Josalukkas
-
జోస్ ఆలుక్కాస్.. దీపావళి ఆఫర్లు
ముంబై: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు బంగారు ఆభరణాలు కొనేటప్పుడు వెండి నాణేలను ఉచితంగా పొందవచ్చు. వజ్రాభరణాలపై 25%, ప్లాటినం ఆభరణాలపై ఏడు శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రత్యేక యాంటిక్ చెవిపోగుల తరుగుపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారు ఆభరణాలను అత్యాధునిక డిజైన్ల రూపంలోకి మార్పిడి చేసుకోవచ్చు. పండుగ రోజుల్లో ఆభరణాలను కొనుగోలు చేయాలనుకొనేవారికి ఇదొక గొప్ప అవకాశమని జోస్ ఆలుక్కాస్ యాజమాన్యం తెలిపింది. -
జోస్ ఆలుక్కాస్లో సమ్మర్ ఫెస్ట్
వజ్రాలపై 15 శాతం తగ్గింపు హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ జోస్ ఆలుక్కాస్ సమ్మర్ ఫెస్ట్‌లో భాగం గా కొత్త కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన డెమైండ్ కలెక్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 7,000 ప్రారంభ ధర కలిగిన డైమండ్ పెండంట్లను కూడా ఆఫర్ చేస్తున్నామని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. ఈ నెల 14 వరకూ ప్రత్యేక ఆఫర్లుగా రూ.25,000కు మించిన స్వర్ణాభరణాల కొనుగోళ్లపై ఉచిత బంగారు నాణాన్ని, అలాగే వజ్రాలపై 15 శాతం తగ్గింపునిస్తామని వివరించారు. వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. -
ఆన్లైన్ పోర్టల్‌లో ఇక జోస్ ఆలుక్కాస్ ఆభరణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆభరణాల విక్రయ రంగంలో ఉన్న జోస్ ఆలుక్కాస్ ఇ-కామర్స్‌లోకి అడుగుపెట్టింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేష్ బాబు చేతుల మీదుగా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు పోర్టల్‌కు రూపకల్పన చేసినట్టు కంపెనీ ఎండీ వర్ఘీస్ ఆలుక్కా గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. కస్టమర్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. ఎన్నో ఉత్పత్తులు ఆన్లైన్లో దొరుకుతున్నాయని, స్వచ్ఛమైన ఆభరణాలను అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చామని వివరించారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 30 షోరూంలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ‘ఎకానమీ బాగోలేకపోవడంతో ఆభరణాల అమ్మకాలు 30-40 శాతం మందగించాయి. దీనికితోడు బంగారం దిగుమతులపై ప్రభుత్వ నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారాయి. విదేశాల నుంచి బంగారం దొంగ రవాణా పెరిగింది. అంతర్జాతీయంగా ధర తక్కువగా ఉన్నా భారత్‌లో మాత్రం గ్రాముకు రూ.400 అధికంగా ఉంది’ అని అన్నారు. 2012-13 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.2 వేల కోట్ల టర్నోవరు అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కంపెనీ ఎండీలు పౌల్ ఆలుక్కా, జాన్ ఆలుక్కా పాల్గొన్నారు.