సమంత తల్లిదండ్రుల చిందులు | samantha parents takes on media representatives | Sakshi
Sakshi News home page

సమంత తల్లిదండ్రుల చిందులు

Published Thu, Oct 1 2015 8:04 AM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

సమంత తల్లిదండ్రుల చిందులు - Sakshi

సమంత తల్లిదండ్రుల చిందులు

చెన్నై :  ఐటీ దాడులకు దిగిన అధికారులపైనా, కవరేజికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై నటి సమంత తల్లిదండ్రులు చిందులు తొక్కారు. చెన్నై పల్లవరం సారధి వీధిలోని అపార్టుమెంటులో సమంత నివసిస్తున్నారు. అదే అపార్టుమెంటు రెండో అంతస్తులో ఆమె తల్లిదండ్రులు వేరుగా కాపురం ఉంటున్నారు. బుధవారం ఉదయాన్నే ఐటీ అధికారులు తల్లిదండ్రుల ఇంటిలోకి ప్రవేశించారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ఐటీ అధికారులు సమంత, ఆమె తల్లిదండ్రుల ఇళ్లలో అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో అణువణువు  సోదాలు జరిపారు. ఈ సందర్భంగా లభ్యమైన డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న సందర్భంలో సమంత తండ్రి జోసఫ్ ప్రభు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమంత తమ వద్ద డబ్బు, నగలు, డాక్యుమెంట్లు ఏమీ పెట్టదని, ఇంటికి అప్పుడప్పుడు వస్తుందని ఐటీ అధికారులతో వాదించారు.  తాము అద్దె ఇంటిలో నివసిస్తున్నామని వారు ఐటీ అధికారులతో ఆవేశంగా మాట్లాడారు. హీరోయిన్ సమంత షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారని ఐటీ అధికారులకు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement