పెద్దలే కాదు.. పిల్లలు పొగరాయుళ్లే!
వాషింగ్టన్ : పిల్లలు.. ఏపాపం తెలియని చల్లని వారే అనేది మనకు తెలిసిన సత్యం. కానీ ప్రస్తుత తాజా గణంకాలు మాత్రం పిల్లలు పొగరాయుల్లే అని చెబుతున్నాయి. పెద్దలు పొగ త్రాగడం పరిపాటే అయినా. పిల్లలు పొగ త్రాగడానికి ఇష్టపడటం ఏమిటని అనుకుంటున్నారా. పెద్దలు ఇచ్చే అలసత్యమే పిల్లలు పొగ త్రాగే అలవాటుకు దారి తీస్తుందని తాజా విశ్లేషణలో తేలింది. భారతదేశంలో 30 శాతానికి పైగా పిల్లలు ప్రొగ త్రాగడానికి ఇష్ట పడతారని వెల్లడైంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన దేశాలు, ఇప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలలో ఈ జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, చైనా దేశాలలో పిల్లలు ప్రక్కతోవ పట్టడం అనేది ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని షాపుల్లో 5 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కూడా పొగాకు విక్రయిస్తుండటం కూడా వారు దానివైపు మళ్లేందుకు దోహదం చేస్తుందని విశ్లేషణలో వెల్లడైంది. ఈ చర్యల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలంటే తల్లి దండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు , మీడియాకు దీనిపై అవగాహన కల్పించాలని అవసరం ఉంది.