Nannu Dochukunduvate
-
మరో యంగ్ డైరెక్టర్‌తో శర్వా..!
హీరో సుధీర్ బాబు తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా నన్ను దోచుకుందువటే. ఆసక్తికర ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో ఆర్ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం మరో కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ యువ దర్శకుడు. ఇప్పటికే ఓ లైన్ రెడీ చేసుకున్న నాయుడు కథ హీరో శర్వానంద్‌కు బాగుంటుందని భావిస్తున్నాడట. ఇప్పటికే శర్వానంద్‌కు లైన్ కూడా వినిపించిన ఆర్ఎస్ నాయుడు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న ఆశతో ఉన్నాడు. ఇప్పటికే ఆర్ ఎస్ నాయుడుతో సినిమా చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. శర్వా ఓకె చెపితే వెంటనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
సుధీర్ బాబు కొత్త గెటప్!
‘సమ్మోహనం’, ‘నన్ను దోచుకుందువటే’ లాంటి కూల్ సినిమాలతో మంచి సక్సెస్ సాధించాడు సుధీర్ బాబు. ఈ రెండు చిత్రాల్లోనూ సాఫ్ట్‌గా కనిపించిన సుధీర్ ప్రస్తుతం తన లుక్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు గడ్డాలు పెంచి మంచి సూపర్ హిట్లు అందుకున్నారు. టాలీవుడ్ యువ హీరోలు కూడా కొందరు గడ్డాలు పెంచి మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా ఇదే వరుసలో గడ్డం పెంచి పూర్తిగా తన స్టైల్‌ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది. -
బీడీలు తాగడం కూడా నేర్చుకున్నా: నటి
‘వజ్రకాయ’ ‘లీ’ ‘సాహెబా’ చిత్రాలతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన నభా నటేష్... ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకుంటుంది. ‘నన్ను దోచుకుందువటే’ అనిపించేస్తుంది. ‘నటన నా జీవన విధానం’ అంటున్న నటేష్ గురించి కొన్ని విషయాలు... ఆ గాలి ఆ నేల... చిన్నప్పటి నుంచే ఆటపాటల్లోనే కాదు చదువులోనూ శభాష్ అనిపించుకునేది నభా నటేష్. ఆమె స్వస్థలం కర్టాటకలోని శృంగేరి. అక్కడ ‘కళల దేవత’ శారదాంబ కొలువై ఉన్నారు. ఈ నేల గాలిసోకడం వల్ల కావచ్చు...తనకు సహజంగానే కళల పట్ల ఆసక్తి పెరిగిందంటోంది నటేష్. అది ఏ భాష అయినా సరే సినిమాలు చూడటం అంటే విపరీతమైన ఇష్టం. అయితే తాను నటి కావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అదుగో కాదు ఇదిగో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్‌లోకి వచ్చింది. యాక్టింగ్ కోర్స్ చేసింది. నాటకాల్లో నటించింది. ఈ క్రమంలోనే నటనపై ప్రత్యేక ఆసక్తి పెరిగింది. ఇదే ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చింది. కన్నడ సినిమా ‘వజ్రకాయ’ నటేష్ తొలిచిత్రం. శివరాజ్‌కుమార్ సరసన నటించింది. ఈ సినిమా తరువాత కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడలేదు. తెలుగులో నటేష్ తొలిచిత్రం ‘అదుగో’. ఈ సినిమా విడుదలకు ముందే ‘ఇదిగో’ అంటూ రెండో చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ విడుదలైంది. ఎందుకంటే... నటేష్ భోజన ప్రేమికురాలు. వర్కవుట్లు అంటే ఇష్టమేగానీ ‘క్రాష్ డైట్’ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తాను డైట్లో ఉన్నప్పుడల్లా ఇంట్లో వాళ్లు కూడా ఉండాల్సిందేనట. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటారా...సింపుల్! ఇంట్లో రుచికరమైన వంటలేవీ వండరు. కాబట్టి టెంప్ట్ అయ్యే ఛాన్సే లేదు కదా! బీడీలు తాగింది! తాను చేసే పాత్రను పండించడానికి ఎంతైనా కష్టపడతానంటుంది నటేష్. ఒక సినిమా కోసమైతే బీడీలు తాగడం కూడా నేర్చుకుంది. పొగాకు వాసనకు భోజనం కూడా సరిగ్గా చేసేది కాదట. హార్స్‌రైడింగ్ కూడా అలవోకగా నేర్చేసుకుంది. బీడీలు తాగాల్సి వచ్చినా, బుల్లెట్ రైడింగ్ చేయాల్సి వచ్చినా...