ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రేపు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ న్యాయశాఖ సలహాను కోరినట్టు తెలిసింది. దీంతో న్యాయశాఖ క్లియరెన్స్ తర్వాతే తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, రాజ్యసభ ఎజెండాలో తెలంగాణ బిల్లు అంశం లేదని తెలుస్తోంది. రాజ్యసభలో మంగళవారం తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడం కష్టమేనని రాజ్యసభ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి ఆమోదం పొందిన టీ బిల్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సివుంది. కేంద్ర మంత్రి మండలి గత శుక్రవారం ఆమోదించిన ఈ బిల్లును ప్రధాని కార్యాలయం నిన్న సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి పంపిన విషయం తెలిసిందే.
రేపు రాజ్యసభలో టీ బిల్లు అనుమానమే ?
Published Mon, Feb 10 2014 10:44 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement