హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోల్‌సేల్‌గా ఓట్లను కొనుగోలు చేసి సీఎం కేసీఆర్ చండీయాగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాలను అవమానించారని సీపీఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. ఒకవైపు మహత్తర చండీయాగం చేస్తూ నిజాయితీగా ఉండకుండా, మరోవైపు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన బలం లేకపోయినా స్థానిక ప్రజాప్రతినిధులను లోబరుచుకుని సీట్లను గెలుచుకున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్‌కు పరిమితంగా నాలుగుసీట్లే ఉన్నా ఖమ్మం జిల్లా స్థానిక ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ఇందుకు తార్కాణమన్నారు. ఇది చండీయాగ ప్రభావం అనుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మాత్రం ఇది తీరని అవమానమని వ్యాఖ్యానించారు. శనివారం మఖ్దూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
'గంపగుత్తగా ఓట్లు కొనేసి చండీయాగాలా?'
Published Sat, Jan 2 2016 6:54 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement