'కేసీఆర్కు ఆంధ్రా ఫోబియా పట్టింది' | CPI Narayana takes on chandrababu naidu and kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కు ఆంధ్రా ఫోబియా పట్టింది'

Published Sun, Jul 19 2015 1:42 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'కేసీఆర్కు ఆంధ్రా ఫోబియా పట్టింది' - Sakshi

'కేసీఆర్కు ఆంధ్రా ఫోబియా పట్టింది'

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీపీఐ నారాయణ ఆదివారం హైదరాబాద్లో ధ్వజమెత్తారు. కేసీఆర్లో నిజాం నవాబు పరకాయ ప్రవేశం చేసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు ఆంధ్రా ఫోబియా పట్టిందని విమర్శించారు.  పుష్కరాల పేరుతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నారన్నారు.

కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లుపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వ అవినీతికి నిరసనగా సోమవారం సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని సీపీఐ కె నారాయణ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement