విద్యుత్ ఇంజినీర్ల కార్యదర్శిగా రంగస్వామి
కర్నూలు : విద్యుత్ శాఖ ఇంజినీర్ల సంఘం (ఏపీఎస్‌ఈబీఈఏ) జిల్లా కార్యదర్శిగా జి. రంగస్వామి ఎన్నికయ్యారు. 2016–18 (రెండేళ్లు) పీరియడ్‌కు గాను నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఈనెల 19న స్థానిక బాబా బృందావన్ నగర్‌లోని ఇంజినీర్ల సంఘం అతిథి గృహంలో ఎన్నికల జరిగాయి. జిల్లా కార్యదర్శికి కర్నూలు టౌన్ ఎస్పీడీసీఎల్ ఏడీఈ–1గా పనిచేస్తున్న జి. రంగస్వామి, ట్రాన్స్‌కో ఎంఆర్టీ ఏడీఈగా పనిచేస్తున్న గోపాల్, కోశాధికారిగా డీపీఈ ఏఈ జగదీశ్వర రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ రమణ పోటీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఏపీ ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో సంస్థ ఇంజనీర్లు 171 మంది ఉండగా, 161 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఎలక్షన్ ఆఫీస ర్, హెచ్‌టీ మీటర్స్ విభాగ ఏడీఈ యు. ప్రభాకర్ సమక్షంలో ఓట్ల లెక్కించగా జిల్లా కార్యదర్శికి 146 ఓట్లు పోల్ కాగా వాటిలో జి. రంగస్వామికి 112, గోపాల్‌కు 34 వచ్చాయి. కోశాధికారికి 113 ఓట్లు పడగా జగదీశ్వరరెడ్డికి 85, రమణకు 28 వచ్చాయి. దీంతో జి ల్లా కార్యదర్శిగా రంగస్వామి 78, కోశాధికారిగా జగదీశ్వర రెడ్డి 57 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు బ్రాంచ్ సెక్రట రీగా గంగన్న, అడిషనల్ సెక్రటరీగా ముఖేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.