అదంతా పాత్ర కోసమే అంటుంది నటేష్. బియ్యపు గింజ మీద లాగే ‘మంచి పాత్ర’ మీద కూడా పేరు రాసి ఉంటుందనే నమ్మకం నటేష్‌లో ఉంది. బ్రో! కాలేజీరోజుల్లో ‘టామ్ బాయ్’లా ఉండేది. తన ఫ్రెండ్స్గ్యాంగ్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఉండేవాళ్లు. అబ్బాయిలు నటేష్‌ను ‘బ్రో’ అని పిలిచేవాళ్లట. ఎప్పుడైనా ఒకసారి కాలేజీ రోజుల్లోకి వెళితే అబ్బాయిలెవరూ తనకు ప్రపోజ్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంటుందట! ఇంతకీ ఈ అమ్మడికి ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? కాస్త సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే చాలునట! -
విమర్శకులు అభినందించడం ఆనందంగా ఉంది
‘‘ఫ్యామిలీ అంతా కలసి చూసే మూవీ నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. మౌత్ టాక్‌తో పెద్ద సక్సెస్‌వైపుకు వెళ్తుందీ సినిమా. విమర్శకులు కూడా అభినందించడం ఆనందంగా ఉంది’’ అని సుధీర్‌బాబు అన్నారు. ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్ నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నటేశ్ కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. శనివారం ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘సెన్సార్ వాళ్లు బావుంది అని చెప్పడంతోనే నమ్మకం వచ్చింది. హరీష్ శంకర్, రానా, మోహన్ కష్ణ ఇంద్రగంటి, సందీప్ కిషన్, గోపీమోహన్ అందరూ సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఆర్.ఎస్ నాయుడు బాగా తీశాడు. ‘అష్టా చమ్మా’లో స్వాతి, ‘బొమ్మరిల్లు’లో జెనీలియా ఈ సినిమాలో నభా అంటున్నారు నభాను. కామెడీ వర్కౌట్ అవుతుందా అనుకునేవాణ్ణి. షార్ట్ ఫిల్మ్ సీన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘సుధీర్ మంచి కో–స్టార్. ప్రొడ్యూసర్‌గా నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మంచి రోల్ రాసినందుకు డైరెక్టర్‌గారికి థ్యాంక్స్. అమేజింగ్ సక్సెస్‌లో నన్ను భాగం చేసినందుకు థ్యాంక్స్. బాగా యాక్ట్ చేశాను అని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేశ్. ‘‘కామెడీ, ఎమోషనల్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు. తండ్రీ, కొడుకుల ఎమోషనల్ సీన్స్‌కు రెస్పాన్స్ బావుంది. సుధీర్‌గారు నన్ను నమ్మి చేసిన కథ ఇది. నభా చాలా బాగా చేసింది’’ అన్నారు ఆర్ఎస్ నాయుడు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ చోటా ప్రసాద్ పాల్గొన్నారు. -
‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ
టైటిల్ : నన్ను దోచుకుందువటే జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : సుధీర్ బాబు, నభ నటాషా, నాజర్, తులసి సంగీతం : అజనీష్ లోక్‌నాథ్ దర్శకత్వం : ఆర్ఎస్ నాయుడు నిర్మాత : సుధీర్ బాబు సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో సుధీర్ బాబు తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన చార్మింగ్ హీరో మల్టీస్టారర్ సినిమాలతో పాటు ప్రతినాయక పాత్రలకు కూడా సై అంటున్నాడు. తాజాగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి తానే స్వయంగా నటిస్తూ నిర్మించిన సినిమా నన్ను దోచుకుందువటే. ఇటీవల సమ్మోహనంతో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబు ఈ సినిమాతో మరో విజయం అందుకున్నాడా..? తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ ; కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాప్ట్వేర్ కంపెనీలో మేనేజర్. పని విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే కార్తీక్ అంటే ఆఫీస్‌లో ఎంప్లాయిస్ అందరికీ భయం. ఎప్పుడు ఎవరిని ఉద్యోగం నుంచి తీసేస్తాడా అని అంతా భయపడుతూ పనిచేస్తుంటారు. ఎప్పటికైనా కంపెనీలో ప్రమోషన్ సాధించి అమెరికా వెళ్లాలని ఆశపడుతుంటాడు కార్తీక్. ఆ కలను నిజం చేసుకునేందుకు ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా కష్టపడుతుంటాడు. ఈ సమయంలో కొన్ని పరిస్థితుల కారణంగా కార్తీక్ తన తండ్రి(నాజర్)తో ఓ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. తాను సిరి అనే అమ్మాయిని ప్రేమించానని తండ్రితో చెపుతాడు కార్తీక్. దీంతో కార్తీక్ తండ్రి, సిరిని కలిసేందుకు హైదరాబాద్ వస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో షార్ట్ ఫిలింస్‌లో నటించే ఇంజనీరింగ్ స్టూడెంట్ మేఘన(నభ నటేష్)ను తన గర్ల్ ఫ్రెండ్‌గా నటించేందుకు ఒప్పందం చేసుకుంటారు కార్తీక్. కానీ మేఘన మంచితనం, ప్రేమ నచ్చి వారిద్దరి పెళ్లికి కార్తీక్ వాళ్ల నాన్న అంగీకరిస్తాడు. అదే సమయంలో కార్తీక్‌కి కూడా మేఘన మీద ఇష్టం కలుగుతుంది. మేఘన కూడా కార్తీక్‌ను ఇష్టపడుతుంది. కానీ మేఘనతో ఎక్కువ సమయం గడుపుతుండటంతో కార్తీక్‌కు ఆఫీస్‌లో ఓ సమస్య ఎదురవుతుంది. దీంతో తన గోల్‌కు దూరమవుతున్నా అన్న భయంతో మేఘనను దూరం పెడతాడు. అదే సమయంలో మేఘనకు దూరమవుతున్నందుకు బాధపడుతుంటాడు. చివరకు కార్తీక్ ఏ నిర్ణయం తీసుకున్నాడు..? గోల్ కోసం మేఘనను వదులుకున్నాడా.? లేక మేఘన కోసం గోల్‌ను పక్కన పెట్టాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సుధీర్ బాబు నిర్మాతగా మారేందుకు పర్ఫెక్ట్గా తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను ఎంచుకున్నాడు. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా రొమాంటిక్ కామెడీతో అలరించాడు. తాను సీరియస్‌గా ఉంటూనే ఆడియన్స్‌ను నవ్వించటంలో సక్సెస్ సాధించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా ఆఫీస్‌లో ఎంప్లాయిస్లు టార్చర్ పెట్టే సీన్స్‌లో సుధీర్ నటన సూపర్బ్. హీరోయిన్ గా పరిచయం నబా నటేష్ బబ్లీ గర్ల్‌గా ఆకట్టుకుంది. నభకు తొలి సినిమాలోనే మంచి వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కింది. నటన పరంగా పరవాలేదనిపించిన నభ, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నాజర్ ఒదిగిపోయారు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్‌లో నాజర్ నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో పృథ్వీ, తులసీ, సుదర్శన్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుధీర్ బాబు నిర్మాతగా మారేందుకు హార్ట్ టచింగ్ ఎంటర్టైనర్ను ఎంచుకున్నాడు. లవ్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్న పర్ఫెక్ట్ ప్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు ఆర్ఎస్ నాయుడు, నిర్మాత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి భాగం హీరో ఆఫీస్ సీన్స్‌తో పాటు, హీరోయిన్‌తో లవ్ సీన్స్‌తో సినిమా ఎంటర్టైనింగ్గా సాగింది. అయితే కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండనిపిస్తుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి దర్శకుడు మరింత స్లో అయ్యాడు. ప్రతీ సన్నివేశం నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. ప్రీక్లైమాక్స్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం కూడా సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. పాటలు పరవాలేదనిపించినా, నేపథ్య సంగీతం సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. సురేష్ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్ నిరాశపరిచింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగటం సినిమాకు మైనస్ అయ్యింది. సుధీర్ బాబు సొంత సినిమా కావటంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ అవుట్‌పుట్ ఇచ్చేందుకు కష్టపడ్డాడు. ప్లస్ పాయింట్స్ ; సుధీర్ బాబు క్యారెక్టర్ కామెడీ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; నెమ్మదిగా సాగే కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మహేశ్ సినిమా కోసం గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నా
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాల కోసం తిరిగినప్పుడు చాలాసార్లు నిరాశే ఎదురైంది. అప్పుడు అనుకున్నాను సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం వస్తే కొత్తవాళ్లకు చాన్స్ ఇవ్వాలని. నటుడిగా కొన్నేళ్ల తర్వాత ఫేడ్ అయినా బ్యానర్ మాత్రం సురేశ్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లాగా తరతరాలుగా ఉండిపోతుందనిపించింది. అందుకే స్టార్ట్ చేశాను’’ అన్నారు సుధీర్‌బాబు. ఆర్.ఎస్. నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు. ► యాక్టర్‌గా సీన్లో లీనమవ్వాలంటే మైండ్ క్లియర్‌గా ఉండాలి. నిర్మాత కూడా నేనే కావడంతో సెట్లో ఏదైనా వేస్ట్ అయిందనిపిస్తే అప్సెట్ అవ్వడం సహజం. మొత్తానికి హీరోగా, నిర్మాతగా బాలెన్డ్స్‌గానే వ్యవహరించా. ► నిర్మాత అవుతున్నానని మహేశ్‌కి చెప్పగానే ‘సరే’ అన్నా కంగారుపడి ఉంటాడనుకుంటున్నా. హీరో అవుతానన్నప్పుడు కూడా ‘సరే’ అన్నాడు. అయితే నాకు మొహమాటం. ఈ ఇండస్ట్రీలో నా విధానం నప్పుతుందో లేదోనని కంగారుపడ్డాడు. మహేశ్‌కి సరిపోయే కథ దొరికితే నిర్మిస్తాను. తనతో సినిమా నిర్మించడం కోసం ఇది గ్రౌండ్ ప్రాక్టీస్ అనుకుంటున్నా. ► సెప్టెంబర్ 13న మా సినిమా రిలీజ్ అని ఫస్ట్ మేమే అనౌన్స్ చేశాం. కానీ భార్యా భర్తలు పబ్లిక్‌లో తక్కువసార్లు పోటీ పడతారు. (నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్’ ఒకే రోజు రిలీజ్ గురించి). అందుకే వాళ్ల మధ్యలో వెళ్లి వేళ్లు కాల్చుకోవడం ఎందుకని రిలీజ్‌ని వారం వాయిదా వేసుకున్నాం (నవ్వుతూ). ► వీడు ఇది చేయలేడేమో అన్న ప్రతిసారీ దాన్ని బ్రేక్ చేస్తున్నాను. ‘యస్‌యమ్‌ఎస్’లో నా వాయిస్ బాగా లేదన్నారు. దాని మీద వర్క్ చేశాను. యాక్షన్ సినిమాలే చేస్తాడేమో అన్నారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ లాంటి లవ్‌స్టోరీ చేశాను. అలాగే సెటిల్డ్ రోల్స్ చేయాలని ‘సమ్మోహనం’, ఈ సినిమా చేశా. ప్రస్తుతానికి మల్టీస్టారర్ మూవీస్ వద్దనుకుంటున్నా. ► మనంతట మనం నిలబడాలనుకునే మనస్తత్వం గలవాణ్ని. పద్మాలయ బేనర్ ఉన్నప్పటికీ మహేశ్, ఇందిరా ప్రొడక్షన్స్ బేనర్లు స్టార్ట్ అయ్యాయి. నా బేనర్ కూడా అంతే. కథ బావుండి, నేను కాకుండా ఫలానా హీరోలు చేస్తే బావుండు అనిపిస్తే వేరే హీరోలతో కూడా నిర్మిస్తాను. అలాగే ఓన్ బ్యానర్ స్టార్ట్ చేసినా బయట ప్రొడక్షన్లో కూడా సినిమాలు చేస్తా. నెక్ట్స్ ‘వీరభోగ వసంత రాయ లు’, పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్నాను. -
కొడుకో.. కూతురో పుట్టినట్టుంది
‘‘మా ప్రొడక్షన్లో వస్తున్న తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఆర్.ఎస్.నాయుడు చెప్పిన కథ హీరో సుధీర్‌బాబుతో పాటు ప్రొడ్యూసర్ సుధీర్‌బాబుకి బాగా నచ్చేసింది (నవ్వుతూ). హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగా ఎంజాయ్ చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది’’ అని సుధీర్‌బాబు అన్నారు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నటేశ్ కథానాయిక. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారి పేరు (పోసాని రాణి) పెట్టి సినిమా చేస్తున్నాననే టెన్షన్ ఉండేది. సినిమా అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఆర్.ఎస్.నాయుడు చాలా మెతక మనిషి అనుకుంటాం. కానీ ఈ చిత్రం చూసిన తర్వాత ఎంత బాగా తీశాడో అనుకుంటాం’’ అన్నారు. ‘‘నేను చేసిన 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో సుధీర్‌బాబుగారు ఈ సినిమా నిర్మించారు. ‘సమ్మోహనం’తో నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు. మా సినిమాతో ఆయన నటన గురించి ఇంకా మాట్లాడుకుంటారు’’ అన్నారు ఆర్.ఎస్. నాయుడు. ‘‘కొత్తగా ప్రొడక్షన్లోకి ఎంట్రీ ఇస్తున్న సుధీర్‌గారికి అభినందనలు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అన్నారు నిర్మాత కేకే రాధామోహన్. ‘‘నా దృష్టిలో సుధీర్ వన్నాఫ్ ది బెస్ట్ యాక్టర్స్. అతని సామర్థ్యాన్ని తెలుగు ఇండస్ట్రీ తక్కువగా వాడుకుంటోందని అనుకుంటున్నా. నటుడిగా తన సత్తా బయటపెట్టే మంచి స్క్రిప్ట్స్ రావాలి’’ అన్నారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘భాగి’ సినిమాలో సుధీర్ స్క్రీన్ ప్రెజన్స్‌కి నేను ఫ్యాన్ అయితే.. ‘సమ్మోహనం’ సినిమాలో తన నటనకు అభిమాని అయ్యాను. తెలుగు సినిమా మారుతోంది. మంచి కంటెంట్ సినిమాలు, మంచి సక్సెస్‌లు వస్తున్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. నభా నటేశ్, నిర్మాతలు రాజీవ్, శివలెంక కృష్ణ ప్రసాద్, అనీల్ సుంకర, హీరోలు రాహుల్ రవీంద్రన్, çసందీప్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
‘నన్ను దోచుకుందువటే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
తెలుగు మాట్లాడటం వచ్చు కానీ..!
‘‘తెలుగులో నా తొలి చిత్రం ‘అదుగో’. రెండో సినిమా ‘నన్ను దోచుకుందువటే’. అయితే.. విడుదల పరంగా చూస్తే ‘నన్ను దోచుకుందువటే’ నా మొదటి చిత్రం. నేను నటించిన కన్నడ సినిమాలు చూసిన ఆర్.ఎస్. నాయుడుగారు నన్ను సంప్రదించారు. కథ, నా పాత్ర నచ్చడంతో నటించా’’ అని నభా నటేశ్ అన్నారు. సుధీర్ బాబు, నభా నటేశ్ జంటగా ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నభా నటేశ్ మాట్లాడుతూ– ‘‘నేను కన్నడ అమ్మాయిని. తెలుగు మాట్లాడటం వచ్చు. అయితే వాక్య నిర్మాణం చక్కగా ఉండదు. తెలుగు సినిమాల్లో నటించడం వల్ల ఇప్పుడు బాగా నేర్చుకున్నా. సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో కాలేజీ రోజుల్లోనే థియేటర్ ఆర్టిస్ట్‌గా కోర్సు చేసి, చాలా స్టేజ్ షోస్ చేశా. మోడలింగ్ కూడా చేశాను. థియేటర్‌తో పోల్చితే కెమెరా యాక్టింగ్ కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంలో అన్ని ఎమోషన్స్ ఉన్న పాత్ర చేశా. హోమ్ వర్క్ చేయడం వల్ల చాలా కూల్‌గా చేయగలిగాను. ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా సంతోషాన్నివ్వడంతో పాటు ప్రతిరోజూ కొత్తగా అనిపించేది. సుధీర్‌గారు మంచి సహనటుడు, నిర్మాత. కొత్త హీరోయిన్ కాబట్టి నాకు మంచి స్పేస్ ఇచ్చారు. సుధీర్‌గారు, నాయుడుగారు నాపై నమ్మకంతో ఇంత మంచి అవకాశం ఇవ్వడం నా లక్’’ అన్నారు. -
ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్లకు అయ్యింది
సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నతేశ్ హీరోయిన్. ఆర్.ఎస్. నాయుడు (రాజశేఖర్ నాయుడు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు పలు విశేషాలు పంచుకున్నారు. ► మాది అనంతపూర్‌లో తాడిపత్రి. డిగ్రీ కంప్లీట్ చేశాను. సినిమాల మీద విపరీతమైన ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను. సెమిస్టర్ మధ్యలో ‘నీ మాయలో’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. మంచి రీచ్ వచ్చింది. ఓ ఆఫర్ కూడా వచ్చింది. కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడే సినిమా స్టార్ట్ చేయాలని ఆ ఆఫర్‌ని వద్దన్నాను. ► ఏ దర్శకుడి దగ్గర అయినా పని చేస్తే వాళ్ళ ప్రభావం మన మీద పడిపోతుందేమో అని ఎవ్వరి దగ్గరా వర్క్ చేయలేదు. ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఆఫర్స్ కోసం చూస్తుంటే ‘ఎవరి దగ్గర పని చేశావు?’ అని అడిగేవారు. అప్పుడు ‘స్పందన’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. పెద్దగా రీచ్ అవ్వలేదు. కానీ రీచ్ అవ్వాల్సిన వాళ్లకు రీచ్ అయింది. ఒక ప్రొడ్యూసర్ కథ ఉందా? అని అడిగారు. ► నా కథ పట్టుకొని సుధీర్‌బాబు వాళ్ల మేనేజర్‌కి చెప్పాను. నేను చేసిన తప్పేంటంటే కథను హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో చెప్పాను. ఆ తర్వాత వేరే ప్రొడ్యూసర్‌కి ఇదే కథ చెప్పాను. ఆయనే మళ్లీ సుధీర్‌కు చెప్పారు. అలా ఈ కథ సుధీర్‌కే Ðð ళ్లింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని నన్ను సుధీర్ దగ్గరకు తీసుకువెళ్లిన నిర్మాతే నిర్మించాలి. కానీ మా ఇద్దరికీ ఎందుకో సఖ్యత కుదిరినట్టు అనిపించలేదు. అదే విషయం సుధీర్‌కి చెబితే సరే.. నేనే నిర్మిస్తా అన్నారు. ► ఫిల్మ్ స్కూల్లో నా ఫ్రెండ్ ‘వెళ్ళిపోమాకే’ తీశాడు. అది బావుంది అన్నారు కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. అప్పుడే అనిపించింది, ఎక్కువ మందికి రీచ్ అవ్వడమే ముఖ్యం అని ఫిక్స్ అయ్యాను. ► హీరోది మొత్తం నా క్యారెక్టరైజేషనే. హీరో నాన్న, బాబాయ్ పాత్రలకు కూడా మా నాన్న, బాబాయ్లనే ప్రేరణగా తీసుకుని రాసుకున్నాను. అలాగే పేర్లు కూడా అవే పెట్టాను. హీరోకు మాత్రం వేరే పేరు పెట్టాను (నవ్వుతూ). హీరోయిన్ పాత్ర మాత్రం నాకు ఆపోజిట్‌గా ఉండేట్టుగా హైపర్‌గా, ఎనర్జిటిక్‌గా రాశాను. ► కొత్తగా ఏదో చెప్పాం అనడంలేదు. కానీ కొత్త క్యారెక్టరైజేషన్స్‌తో ఎంటర్టైనింగ్గా చెప్పాం. కంటెంట్‌ని, కమర్షియాలిటీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాం. సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకముందే ఓ మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ విషయాలు త్వరలోనే వెల్లడిస్తాను. -
‘నన్ను దోచుకుందువటే’ సెన్సార్ పూర్తి
‘సమ్మోహనం’ సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో తన తదుపరి సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ సర్టిఫికెట్ పొందిన ‘నన్ను దోచుకుందువటే’ మూవీని సెప్టెంబర్‌ను 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. .@isudheerbabu- @nabhanatesh's #NannuDochukunduvate censored with clean 'U' & got raving reception from the censor board members!! @rsnaidu77 @ajaneeshb @sbpoffl_ #NannuDochukunduvateOnSep21 pic.twitter.com/mXfjojKSnH — BARaju (@baraju_SuperHit) September 14, 2018 -
‘నన్ను దోచుకుందువటే’ మూవీ స్టిల్స్
-
కనెక్ట్ అవుతారు
‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రం తర్వాత సుధీర్‌బాబు నటించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఇందులో నభా నటేశ్ కథానాయిక. ఆర్.ఎస్.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్.ఎస్. నాయుడు మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన వస్తోంది. మా టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్‌కి అందరూ కనెక్ట్ అవుతారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా చిత్రం ప్రీ–ప్రమోషనల్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్.ఎస్.నాయుడు చాలా మంచి కథ, స్క్రీన్‌ప్లేతో సినిమా రూపొందించాడు. ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రం తర్వాత, నా సొంత బ్యానర్లో నిర్మిస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సాయి వరుణ్. -
హీరో సుధీర్ సందడి
పశ్చిమగోదావరి, భీమవరం: సినీ నటుడు సుధీర్‌బాబు నటించిన ‘నన్నుదోచుకుందువటే’ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం ఆదివారం భీమవరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా స్థానిక త్యాగరాజ భవనంలో పట్టణంలోని కృష్ణ, మహేష్ సుధీర్‌బాబు అభిమాన సంఘం చిత్రయూనిట్‌కు స్వాగతం పలికింది. కృష్ణ, మహేష్ ఫ్యాన్ అధ్యక్షుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభిమానులు సుధీర్‌బాబుకు జ్ఞాపిక బహూకరించారు. -
సెప్టెంబర్ 21న ‘నన్ను దోచుకుందువటే’
సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో ‘నన్ను దోచుకుందువటే’తో సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా వినాచక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’, సమంత ‘యు టర్న్’ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సుధీర్ బాబు తమ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. -
కొత్త జంట
‘సమ్మోహనం’ సినిమాతో నటనలో మరో మెట్టు పైకి ఎక్కారు సుధీర్‌బాబు. వచ్చే నెల ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఈ ఏడాది మళ్లీ థియేటర్లోకి రానున్నారాయన. మరి.. ఇప్పుడేం చేస్తున్నారు అంటే కొత్త సినిమాకు రేపు కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో మెహారీన్ కథానాయికగా నటిస్తారు. రిజ్వాన్ నిర్మించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం జరగనుంది. నిర్మాత ‘దిల్’రాజు, దర్శకుడు వీవీ వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ఖుర్షీద్ సహ నిర్మాత. ఇలా మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మస్త్ బిజీగా ఉంటున్నారు హీరో సుధీర్‌బాబు. -
మౌనం మాట తోటి
‘గులేబకావళి కథ’ చిత్రంలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని..’ పాట ఎంత హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఆ పాట ఎక్కడ వినిపించినా ఎన్టీఆర్, జమునలు గుర్తుకురాక మానరు. అంతలా పాపులర్ అయిన ఆ పాట పల్లవిని సుధీర్‌బాబు తాజా చిత్రానికి టైటిల్‌గా పెట్టారు. ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వంలో సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నన్ను దోచుకుందవటే’. సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలోని ‘మౌనం మాటతోటి..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. అజనీష్ లోకనాథ్ స్వరపరచి పాడిన ఈ పాటకు శ్రీ మణి సాహిత్యం అందించగా, విజయ్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సుధీర్‌బాబుగారి బ్యానర్లో తొలి చిత్రానికి నేను దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. నన్ను, నా కథను నమ్మి అవకాశం ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సాయి వరుణ్. -
హడలెత్తించే బాసు... అల్లరి అమ్మాయి
ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులందర్నీ హడలెత్తించే మేనేజర్ అతను. అల్లరి చేసే ఓ గడసరి అమ్మాయి ఆ ఆఫీస్‌లో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత జరిగిన హంగామాను వెండితెరపై చూడండి అంటున్నారు ‘నన్ను దోచుకుందువటే’ టీమ్. సుధీర్‌బాబు, నభా నటేశ్ జంటగా ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఒక్క సాంగ్ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ‘సమ్మోహనం’ వంటి హిట్ మూవీ తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న ఈ సినిమాపై అంచనాలున్నాయి. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ బాగా నటిస్తోంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశాం. సెప్టెంబర్ 13న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు. నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ నటిస్తున్న ఈ సినిమాకు అంజనీష్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎస్. సాయి వరుణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
దోచుకోవాలని...
వినాయక చవితికి వస్తున్నారు సుధీర్‌బాబు. అవును.. ప్రేక్షకుల మనసులు దోచుకోవడానికి రెడీ అవుతున్నారు. ‘సమ్మోహనం’ విజయంతో జోష్ మీదున్న సుధీర్‌బాబు సొంత సంస్థ సుధీర్ బాబు ప్రొడక్ష¯Œ ్స బ్యానర్లో ఆర్.ఎస్.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తూ, హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్‌గా సుధీర్, గడుసు పిల్లలా నభా నటేశ్ నటించారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్, నభాల జోడీ అందరి మనసులను దోచుకునే విధంగా ఉంటుంది. సెప్టెంబర్ 13న సినిమాని విడుదల చేస్తాం. అంతకు ముందు రోజు ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నాం. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి, ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సాయివరుణ్. -
వినాయక చవితికి ‘నన్ను దోచుకుందువటే’
‘సమ్మోహనం’ లాంటి కూల్ హిట్ కొట్టాడు సుధీర్ బాబు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లాంటి ఫీల్ గుడ్ మూవీ తరువాత చాలా గ్యాప్ తీసుకుని పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రాన్ని చేశాడు. తాజాగా మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌ను స్థాపించి, ఆ సంస్థలో మొదటి సినిమాగా నన్నుదోచుకుందువటే చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఈ సినిమా కూడా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. సుధీర్ బాబుకు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. ఈ సినిమాతో ఆర్ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
ఆ టీజర్‌పై దర్శకుడి ప్రశంసలు
సమ్మోహనంతో క్లాస్ హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చారు సుధీర్ బాబు. సినిమాలోని తన నటనకు ప్రశంసులు దక్కాయి. హీరోగానే కాకుండా..నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెట్టారు సుధీర్ బాబు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌పై ‘నన్ను దోచుకుందువటేవ’ సినిమాను చేస్తున్నారు ఈ యంగ్‌హీరో. తాజాగా నన్ను దోచుకుందువటే సినిమా టీజర్‌ను రిలీజ్చేశారు. ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. సమ్మోహనం సినిమాలానే ఈ మూవీ కూడా విజయవంతం అయ్యేలా కనిపిస్తోంది. ఈ టీజర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్‌పై దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ.. ‘ టీజర్ చాలా బాగుందిరా. సమ్మోహనం సినిమాలానే ఇది కూడా మళ్లీ హిట్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. నిర్మాతగా సక్సెస్ సాధించాలి. ఆల్ ది బెస్ట్.’ అంటూ ట్వీట్ చేశారు. -
‘నన్ను దోచుకుందువటే’ టీజర్ విడుదల
-
‘అది ఐఫోన్లో ఉండే సిరి రా’
యువ నటుడు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మరో ఆసక్తికర చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ సుధీర్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఆర్ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే డిఫరెంట్ పోస్టర్లతో ఆకట్టుకున్న టీం, తాజాగా టీజర్‌ను స్టీలర్ పేరుతో రిలీజ్ చేశారు. సుధీర్ బాబు టిపికల్ మెంటాలిటీ ఉన్న మేనేజర్ పాత్రలో కనిపిస్తుండగా హీరోయిన్ నభా నటేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల్లో నాజర్, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
దోచుకునేందుకు వస్తున్నారు!
సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన గులేభకావళి కథ చిత్రంలోని సూపర్ హిట్ పాట పల్లవినే ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సుధీర్ బాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్ బి లోకనాథ్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్వచ్చింది. తాజాగా సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూలై 14 ఉదయం పది గంటల రెండు నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. -
నన్ను దోచుకుందువటే
‘సమ్మోహనం’ వంటి హిట్‌తో మంచి ఊపుమీదున్నారు సుధీర్ బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభ నతేశ్ కథానాయిక. ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సుధీర్ బాబు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కోణంలో, కొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది. కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో రూపొందింది. ‘నన్ను దోచుకుందువటే’ టైటిల్ ప్రకటించగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రొడక్షన్ విలువలు ఎక్కడా తగ్గకుండా సుధీర్‌బాబుగారు చూసుకున్నారు. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభ నతేశ్ చాలా బాగా చేశారు. అజనీష్ సంగీతం సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. చిత్రీకరణ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది’’ అన్నారు. నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సాయి వరుణ్.