ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త అణు కేంద్రాన్ని నిర్మిస్తోందని పాశ్చాత్య రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. అణ్వాయుధాల నిల్వలనూ పెంచుకుంటోందని ప్రపంచం భావిస్తోంది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’ అనే ఉపగ్రహం తీసిన చిత్రాలను పరిశీలించిన నిపుణులు.. ఇస్లామాబాద్‌కు 30 కి.మీ దూరంలోని కహుటాలో యురేనియం సంబంధ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోందని భావిస్తున్నారు.
‘ఉగ్రవాదం’పై భారత్ ప్రతిపాదనకు నో
మార్గరీటా ఐలాండ్(వెనుజులా): ఉగ్రవాదంపై పోరాటానికి ఓ క్రియాశీల బృందాన్ని ఏర్పాటు చేయాలన్న భారత ప్రతిపాదనను పాక్ తిరస్కరించింది. మార్గరీటా ఐలాండ్‌లో జరుగుతున్న 17వ అలీనోద్యమ (నామ్) శిఖరాగ్ర సదస్సులో భారత్ ఈ ప్రతిపాదనను పాక్ ముందుంచింది. సదస్సులో దాదాపు ఏకాభిప్రాయం వచ్చినా పాకిస్తాన్ మాత్రం వ్యతిరేకించింది.
కొత్త అణుకేంద్రం నిర్మిస్తున్న పాక్!
Published Sat, Sep 17 2016 2:58 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement
Advertisement