న్యాయ శాఖ మంత్రి రాజీనామా | tomar resins for his post | Sakshi
Sakshi News home page

న్యాయ శాఖ మంత్రి రాజీనామా

Published Tue, Jun 9 2015 10:38 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

న్యాయ శాఖ మంత్రి రాజీనామా

న్యాయ శాఖ మంత్రి రాజీనామా

న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ పట్టా కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్.. మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి తోమర్ పొందిన ఎల్ఎల్బీ పట్టా (రిజస్ట్రేషన్ నంబర్ 3687) నకిలీదని తేల్చిన పోలీసులు మంగళవారం మద్యాహ్నం ఆయనను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే.

 

అయితే అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆప్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక మంత్రిని అరెస్టుచేసేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలు పాటించకపోవడం దారుణమని, దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ,  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కుట్ర దాగుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ నేత కుమార్ విశ్వాస్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement