అనంతపురం : కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు పని చేస్తున్నారని సీపీఐ నాయకుడు కె. నారాయణ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... కరువు బాధితులకు సంఘీభావంగా ఉగాది పర్వదినం పురస్కరించుకుని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ నారాయణ తెలిపారు.