‘పార్లమెంట్‌లో జోక్యం చేసుకోబోం’
న్యూఢిల్లీ: పార్లమెంటు వ్యవహారాలను న్యాయవ్యవస్థ పర్యవేక్షించజాలదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అందులో జోక్యం చేసుకొని తమ ‘లక్ష్మణరేఖ’ను దాటదని పేర్కొంది. పార్లమెంటు కార్యకలాపాలు స్తంభిం చకుండా మార్గదర్శకాలు జారీచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘మేము పార్లమెంటు వ్యవహారాలను పర్యవేక్షించం. సభను ఎలా నిర్వహించాలో స్పీకర్‌కు తెలుసు. ఇందులో మా లక్ష్మణరేఖను మేము దాటం. పార్లమెంటు ఇలా నడచుకోవాలి అని చెప్పి మేము మా హద్దును అతిక్రమించం. పార్లమెంటుకు మేమేం చెప్పం’ అని ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.