akshara thuniram
-
ఒకే కుదురు
ఏవిటి ఈసారి మీ ఎజెండా? అన్న ప్రశ్నకి, ‘పవర్లోకి మళ్లీ రావడం’ అని వెంటనే జవాబిచ్చాడు అగ్రనేత. ‘కిందటిసారి కూడా మీ మానిఫెస్టో సారాంశం అదే కదా’ అన్నాడా పత్రికా ప్రతినిధి. అందుకు నేత నవ్వి ‘‘లేదు... పవర్‌ని పార్టీ పెద్దలు పదిమందీ పంచుకుని పాలించాలని అప్పటి మాని ఫెస్టోలో చెప్పాం. కచ్చితంగా, అదే ఆచరించి చూపించాం’ అని స్పష్టం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. తెలం గాణలో ‘గరుడ వస్త్రం’ వేసినట్టే. వైష్ణవ సంప్ర దాయంలో ఉత్సవాలకు ముందు ధ్వజస్తంభానికి జెండాలాగా దీన్ని ఎగరేస్తారు. ఇది దేవతలకు ఆహ్వానం. దేవ తలు, దేవగణాలు ఆకాశంలో దీన్ని చూసుకుని, ఉత్సవాలకు తరలివస్తారు. కొందరేమం టారంటే– అబ్బే ఇదంతా వట్టి సందడి. ఎన్నికలు ముందస్తుగా రానేరావు అంటూ పందాలు కడుతు న్నారు. ‘ప్రజాస్వామ్యమంటే ప్రజలతో ఆడుకోడం’ అని ఓ నిర్వచనం ఉంది. నిన్నగాక మొన్న ఓటేసి వచ్చినట్టుంది. ఇంకా బూత్‌లో వేసిన పచ్చబొట్టు సాంతం చెరగనే లేదు. కొన్ని గోడలమీద రాసిన ‘.... కే మీ ఓటు’ రాతలు కనుమరుగు అవలేదు. నాయకులు చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఇంకా చెవి గూట్లోనే ఉన్నాయ్. అప్పుడే మళ్లీ ఎన్నికలా?! ఆశ్చర్యంగా ఉంది కొందరికి. బహుశా చంద్రబాబు ముందస్తుకి మొగ్గుచూపక పోవచ్చు. మోదీ మీద కత్తులు పదును పెట్టడానికి కొంచెం వ్యవధి అవసరం. పనులన్నీ ‘బ్లూప్రింట్ల’ లోనే ఉన్నాయ్.పోలవరం గురించి పాజిటివ్‌గా చెప్పాలంటే సగం పూర్తయింది. నెగటివ్‌గా చెప్పాలంటే ఇంకా సగం మిగిలే ఉంది. కాపిటల్ నిర్మాణం శంకు స్థాపనల దశలోనే ఆగింది. నాలుగేళ్లుగా దేన్ని పట్టు కున్నా యెక్కి రాలేదు. ఢిల్లీ నుంచి బోలెడు వరద వస్తుందని, ఖజానా పొంగి పొర్లుతుందని ఆశిస్తే అది కూడా తేలిపోయింది. ఇక ఇప్పుడు చంద్ర బాబుకి మిగిలిన ఆఖరి గడి కాంగ్రెస్‌తో పొత్తు. ఈ పొత్తుని ఎట్లా సమర్థించుకుంటూ జనంలోకి వెళ్తారో తెలియదు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారెవరో. ఇంతకు ముందు పాపం అన్నగారి ఆత్మ ఎన్నోసార్లు క్షోభిం చింది. ఆత్మక్షోభ అలవాటు చేశాం కాబట్టి అదొక సమస్య కాదు. ఇప్పుడు మనముందున్న సమస్యల్లా పీఠాన్ని కైవసం చేసుకోవడం ఎలా అన్నది. అయినా వ్రతం చెడ్డా, ఫలం దక్కుతుందో లేదో అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకా గ్రామీణ ప్రాంతంలోనే కాసినో కూసినో కాంగ్రెస్ ఓట్లు రెపరెపలాడుతున్నాయి. ఇంకా ఇందిరమ్మ పేరు గ్రామాల్లో వినిపిస్తుంది. చంద్రబాబుకి గ్రామాల్లో బొత్తిగా పలుకుబడి లేదు. ఒకప్పుడు బీసీ ఓట్లు టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉండేవి. అవన్నీ ఎన్టీఆర్ పోవడంతో చెల్లాచెదురైనాయి. చంద్ర బాబు అన్నిదారులూ క్షుణ్ణంగా చూశాకనే చేత్తో చెయ్యి కలపాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారు. ‘పవర్ పట్టు’ విషయంలో చంద్రబాబు నీతి నియ మాలను లెక్క చెయ్యరు. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో బోలెడు దార్లు తొక్కారు. దేనికీ అధిక ప్రాధాన్యత ఇవ్వక, ముక్కుసూటిగా నడుస్తూ, ఆ ముక్కుని అధికార పీఠం వైపు సారించి సాగుతూ వచ్చారు. ఇక హవా అంతా రీజనల్ పార్టీలదే అంటూ, తిరిగి కాంగ్రెస్‌తో కలవడం ఒక విడ్డూరం. మనం అంటే జనం ఒక్కమాట గుర్తుంచు కోవాలి. రాజకీయం అంతా ఒక్కటే. జాతీయం లేదు, స్థానికం లేదు. నేతలంతా ఈ గడ్డమీద పుట్టి, ఈ గాలి పీల్చి, ఈ నీళ్లు తాగి పెరిగిన వాళ్లే. కనుక రంగులు మారేదేమీ ఉండదు. ఎక్కడో దూరాన ఉన్నవాళ్లు అఖండ గోదావరి గురించి అనేక విధాలుగా అనుకుంటారు. ఆరాధించి కవిత్వాలు అల్లుతారు. ఇక్కడ ఉండేవాళ్లు అదే గోదావరిని మురుగు కాలువకంటే హీనంగా చూస్తారు. మన ఊరు పక్కగా వెళ్తోంది కాబట్టి మనకేమీ గొప్పగా అనిపించదు.కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే అవచ్చుగానీ, వందేళ్లకి పైబడి జనం మధ్య తెగ నలిగిపోయి ఉంది. స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అనే పేరు ఎప్పుడో చెరిగిపోయింది. చంద్రబాబు పొత్తు పెట్టు కుంటే ఏమీ కొత్తదనం ఉండదు. చంద్రబాబు కాంగ్రెస్ కుదురులోంచి వచ్చినవారే కదా. తిరిగి రాజకీయం రాజకీయంలాగే కొనసాగుతుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇప్పుడేమంటారు మహాశయా!
‘చెవి కోసుకోవడం’ మన అచ్చ తెలుగు జాతీయం. అందుకని ఇక్కడ చెవి కోసుకోవడమంటే, ఫలితాలు వినడానికి ఆసక్తి చూపుతాననే అర్థంలో గ్రహించి, పుట్టుకతో వచ్చిన ఆయన చెవులను చెక్కు చెదరక పోనీయడం మంచిది. చివరకు ఇలా జరిగింది! ఆఖరికి ఇలాగే జరిగింది! అనుకున్నంతా అయింది! - ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏకవాక్య విశ్లేషణ ఈ మూడింటిలోనే ఉంటుంది. ఎన్నికలు కూడా యుద్ధనీతిని అనుసరించి నడుస్తాయి. కాకపోతే, రణరంగంలో రెండే పక్షాలుంటాయి. ఎన్నికల పోరులో నాలుగైదు నుంచి పది పన్నెండు పక్షాలు బరిలో ఉంటాయి. ఓటర్లని ఓట్లని చీల్చేస్తూ కొన్ని పక్షాలు శ్రమిస్తుంటాయి. పాపం, వాళ్లు గెలవరు. కాని వాళ్లవల్ల మరెవరో గెలిచేస్తారు. ఇలా గెలుపు ఆశించకుండా చీల్చేసే వారిని ‘శిఖండిగాళ్లు’ అంటుంటారు. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఈ రెండు క్షేత్రాల్లోనూ తప్పదు. యుద్ధరంగంలో శక్తిహీనుడు కూడా ఊరికే విజయోత్సాహంతో రంకెలు వేస్తుంటాడు. అవతలివాడిని మానసికంగా దెబ్బతీయడానికి ఇదొక యుద్ధతంత్రం. ఎన్నికల క్షేత్రంలో కూడా అంతే. డిపాజిట్లు రావని తెలిసి కూడా పటాటోపపు ప్రసంగాలు చేస్తుంటారు. శత్రుపక్షాలు అంతా ఒఠిదేనని తెలిసి కూడా భయం నటిస్తూ ఉంటారు. తీరా చూస్తే ఉన్నవారిలో గట్టిగా సగం మంది కూడా ఓట్లెయ్యరు. అందులో కొంతభాగం దొంగ ఓట్లు. మరికొంత శాతం కల్తీ బాపతు. అంటే ‘ఔట్ సోర్సింగ్’ అంటే కొనుగోలు చేసినవి. ఈ భాగ్యానికి దీన్నొక ప్రజాస్వామ్యంగా, ప్రజారాజ్యంగా అభివర్ణించుకు మురిసిపోవడం! దీనిపై బెట్టింగులు, శపథాలు ఇదొక తంతు నడుస్తుంది. ఇన్ని సీట్లు రాకపోతే రాజకీయ సన్యా సం చేస్తానని ఒకాయన ప్రతిజ్ఞ చేస్తాడు. మీసాలు తీసేస్తానని మరికొందరు శపథం చేస్తారు. మొన్నటికి మొన్న ఒకాయన చెవి కోసుకుంటానని బహి రంగంగా ప్రకటించారు. నారాయణ! నారాయణ! ఈ చిన్న విషయానికి ఇంతటి ఘోర ప్రతిజ్ఞలు అవసరమా? అయితే ఒకటి, దీన్ని మరీ అంత మాటకి మాటగా తీసుకుని కత్తులు నూరి సిద్ధం చెయ్యక్కర్లేదు. ‘చెవి కోసుకోవడం’ మన అచ్చ తెలుగు జాతీయం. ‘సంగీతమంటే చెవి కోసుకుంటాడు’ అంటాం. ఎదుటివారి గొడవలంటే చెవి కోసుకుంటాడు! ఇలాంటి ప్రయోగాలున్నాయి. అందుకని ఇక్కడ చెవి కోసుకోవడమంటే, ఫలితాలు వినడానికి ఆసక్తి చూపుతాననే అర్థంలో గ్రహించి, పుట్టుకతో వచ్చిన ఆయన చెవులను చెక్కు చెదరక పోనీయడం మంచిది. పైగా ప్రజా హక్కుల కమిటీ చూస్తూ ఊరుకుంటుందా? ఐచ్ఛికంగా చెవి కోసుకోవడానికి సిద్ధపడ్డా ఊరుకోరు గాక ఊరుకోరు. ఆనాడు యుద్ధ రంగాల్లో కూడా ఇలాంటి భీషణ ప్రతిజ్ఞలుండేవి. సాయంత్రంలోగా సైంధవుణ్ణి చంపుతానని, లేకుంటే శిరసు ఖండించుకుంటానని అర్జునుడు ప్రకటించాడు. అది కృష్ణుడి పీకల మీదకి వచ్చింది. సూర్యుడికి చక్రం అడ్డువేసి బామ్మరిదిని రక్షించుకున్నాడు. అంతపని అవసరమా? కృష్ణుడు దివ్య దృష్టితో సైంధవుడికి వేరెబౌట్స్ తెలుసుకుంటే అయిపోదూ! ఒక్కోసారి దేవుళ్లు కూడా కొన్ని తమాషాలు చేసి, వార్తల్లోకి ఎక్కుతుంటారు- మన పొలిటీషియన్స్లాగా! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎక్కడ బాపూ నీ బొమ్మ?
హారతి గోదావరికి ఇవ్వాల్సిందే, దానితో పాటు ఆర్థర్ కాటన్‌కి కూడా ఇచ్చుకోవడం కనీస ధర్మం అన్నారు అక్కడి పురజనులు. ప్రసిద్ధ చిత్రకారుడు బాపు పోయినప్పుడు నివాళులర్పిస్తూ, నిండుసభలో మాట ఇచ్చారు. బాపు విగ్రహం ప్రతిష్టిస్తామని చెబితే పిచ్చి తెలుగువాళ్లు కాబోలని తెగ మురిసిపోయారు. ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు! అవి ఎట్లాగో ఏమిటో అర్థం కాలేదు. పోల వరం ప్రాజెక్టు మీద పాట! దానికీ, దీనికీ పొంతనేమిటో తెలియరాలేదు. పట్టిసీమ పథ కంపై పల్లవి! అదిప్పుడు అవ సరమా? భక్తి, ముక్తిలకు సం బంధించిన ఈ పుష్కరవేళ ఈ సుత్తి ఎందుకని కొందరు బాహాటంగానే గుసగుసలాడుకున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గోదావరి హారతిని ప్రారంభిస్తూ శంఖా న్ని విజయ సంకేతంగా పూరించారు. అదిరిందన్నాయి పార్టీ శ్రేణులు. అది డబ్బింగు, వెనకాల ఎవరో ఊదార న్నారు గిట్టని శ్రేణులు. హారతి గోదావరికి ఇవ్వాల్సిందే, దానితో