కరాచీలో ఆత్మాహుతి దాడి: ఇద్దరు మృతి | Two killed in Karachi suicide blast | Sakshi
Sakshi News home page

కరాచీలో ఆత్మాహుతి దాడి: ఇద్దరు మృతి

Published Wed, Jan 29 2014 2:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

Two killed in Karachi suicide blast

పాకిస్థాన్ కరాచీ నగరంలో నజిమాబాద్ ప్రాంతంలో బుధవారం ఆత్మాహుతి జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు భద్రత అధికారి కూడా ఉన్నారని స్థానిక మీడియా బుధవారం ఇక్కడ వెల్లడించింది. ఈ రోజు ఉదయం కరాచీలోని రేంజర్ హెడ్ క్వార్టర్స్లో ప్రవేశించేందుకు యత్నించి ఓ వ్యక్తిని భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తి తనకుతాను పేల్చుకున్నాడు. ఆ ఘటనలో భద్రత అధికారి మరణించాడు. మరో భద్రత అధికారి తీవ్రంగా గాయపడ్డారు.



అలాగే ఆర్మీ చెక్ పోస్ట్పై గ్రానెడ్ దాడి చేశారు. ఆ వెనువెంటనే మరో రిమోట్ కంట్రోల్తో బాంబు పేల్చారు. బాంబులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement