జోస్ ఆలుక్కాస్‌లో సమ్మర్ ఫెస్ట్ | summer fest in josalukkas | Sakshi
Sakshi News home page

జోస్ ఆలుక్కాస్‌లో సమ్మర్ ఫెస్ట్

Published Wed, Mar 4 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

summer fest in josalukkas

వజ్రాలపై 15 శాతం తగ్గింపు
 
 హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్  జోస్ ఆలుక్కాస్ సమ్మర్ ఫెస్ట్‌లో భాగం గా కొత్త కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన డెమైండ్ కలెక్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 7,000 ప్రారంభ ధర కలిగిన డైమండ్ పెండంట్‌లను కూడా ఆఫర్ చేస్తున్నామని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా  పేర్కొన్నారు. ఈ నెల 14 వరకూ ప్రత్యేక ఆఫర్లుగా రూ.25,000కు మించిన స్వర్ణాభరణాల కొనుగోళ్లపై ఉచిత బంగారు నాణాన్ని, అలాగే వజ్రాలపై 15 శాతం తగ్గింపునిస్తామని వివరించారు. వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement