ARP
-
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏఆర్పీ
సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు (ఏఆర్పీ)ను 120 రోజులకు పెంచుతూ రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రాబోతోంది. ఇప్పటివరకు 60 రోజులుగా ఉన్న గడువును నాలుగు నెలలకు పెంచుతున్నట్టు ఇటీవలి బడ్జెట్లో రైల్వే మంత్రి ప్రతిపాదించారు. దీనివల్ల బ్లాక్ టికెటింగ్ పెరిగే అవకాశం ఉన్నా దాన్ని అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించటం విశేషం. 2012 వరకు ఈ గడువు 90 రోజులుగా ఉండేది. ఆ తర్వాత దాన్ని 120 రోజులకు పెంచారు. తిరిగి 2013 మే 1 నుంచి దాన్ని 60 రోజులకు కుదించారు. 120 రోజుల ముందే టికెట్లను జారీ చేశాక రైలు చార్జీలు పెరిగితే, ఆ పెరిగిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవటం అంత సులభం కాదని, దీనివల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు అప్పట్లో రైల్వేశాఖ దృష్టికి తెచ్చారు. ఒక్క దక్షిణ మధ్య రైల్వే అధికారులే నిత్యం రూ.25 లక్షల వరకు వసూలు చేయాల్సి వస్తున్నా రోజుకు రూ.15 లక్షలకు మించి వసూలు చేయలేకపోతున్నట్టు అప్పట్లో ఉదాహరించారు. దీంతో గడువును 60 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ దాన్ని ఇప్పుడు 120 రోజులకు పెంచారు. -
‘మహాకూటమిగానే పోటీ’
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మహాకూటమిగానే పోటీ చేయనున్నాయి. కలిసి కట్టుగానే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే తెలిపారు. బీఎంసీ నిర్మించిన ట్రామా కేర్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మా కూటమి కలిసి పోటీచేయదని అనేక మంది అనుకుంటున్నారని, అయితే అవన్నీ వట్టివేనని, ఐక్యంగానే సత్తా చాటుతామని అన్నారు. ఏటీఎం (అథవలే, ఠాక్రే, ముండే) ఎప్పటికీ బ్రేక్ కాదని, కలిసి కట్టుగానే ఉంటామని బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా పోరాటం సీట్లు, పదవులు, ప్రతిష్ట కోసం కాదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని నొక్కి చెప్పారు. అయితే బాల్‌ఠాక్రే పేరు పెట్టిన ట్రామా కేర్ని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముండే, అథవలే సమక్షంలో ప్రారంభించారు. అయితే వారం క్రితం జరిగిన దసరా ర్యాలీలో అవమానానికి గురైన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషి రాసిన లేఖపై స్పందించేందుకు ఉద్ధవ్ నిరాకరించారు. తాను కావాలనుకున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతానని తెలిపారు.