akshara
-
పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు
-
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్‌లాల్‌ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
జూబ్లీహిల్స్ : అక్షర ఆనంద్ ఆధ్వర్యంలో వైట్ నైట్ థీమ్‌తో వేడుక (ఫొటోలు)
-
Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి!
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీ మ జిల్లా సకినేటి మండలం అంతర్వేదిలో 2016లో తండ్రితోపాటు కనిపించకుండా పో యిన చిన్నారి అక్ష తల్లిదండ్రుల చెంతకు చేరింది. జిల్లా అధికారుల కృషితో పాపను సోమవారం తల్లిదండ్రులు ద్వారక, రవికుమార్‌కు సీ డబ్ల్యూసీ అధికారులు అప్పగించారు. వివరా లు.. ఈనెల 11న జిల్లాలోని సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్కు చెందిన మహిళ వద్ద అక్షను గ్రామస్తులు గుర్తించారు. బాలికకు ఎవరూ లే రని, ఉంటే చేరదీయాలని వాట్సాప్ ద్వారా స ర్పంచ్ కొత్త రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తి రుపతిరెడ్డి ప్రతిగ్రూప్‌లో షేర్ చేస్తూ సైదాపూర్ ఎస్ఐ సెల్ నంబర్‌ను పొందుపరిచారు. ఈక్రమంలో పాప కోసం రెండు కుటుంబాలకు చెందిన వారు అధికారులను ఆశ్రయించారు. కానీ పూర్తి ఆధారాలతో రావాలని శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దంపతులు పూర్తి ఆధారాలు సమర్పించారు. దీంతో పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. అధికారులను అభినందించిన కలెక్టర్ కరీంనగర్: చిన్నారి అక్షను సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పాప వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం బాగా చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. చిన్నారికి చాక్లెట్లు, పెన్ను, పుస్తకం అందజేశారు. పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కృషిచేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సంధ్యరాణి, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, సభ్యులు రెండ్ల కళింగశేఖర్, రాధ, అర్చన, విజయ్, డీసీపీఓ శాంత, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కోఆరి్డనేటర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నెట్టింట లీక్ అయిన హీరోయిన్ ప్రైవేట్ వీడియో
సోషల్ మీడియా వాడకం పెరిగాక హీరోయిన్ల ప్రైవసీ అంశం కాస్త కష్టతరమైందనే చెప్పొచ్చు. సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలు ఆన్లైన్లో దర్శనవ్వడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ఓ ప్రముఖ నటి అక్షరాసింగ్కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట లీక్ అయ్యింది. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన అక్షరా సింగ్ ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉంది. అయితే సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న అక్షరా సింగ్‌కు సంబంధించి గతంలో ఎంఎంఎస్ వీడియో సోషల్ మీడియాలో బయటికొచ్చిన సంగతి తెలిసిందే.అప్పుడు తన పరువును బజారున పడేయడానికే ఎవరో కావాలనే ఇలా మార్ఫింగ్ చేశారంటూ క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి ఆమె ప్రైవేట్ వీడియో లీకయ్యింది. దీంతో ఆమెను చాలామంది నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోస్తున్నారు. దీనిపై అక్షరాసింగ్ ఏమైనా వివరణ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
ఫోటో అంటూ ఎగబడిన ఫ్యాన్స్.. పారిపోయిన హీరోయిన్
-
చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్, వీడియో వైరల్
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని తహతహలాడేవారు చాలామంది. అలాంటిది సెలబ్రిటీ ఎదురుగా కనిపిస్తే ఊరుకుంటారా? ఆరునూరైనా సరే ఫోటో సంపాదించాల్సిందేనని అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఫొటో ప్లీజ్ అంటూ వెంటపడుతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఎదురైంది భోజ్‌పురి హీరోయిన్ అక్షర సింగ్‌కు. అక్షర సింగ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్‌లోని బేథియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. హీరోయిన్ కనిపించడంతో ఆగలేకపోయిన జనం సెల్ఫీల కోసం పరుగులు తీశారు. వందలమంది ఫోటో అంటూ ఎగబడటంతో కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఉన్నపళంగా అక్కడి నుంచి పారిపోయింది హీరోయిన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అక్షర సింగ్ స్కూటీ మీద వెళ్తుండగా అభిమానులు ఆమె వెనకాల పరిగెత్తారు. కానీ చూడటానికి మాత్రం అందరూ ఆమెను తరుముతున్నట్లుగా ఉండటంతో హీరోయిన్‌కు ఎంత కష్టం వచ్చింది? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: ఫస్ట్ డే షూటింగ్.. బాబు చనిపోయాడు..: నటుడు -
నెట్టింట ఎంఎంఎస్ వీడియో లీక్.. స్పందించిన నటి
బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన భోజ్‌పురి నటి అక్షర సింగ్. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఈమె గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. కొన్నిరోజుల క్రితం ఓ వ్యక్తితో రూమ్‌లో అశ్లీలంగా కనిపించిన అక్షర సింగ్ ఎంఎంఎస్ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను చాలామంది నెటిజన్లు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ తిట్టిపోశారు. అయితే తాజాగా ఆ వీడియోపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమె స్పందించింది. ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఎవరో నా ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఆ పని ఎవరు చేశారు అని కూడా నేను పట్టించుకోను ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. ఇప్పటివరకు నేను ఆ వీడియోను చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నామీద ఎవరో కోపంతో ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉంటారు. కానీ ఇవి నన్ను ఏమాత్రం బాధించలేవు అంటూ చెప్పుకొచ్చింది. -
‘పుష్ప’తో నటిగా మంచి గుర్తింపు లభించింది: అక్షర
టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది నటి అక్షర. పుష్ప చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ తెలుగమ్మాయి. కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ చిత్రంలో పెళ్లి కూతురి పాత్రలో నటించింది. ఆ తర్వాత రామ్ ‘రెడ్’ చిత్రంలో మంచి పాత్ర పోషించి, మెప్పించడంతో సుకుమార్ ‘పుష్ప’లో అవకాశం కల్పించాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 చిత్రంతో పాటు రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ‘రావణాసుర’లో ఓ విభిన్నమైన రోల్లో నటిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యమని పేర్కొంది. తనలో టాలెంట్ చూసి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తానని చెబుతోంది. -
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకుని రావాలంటున్న రానా భార్య
Miheeka Bajaj Supports Tamil Bigg Boss Contestant Akshara Reddy: బిగ్‌బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర అభిమానులను ఎంతగానో అలరించే ఈ షో ప్రతియేటా కొత్త కంటెస్టెంట్లతో, కొంగొత్త గేమ్స్‌తో సరికొత్తగా ముస్తాబవుతూ మన ముందుకు వస్తుంటుంది. ప్రస్తుతం తెలుగులో కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ ఐదో సీజన్ విజయవంతంగా ప్రసారమవుతోంది. అటు తమిళంలోనూ స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్‌గా ఐదో సీజన్ రన్ అవుతోంది. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. ఈమె ఒక మోడల్, మిస్ గ్లోబ్ 2019 అవార్డు గ్రహీత కూడా! గతంలో 'విల్లా టు విలేజ్' అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. అలాగే 'కసు మెలా కసు' అనే మలేషియన్ మూవీలోనూ తొలిసారి నటించింది. తాజాగా ఈ అక్షరకు సపోర్ట్‌గా నిలబడిందో టాలీవుడ్ హీరో భార్య. భళ్లాలదేవ రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ అక్షరకు సపోర్ట్ చేయండంటూ వీడియో రిలీజ్ చేసింది. 'బిగ్‌బాస్ తమిళ ఐదో సీజన్లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు. పాల్గొన్న నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్ ద బెస్ట్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by miheeka (@miheeka) -
అక్షర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
సోషల్ హల్చల్: అవికా జోరు, జుట్టు విరబోసుకున్న కీర్తి..
► సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన 'మురారీ' చిత్ర విజయానికి 20 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ మురారీ సెట్స్‌లోని అన్‌సీన్ ఫొటోను షేర్ చేసింది. ► తలా అజిత్ భార్యతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారు. ► ఎఫ్ 3 భామ మెహరీన్ పిర్జాదా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం ఆమె ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ ఏకాంతంగా కబుర్లు చెప్పుకుంటూ మనసారా నవ్వుకుంటున్నారు. ► గుడ్ హెయిర్ డే అంటూ జుట్టు విరబోసుకుంది హీరోయిన్ కీర్తి సురేశ్. ► కపటధారి, అక్షర సినిమాల్లో నటిస్తున్న నందిత శ్వేత శూన్యంలోకి తీక్షణంగా చూస్తున్న ఫొటో అభిమానులతో పంచుకుంది. ► ట్రెడిషినల్ లుక్‌లో అదరగొడుతున్న కృతీ శెట్టి. ► దియా మీర్జా, వైభవ్ రేఖీ పెళ్లి ఆల్బమ్ నుంచి ఓ బ్యూటిఫుల్ ఫొటో. ► నభా నటేశ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ► కాసేపు కునుకు తీసిన పూజా హెగ్డే ► బంగారు వర్ణం డ్రెస్‌లో మెరిసిపోతున్న మంచు లక్ష్మి View this post on Instagram A post shared by Ajith Kumar 🔵 (@ajithkumar_official_) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
'అక్షర' ట్రైలర్ వచ్చేసింది..
"విద్యను నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు, విద్యను అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడు, అఖిల విశ్వాన్ని శాసించేది అక్షరమే.." అని ఎలుగెత్తి చాటుతున్న వాక్యాలతో అక్షర ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ నందిత శ్వేత ఫిజిక్ టీచర్ అక్షర, అన్యాయాన్ని ఎదిరించే వనితగా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో విద్యను వ్యాపారం చేసిన కాలేజీల నిర్వాకాన్ని, సీట్లు, ర్యాంకుల అమ్మకాలను విమర్శిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని తెర మీద చూపించేందుకు అక్షర చిత్రయూనిట్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్షర ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశాడు. ఇక బడా కాలేజీలో చదివే ఓ విద్యార్థి మరణం చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకున్నోడు రైతు, చదువును నమ్ముకున్నోడు రాజు అని చెప్పిన డైలాగు బాగుంది. ఇందులో షకలక శంకర్, సత్య, అజయ్ ఘోష్, మధునందన్, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. చదవండి: రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి హైదరాబాద్ నా సిటీనే.. నా బ్యూటీ -
డేటింగ్ సీక్రెట్ బయటపెట్టిన వైవా హర్ష..
యూట్యూబ్ ద్వారా పాపులారిటి సంపాదించిన వైవా హర్ష అప్పటి నుంచి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బాల ఏసుగా తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇక త్వరలోనే హర్ష ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్షర అనే అమ్మాయితో హర్ష నిశ్చితార్ధ వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఈ వేడుక జరగగా.. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్, వేష్ణవ్ తేజ్, సుష్మితా కొణిదెల సందడి చేశారు. తన నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన ఎంగేజ్మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: వైవా హర్ష నిశ్చితార్థం: వైరల్‌గా మారిన ఫొటోలు తాజాగా హర్ష తన లవ్ స్టోరీని మీడియా ముందు వెల్లడించాడు. పీజీ(M.com) చదివిన అక్షర తనకు నాలుగేళ్లుగా పరిచయమని హర్ష తెలిపాడు. స్నేహంగా ఏర్పడిన తమ పరిచయం మెల్లమెల్లగా ప్రేమకు దారితీసిందన్నారు. ‘మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అక్షరను నేను కలిశాను. గత నాలుగేళ్లుగా ఆమె నాకు తెలుసు. రెండేళ్ల నుంచి మేము డేటింగ్లో ఉన్నాం. ఇద్దరం జీవితాంతం ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. అదే జరిగిపోయింది. నేను తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమెతో చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. నా ప్రేమ విషయం చెప్పగానే మా పేరెంట్స్ సత్యనారాయణ రావు, రామదేవి త్వరగా ఒప్పుకున్నారు. కానీ అక్షర తండ్రి గౌరీ శంకర్ కొంత సమయం తీసుకున్నాడు. కానీ అప్పటి వరకు ఆమె నా గురించి తన తండ్రికి చెప్పకపోవడంతో ఆయన కొంచెం భయపడ్డాడు. వాళ్ల అమ్మకు (సత్య) మాత్రమే మా గురించి తెలుసు. అయితే ఒకసారి నేను అక్షర తండ్రితో కొంత సమయం గడిపే సరికి ఆయన నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మా పెళ్లికి అంగీకరించాడు. నిశ్చితార్థ వేడుకలో అతను ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు’ అని వెల్లడించాడు. అదే విధంగా జీవితాంతం అక్షరతో గడపడానికి నేను ఇంకా వేచి ఉండలేనని.. జూన్, జూలైలో వివాహం ఉండనున్నట్లు తెలిపాడు. తన సోదరి లాస్ ఏంజిల్స్‌లో ఉంటుందని, ఆమె వచ్చాక పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా..
ముషీరాబాద్: టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు. సోమవారం ముషీరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సతీమణి కోవ ఉమా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అక్షర స్కిల్ డెవలప్మెంట్’సంస్థను లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాల తో నిండి ఏమాత్రం సామాజిక చైతన్యం లేని టీవీ సీరియళ్లను చూస్తూ మహిళలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అదే సమయంలో ఆర్థిక చేయూతనిచ్చే నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ తీసుకుని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని మహిళలను కోరారు. మహిళలపై ఉన్న గౌరవంతో ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలను, స్ఫూర్తిదాయక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కోవలోదే ‘బేటీ పడావో, బేటీ బచావో’కార్యక్రమమన్నారు. గతంలో మహిళలకు ఉద్యోగాలంటే సూపర్ బజార్లలో, రిసెప్షనిస్టులుగా ఉండేవని కానీ నేడు వారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కొనియాడారు.ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతిలో పెట్టడమనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌కు ఒక మహిళ నేతృత్వం వహించడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధి శేఖర్, అప్సా ప్రతినిధి ప్రవీణ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి ప్రమోద్, రామానందతీర్థ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. -
రెండు జంటల కథ
చక్రవర్తి, బంగార్రాజు, అక్షర, సంతోషిణి ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం యస్ 20 ప్లస్’. సాయి తులసి సమర్పణలో సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఓ మధ్యతరగతి అమ్మాయి లైంగిక దాడి నుంచి ఎలా తప్పించుకుంది? మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది? అన్నది ఒక జంట కథ. మాఫియా వలలో చిక్కుకున్న తన భార్యను ఒక పోలీసాఫీసర్ ఎలా కాపాడుకున్నాడన్నది రెండో జంట కథ’’ అన్నారు. ‘‘అన్నివర్గాలకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సి. రామాంజ నేయ. ఈ చిత్రానికి కెమెరా: సాగర్, ఆనంద్, సంగీతం: మెలోడీ శ్రీనివాస్, ఆర్ ఆర్ అర్మాన్. ∙చక్రవర్తి, అక్ష్రర -
నీ పేరు ప్రేమదేశమా...
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమకథా చిత్రమ్ 2’ ఫేమ్ నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘అక్షర’. బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కనులను కాపాలాగా ఉంచా.. నీపేరు ప్రేమదేశమా..’ అంటూ సాగే మెలోడీని విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సోషల్ మెసేజ్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. బాలాజీ రాసిన ‘కనులను కాపలాగా ఉంచా...’ పాటని అనుదీప్ దేవ్ చక్కగా పాడారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతం అందించారు. పాటకి చాలా మంచి స్పందన వస్తోంది. టీజర్ ఇప్పటికే జనాల్లోకి దూసుకెళ్లింది’’ అన్నారు. సత్య, మధునందన్, ‘షకలక’ శంకర్, శ్రీతేజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నా ఈ చిత్రానికి లెన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి, సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్. -
అరుదైన అక్షర
నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా రూపొందించిన చిత్రమిది. వాణిజ్య అంశాలు తగ్గకుండానే మంచి సందేశంతో ఉంటుంది. నందితా శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. గతంలో విడుదల చేసిన టీజర్, పాటకు వచ్చిన స్పందన సినిమా విజయంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. అక్టోబర్ ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘అక్షర’ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్. మా ‘అక్షర’ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు బి. చిన్నికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బెనల్, సంగీతం: సురేష్ బొబ్బిలి, లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి, సహ నిర్మాతలు: కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్. -
ఏ సినిమా చూసినా అందులో నేనే హీరోని!
వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, దేవినేని నెహ్రూ.. ఈ మూడు పాత్రల్లో ఒదిగిపోయిన నటుడు శ్రీ తేజ్. ఈ పాత్రల ద్వారా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో విడుదల కానున్న ‘అక్షర’లో హీరోగా నటించడంతో పాటు మరికొన్ని చిత్రాలు సైన్ చేసిన శ్రీతేజ్ చెప్పిన విశేషాలు. ► ‘కథానాయకుడు, మహానాయకుడు’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కన్నా ముందే నేను ‘నా సామి రంగా’, ‘తీయని కలవో’, ‘కదిలే బొమ్మల కథ’ సినిమాల్లో హీరోగా చేశా. అవి హిట్ కాలేదు. సినిమా హిట్ అయితేనే మేం జనంలోకి వెళ్లగలుగుతాం. లేకుంటే అది ఎంతమంచి సినిమా అయినా వెళ్లలేం. హిట్‌కి, ఫ్లాప్‌కి ఉన్న డిఫరెన్స్ అదే. ఎన్టీఆర్ ‘కథానాయకుడు, మహానాయకుడు’ సినిమాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాత్ర చేశాను. అది మంచి పేరు తెచ్చింది. అలాగే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చేసిన చంద్రబాబునాయుడిగారి పాత్ర కూడా ప్రశంసలు తెచ్చింది. ► నాది విజయవాడ. బీకాం చదువుకున్నా. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే ఫ్యాంటసీలో ఉండేవాణ్ణి. ‘టెర్మినేటర్’ సినిమాని ఇంట్లో వీసీఆర్లో నాన్నగారు చూపించారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేనే హీరోలా ఫీలై, ప్యాడ్‌ని గన్లా పట్టుకునేవాణ్ణి. ఏ సినిమా చూసినా అందులో హీరో పాత్రలో నన్ను ఊహించుకుంటూ అనుకరించేవాణ్ణి. ► ఏడాదికి 365 రోజులు అయితే అప్పట్లో నాకు 35రోజులే పని. మిగతా రోజుల్లో ఖాళీ. ఈ టైమ్‌లోనే మానసికంగా బలంగా ఉండాలి. ఈలోపు మైండ్ ఖాళీగా ఉంటుంది. ఒక యాక్టర్‌కి ఎంత బాధ ఉన్నాసరే ఆ బాధ మొహంలో కనిపించకూడదు.. బాడీ ఫిట్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడూ బ్రెయిన్లో ఒత్తిడి ఉండకూడదు. అందుకని సోషియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే... డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ఫిజికల్‌గా అయినా నా సహకారం ఉంటుంది కదా అని నా ఫ్రెండ్‌తో కలిసి హెల్పింగ్ నేచర్ వర్క్స్ ఉంటే చేసేవాణ్ణి. మొదటి నుంచీ హెల్పింగ్ నేచర్ ఉన్నవాణ్ణి నేను. క్రమశిక్షణగా ఉండటానికి ఎన్సీసీ ఉపయోగపడింది. స్పోర్టివ్‌గా ఉండటానికి స్పోర్ట్స్.. సినిమాలు చూస్తే ఒత్తిడి ఉండదు. ఒక మనిషిని అభివృద్ధి చేయడానికి ఒక్కో అంశం ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ► విడుదలకు సిద్ధమైన ‘అక్షర’లో హీరోగా చేశాను. అయితే అన్ని సినిమాల్లోనూ హీరోగానే చేయాలని ఫిక్స్ కాలేదు. కథని ముందుకు నడిపించడానికి ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం. హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ ఖాన్.. వీళ్లంతా మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. వాళ్లలా చేయాలనుకుంటున్నాను. -
విద్య కోసం పోరాటం
కథానాయిక నందితాశ్వేత ప్రధాన పాత్రలో బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘అక్షర’. అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ నిర్మించారు. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం ఆసక్తిగా సాగుతుంది అని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఒక దర్శకుడి ఆలోచన విఫలం కావొచ్చు. కానీ అతని ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాకూడదు. ఈ సినిమా కథ బాగా నచ్చింది. టీజర్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు అభినందనలు. చిన్నికృష్ణ నాకు మంచి మిత్రుడు. నా మొదటి సినిమా ‘పటాస్’ టేకాఫ్ కావడానికి అతను చేసిన సహాయం మరువలేనిది. నందితా శ్వేత మంచి ఆర్టిస్టు. ఈ సినిమాలో ఆమె లుక్స్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘నేను చెప్పిన లైన్ విని దర్శకుడిగా నాకు అవకాశం కల్పించిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రంలో ఓ సీరియస్ పాయింట్‌ని డిస్కస్ చేశాం. ఈ సినిమాలోని ‘అక్షర’ పాత్రకు రూపం ఇచ్చిన నందితగారికి థ్యాంక్స్. ఈ కథ వినగానే ‘హిట్ కొడుతున్నావ్’ అని అనిల్ అన్నాడు. ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులోకి రావాలన్నదే అక్షర చేసే పోరాటం’’ అని చిన్నికృష్ణ అన్నారు. ‘‘మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ సినిమాకు నా కెరీర్లో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు నందిత. ‘‘సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సురేష్ వర్మ.‘‘అక్షర’ సినిమా ఐడియా నాకు పేపర్ మీద ఉన్నప్పటి నుంచి తెలుసు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశానని శ్రీతేజ్ చెప్పారు. -
ట్వంటీ ప్లస్
చక్రవర్తి, బంగార్రాజు, ఆంధ్ర అప్పాచీ, అక్షర, సంతోషిని, ఉమ ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం ఎస్, 20ప్లస్’. సాయిలోకేష్ ప్రొడక్షన్ పతాకంపై సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా పోస్టర్ని నిర్మాత సాయివెంకట్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. దుర్గాప్రసాద్ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తనకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది’’ అన్నారు. ‘‘దర్శకు డిగా అవకాశం ఇచ్చిన రామాంజనేయగారికి థ్యాంక్స్. వెల్లంకి విజయలక్ష్మి రాసిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని వెల్లంకి దుర్గాప్రసాద్ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాం. ఆరవన్, మెలోడి శ్రీనివాస్ కలిసి ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారు’’ అని రామంజనేయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సాగర్. -
మే నెలలో ప్రేక్షకుల ముందుకు ‘అక్షర’
ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాతో ఆకట్టుకున్న నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెండ్ సినిమా అక్షర. విద్యతో సామాజిక మార్పు సాధ్యం అవుతుందని నమ్మే అక్షర అందుకోసం ఏం చేసింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు బీ చిన్నికృష్ణ దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న అక్షర మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో నందితతో పాటు కీలక పాత్రల్లో నటిస్తోన్న షకలక శంకర్, సత్య, మధునందన్ పాల్గొంటున్నారు. వీరి పాత్రలు సినిమాలో హైలెట్ గా ఉంటాయంటున్నారు చిత్రయూనిట్. చివరి దశకు చేరుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. మే నెలలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అక్షర పోరాటం
విద్య సమాజాన్ని మార్చే బలమైన ఆయుధం అంటున్నారు దర్శకుడు చిన్నికృష్ణ. కానీ ఇప్పుడు సమాజంలో విద్యను మించిన వ్యాపారం మరోటి లేదు అని అందరూ అంటుంటారు. విద్యా వ్యవస్థను కథా వస్తువుగా చేసుకుని నందితా శ్వేత ముఖ్య పాత్రలో దర్శకుడు చిన్నికృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అక్షర’. సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మాతలు. భోగి పండగ సందర్భంగా ‘అక్షర’ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఫక్తు వ్యాపారంగా మారిపోయిన విద్యా వ్యవస్థపై అక్షర చేసే పోరాటమే ఈ సినిమా. నందిత కెరీర్లోనే అక్షర బెస్ట్ పాత్రగా నిలుస్తుంది. సురేశ్ బొబ్బిలి అందించిన బ్యాక్గౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. వేసవిలో సినిమాను విడదల చేస్తాం’’ అన్నారు. -
విద్యా వ్యవస్థలోని వాస్తవాలతో..
‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ నందితా శ్వేత ముఖ్య పాత్రలో చిన్నికృష్ణ తెరకెక్కించనున్న చిత్రం ‘అక్షర’. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అహితేజ బెల్లంకొండ, సురేశ్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహుర్తం శనివారం జరిగింది. తొలి సన్నివేశానికి పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుధీర్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. హీరోలు కార్తికేయ, విజయ్ రాహుల్, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల స్క్రిప్ట్‌ని నిర్మాతలకు అందించి, శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ – ‘‘కథ వినగానే బాగా ఎగై్జట్ అయ్యాను. నిర్మాతల ఆలోచనలు నన్ను ఇంప్రెస్ చేశాయి. కథ మీద చాలా నమ్మకంగా ఉన్నాం. చాలా బాధ్యత గల పాత్ర. కొంచెం భయంగా కూడా ఉంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ బ్యానర్‌ని నిలబెట్టే సినిమా అవుతుంది. విద్యా వ్యవస్థలోని వాస్తవాలకు వినోదం జోడించి చెప్పబోతున్నాం. నందితా శ్వేతాతో పాటు 3 ముఖ్యమైన పాత్రలున్నాయి. త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. ‘‘కాన్సెప్ట్ టీజర్‌కి మంచి స్పందన లభించింది. డిసెంబర్ సెకండ్ వీక్‌లో షూటింగ్ మొదలుపెట్టి సమ్మర్‌కి విడుదల ప్లాన్ చేస్తున్నాం. ఆడియన్స్ ఆలోచనలో మార్పు కలిగించే చిత్రం అవుతుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు అహితేజ, సురేశ్ వర్మ. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: జి.శివ, సహనిర్మాత: కె. శ్రీనివాసరెడ్డి.