పాటు ఆర్థర్ కాటన్‌కి కూడా ఇచ్చుకోవడం కనీస ధర్మం అన్నారు అక్కడి పురజనులు. మూడు యాభైలకు మునుపే కోనసీమ పండితులు ఒక శ్లోకంలో కాటన్ దొరను స్తుతిస్తూ అర్ఘ్యం వదిలేవారట. ఇప్పటికీ కొందరు గోదావరి తీరవాసులు పుష్కరవేళ ఆర్థర్ కాట న్కి కూడా తమ పెద్దలతో బాటు పిండప్రదానం చేస్తా రట. గోదావరిని ప్రసన్నం చేసుకుని ప్రజకు వరప్రదా యినిగా మలచిన మహనీయుడాయన. ఆయనకో పూదండ వేసి, హారతి ఇస్తే పుణ్యం పురుషార్థం. ఆర్థర్ కాటన్ పేరు మీద ‘గోదావరి వాటర్ యూనివర్సిటీ’ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారని కొందరు తలపోశారు. ఎం దుకో తలపుయ్యలేదు. నీటి నిర్వహణ, నీటి కాలుష్య నివారణ, జల రవాణా సదుపాయం లాంటి అంశాలపై ఆ విశ్వవిద్యాలయంలో కోర్సులుంటాయి. కావాలంటే జల విద్యుత్తు కూడా కలుపుకుందాం. ఆయన మ్యాన్ ఆఫ్ ఐడియాస్! వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే అదంతా తమ చల వేనని చెప్పుకునే స్థాయికి వెళ్లాయి రాజకీయ పార్టీలు. ఆ మధ్య ఒక అరబ్ షేక్ ఏడు నక్షత్రాల హోటల్లో బస చేశాడు. హోటల్ మేనేజర్ వచ్చి, ‘షేక్‌సాబ్! వర్షం చూస్తారా?! వర్షంలో తడుస్తారా?!’ అన్నాడు, సవిన యంగా. షేక్ గారికి వాన అపురూపం కదా! ఆయన ఎగిరి గంతేశాడు. వానలో గెంతులేశాడు. అందుకు హోటల్ వారు భారీగా బిల్లు వేశారు. వాన వెలిసింది. మళ్లీ వెళ్లి, ‘సాబ్! హరివిల్లు చూస్తారా?’ అన్నాడు. చూడ్డానికెంతో చెబితే దాన్ని బట్టి చూస్తానన్నాడు షేక్జీ. అలాగే ప్రజకి కూడా అనుభవం వచ్చింది. ఎగిరి గంతు లెయ్యకుండా ఆచితూచి వేస్తున్నారు. నాకిప్పుడు ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఇటు వంటి ప్రతిష్టాత్మక శుభవేళ ఖైదీలకు కొన్ని ‘ఇరువులు’ కల్పించాలి. వాళ్లు సంకల్పితం గానో, అసంకల్పితం గానో తప్పు చేసి ఉంటారు. దానికి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అంతమాత్రం చేత వారి పెద్దలు ఆకలి దప్పు లతో అలమటించడం న్యాయమా? వారికి శ్రాద్ధవిధులు నిర్వర్తించడానికి వెసులుబాటు కల్పించాలి. క్రతువుకీ, దానధర్మాలకీ కావాల్సిన నిధులు ప్రభుత్వమే సమ కూర్చి పుణ్యం కట్టుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం మన సంప్రదాయాన్నీ, శాస్త్రాన్నీ త్రికరణశుద్ధిగా నమ్ము తున్నట్టయితే, ఖైదీలను వదలాలి. అదే గోదావరి మాత కు అసలైన కర్పూర హారతి. రాజమహేంద్రి గోదావరి తీరంలో నందమూరి తారకరాముణ్ణి కృష్ణుడి గెటప్‌లో నిలుపుతున్నారు. శుభప్రదం, శోభస్కరం. ప్రసిద్ధ చిత్ర కారుడు బాపు పోయినప్పుడు నివాళులర్పిస్తూ, నిండు సభలో మాట ఇచ్చారు. బాపు విగ్రహం ప్రతిష్టిస్తామని చెబితే పిచ్చి తెలుగువాళ్లు కాబోలని తెగ మురిసి పోయారు. అంతా హుళక్కే. ఎక్కడ బాపూ నీ బొమ్మ? (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు)