపీదే తొలిస్థానం!

Published Fri, Feb 21 2014 6:02 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

Andhra pradesh tops list in dowry cases in 2012

న్యూఢిల్లీ: వరకట్న నిషేధానికి ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చినా ప్రయోజనం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది. వరకట్న జాడలు క్రమేపీ హెచ్చరిల్లుతునే ఉన్నాయి.వరకట్న కేసులు అధికంగా నమోదు చేసుకున్నరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఒడిశా రాష్ట్రం చోటు దక్కించుకుంది.  2012 సంవత్సరానికి గాను జాతీయ నేరపరిశోధన విభాగం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. 2,511 వరకట్న కేసులతో ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో ఉండగా,  1,487 కేసులతో ఒడిసా రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. కాగా గృహ హింస కేసుల్లో తమిళనాడు రాష్ట్రం అగ్ర భాగాన నిలిచింది.

 

అయితే ఆంధ్రప్రదేశ్ లో గృహహింస కేసులు కూడా అధికంగానే జరిగినట్లు నివేదికలో వెల్లడైయ్యింది. తమిళనాడు రాష్ట్రం లో 3,838 గృహ హింస కేసులు నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో 2,150 కేసులు నమోదయ్యాయి. చాలా రాష్ట్రాల్లో వరకట్న, గృహ హింస కేసులు క్రమేపీ పెరుగుతుండగా,  కొన్ని రాష్ట్రాల్లో వీటిపై కేసులే నమోదు కాకపోవడం గమనార్హం.  అరుణాచల్ ప్రదేశ్, హిమచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో వరకట్న, గృహ హింస కేసులు నమోదు కాలేదు. మొత్తం మీద చూస్తే వరకట్న కేసుల కంటే గృహ హింస కేసులే అధికంగా నమోదైయినట్లు జాతీయ నేరపరిశోధన విభాగం తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement