Assembly Elections
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్ల ఆఫర్
ఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. అభ్యర్థులు ఎవరనేది చెప్పకుండా మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో ఆఫర్ చేసిందని చెప్పారు.గురువారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.‘బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు ఇస్తాం.మా పార్టీలో చేరమని బీజేపీ ఆఫర్ చేసింది.ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో సైతం ఇతర పార్టీలను నిర్విర్యం చేసేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రలోభాలకు చేసేలా ఆడియో,వీడియో కాల్స్ వస్తే ఫిర్యాదు చేయాలని, నేరుగా కలిస్తే రహస్యంగా వీడియోలు తీయమని సదరు అభ్యర్ధులకు చెప్పాం’ అని అన్నారు.#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "Seven MLAs (of AAP) have received phone calls from some BJP elements, who have offered to give them Rs 15 crore to leave the Aam Aadmi Party and join the BJP... We have told the MLAs to record such audio calls and complain about it. If… pic.twitter.com/YbYhfu7rEC— ANI (@ANI) February 6, 2025 బీజేపీ ప్రలోభాలపై స్పందిస్తూ..ఎన్నికల ఫలితాలు (ఫిబ్రవరి 8న) వెలువడకముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీలను బద్దలు కొట్టే రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. కాగా,బుధవారం (ఫిబ్రవరి 5) జరిగిన ఎన్నికలలో ఢిల్లీలో 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. అధిక సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. దీంతో ఆప్‌లో కలవరం మొదలైందనే పొలిటికల్ సర్కిళ్ల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఢిల్లీలో ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు
-
నేడే హస్తిన సమరం
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,000 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.220 కంపెనీల పారామిలటరీ బలగాలను, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోంగార్డులను మోహరించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం చేస్తోంది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్(క్యూఎంఎస్) యాప్‌ను తీసుకొచ్చింది. ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లు బారులు తీరి ఉన్నారో దీనిద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనం తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి ఓటు వేయొచ్చు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల కోసం 733 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6,980 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు దేశ రాజధానిలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరాట పడుతుండగా, పూర్వవైభవం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడి మరీ హామీలు గుప్పించాయి. ప్రజలు ఎవరిని విశ్వసించారో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఓటింగ్ శాతం సైతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం భారీగా నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువరు కేంద్ర మంత్రులు.ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ తరపున పార్టీ జాతీయ కన్వినర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ, యమునా నది కాలుష్యం, ఓట్ల తొలగింపు వంటి అంశాలను పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసుగెత్తిపోయారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ పెద్దలు తేల్చిచెబుతున్నారు. -
‘నేను తాగే నీళ్లలో విషం కలిపారా?’
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ (narendra modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ (aap) నేతలు బీజేపీపై అసహ్యకరమైన అభియోగాలు మోపుతుందని మండిపడ్డారు.ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ విషం కలిపిన నీటిని ఢిల్లీ ప్రజలకు అందిస్తుందని ఆరోపించారు. అంతేకాదు, హర్యానా బీజేపీ ప్రభుత్వం విషయం కలిపిన నీటిని ప్రధాని మోదీ తాగగలరా? అని ఓటర్లను ప్రశ్నించారు.అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మోదీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ ఘోండా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు #WATCH | During a public rally in Delhi, PM Modi says, ": In 'aapda' walon ki lutiya Yamuna mein hi doobegi...""People of 'aapda' say that people of Haryana mix poison in water sent to Delhi. This is not just an insult to Haryana but to all Indians. Ours is a country where… pic.twitter.com/kJoQCAuEi2— ANI (@ANI) January 29, 2025 ఆప్ నేతలు అసహ్యకరమైన అభియోగాలు మోతున్నారంటూ.. ఆ పార్టీ కన్వినర్ కేజ్రీవాల్‌పై మోదీ విరుచుకు పడ్డారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా యమునా (yamuna water) నీటిని తాగే నీరుగా మార్చి ఢిల్లీ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ఏమైంది. నెరవేర్చలేదు. పైగా సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో యమునా నీటి అంశాన్ని అడ్డం పెట్టుకొని తమకు ఓటేయ్యమని అడుగుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ పాపాలు చేస్తోంది. అలాంటి వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు’ అంటూ మోదీ దుయ్యబట్టారు.ఈ సందర్భంగా మోదీ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డెడ్‌లైన్‌పై పరోక్షంగా స్పందించారు. హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం..అక్కడి నుంచి ఢిల్లీ ప్రవహించే నీటిలో అమోనియాను కలిపించదని ఆప్, కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ.. బుధవారం రాత్రి 8 కల్లా తగిన ఆధారాల్ని అందించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలపై మోదీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ను టార్గెట్ చేశారు. గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నంలో.. నిందలు మాపై పడతాయని ఆశిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. వచ్చే వారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ గందరగోళంలో పడింది. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించకూడదా? ఢిల్లీ ప్రజలతో ప్రధాని మోదీ తాగే నీటిని హర్యానా విషపూరితం చేయగలదా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. చివరిగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్,ఆప్ పాలన చూశారు. ఇప్పుడు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వండి’ అని ఢిల్లీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.👉చదవండి : మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం -
ఈసీకి 75 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా నిలిచే లోక్‌సభ ఎన్నికలు. అందుకు ఏ మాత్రమూ తగ్గని పలు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. సుమారు 100 కోట్ల ఓటర్లు. లక్షల్లో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది. వేలాది మంది అభ్యర్థులు. ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రతువు సజావుగా జరిగేలా చూసే గురుతర బాధ్యతను మోస్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ శనివారం 76 ఏట అడుగు పెడుతోంది. ఈ క్రమంలో బాలారిష్టాలను దాటి ‘ఇంతింతై’ అన్నట్టుగా ఎదిగి, నేడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఆసాంతమూ డేగకళ్లతో పర్యవేక్షించగల స్థాయికి చేరుకుంది. ఆ క్రమంలో ఎన్నో మెరుపులు మెరిపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎంతటి అద్భుతాలు సాధ్యమో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టి.ఎన్.శేషన్ ఆచరణలో చూపించారు. అభ్యర్థుల ఆస్తుల వెల్లడి మొదలుకుని ప్రచార వ్యయ నియంత్రణ దాకా నిబంధనలన్నింటినీ కట్టుదిట్టంగా అమలు చేసి ఔరా అనిపించుకున్నారు. ఈసీ అధికారాలు ఎంతటివో పార్టీలు, నేతలతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలిసొచ్చేలా చేశారు. అలాంటి చరిత్ర ఉన్న ఈసీ పనితీరుపై కొన్నేళ్లుగా ఎన్నెన్నో ప్రశ్నలు! పారదర్శకత లోపిస్తున్న తీరుపై ప్రజలు మొదలుకుని ప్రతిపక్షాల దాకా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి! మొత్తంగా ఈసీ వ్యవహార శైలిపైనే ఆరోపణల మరకలు. ఈ పరిణామాలు ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు గుండెకాయ వంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) విశ్వసనీయతపైనే నానాటికీ సందేహాలు పెరుగుతున్నాయి. వాటికి మద్దతుగా సహేతుక వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈవీఎంల పనితీరును మేధావులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక చివరి గంటల్లో పోలింగ్ శాతంలో అనూహ్యంగా నమోదవుతున్న భారీ పెరుగుదలను స్వయానా ఈసీ మాజీ సారథులే ప్రశ్నిస్తున్న పరిస్థితి! వీటన్నింటినీ మించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉంటున్న వైనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వందల స్థానాల్లో ఇదే పరిస్థితంటూ పలు గణాంకాలు వెల్లువెత్తాయి. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ప్రజాస్వామిక ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అరకొర వివరణలతో సరిపెట్టడం, ప్రధాన సందేహాలపై మౌనాన్ని ఆశ్రయిస్తుండటం అనుమానాలను మరింతగా పెంచుతోంది. ప్రభుత్వ పెద్దల చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారుతోందని విపక్షాలు ఆరోపించడం పరిపాటిగా మారింది. చివరికి ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదాస్పదంగా మారుతోంది. వాటిని సవాలు చేస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న పరిస్థితి!ఓటర్ల జాబితాతోనూ చెలగాటంఎన్నికల ప్రక్రియకు అతి కీలకమైన ఓటర్ల జాబితాతో ప్రభుత్వాలు, పాలక పెద్దలు చెలగాటమాడుతున్న తీరు కూడా ఈసీ పనితీరుపై మచ్చగా మారుతోంది. తమకు అనువైన చోట్ల ఇష్టారాజ్యంగా ఓటర్లను చేరుస్తున్నారని, లేనిచోట్ల భారీగా పేర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరోపణలు పదేపదే వినిపించాయి. ఇక తాజాగా జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఈ రచ్చ కనీవినీ ఎరగని స్థాయికి పెరిగింది. రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన అంబేడ్కర్ ఈ విపరిణామాన్ని ముందే ఊహించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఎన్నికల జాబితాను ఒకటిగా ఆయన అభివర్ణించారు. ‘‘జాతి, సంస్కృతి, భాష తదితరాలపరంగా తమవారు కారని భావించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించే అవకాశముంది. ఇలాంటి పెడపోకడలకు చెక్ పెట్టేందుకే ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటును ప్రతిపాదిస్తూ 1949 జూన్‌లో రాజ్యాంగ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. నేటి పరిస్థితులు చూస్తే నాటి భయాలే నిజమవుతున్నాయని ఆయన ఆవేదన చెందేవారేమో...అలా మొదలైందిఎన్నికల సంఘం ఉనికిలోకి వచ్చిన రెండేళ్లకే 1952 తొలి సాధారణ ఎన్నికల రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంది. ఉన్నది ఒక్క ఎన్నికల కమిషనర్, చాలీచాలని సిబ్బంది. వనరులు, వసతులు అంతంతమాత్రం. ఓటర్లలో మెజారిటీ అక్షరజ్ఞానం కూడా లేనివారే. వారందరినీ చేరుకోవడం, ఓటేసేలా చూడటమే అతి పెద్ద సవాలుగా మారిన పరిస్థితి! అన్ని ప్రతికూలతల మధ్య కూడా తొలి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకుంది. రవాణా సదుపాయాలే లేని అతి మారుమూల ప్రాంతాలకు కూడా సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చి ప్రక్రియ వీలైనంత సమగ్రంగా జరిగేలా చూసింది. అందుకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చింది. దాంతో తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ దేశ విదేశాల్లో పాపులరయ్యారు. ఎన్నో దేశాలు తమ ఎన్నికల ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఆయన సేవలను వాడుకున్నాయి. తర్వాత ఈసీ క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలోకెల్లా అతి బృహత్తరమైన ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆద్యంతం శాంతియుతంగా నిర్వహించడంలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. 1989లో ఎన్నికల కమిషనర్ల సంఖ్యను మూడుకు పెరిగింది.ఈసీ 76వ వార్షికోత్సవ వేడుక శనివారం హస్తినలో జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తారు. ‘ఇండియా వోట్స్–2024’ పేరిట ఇటీవలి లోక్‌సభ ఎన్నికలపై ఈసీ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను, ఆ ఎన్నికలకు సంబంధించిన మానవాసక్తి కథనాల కూర్పు ‘బిలీఫ్ ఇన్ ద బ్యాలెట్’ను విడుదల చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియపై ‘ఇండియా డిసైడ్స్’ పేరిట వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. -
ఉచితంగా కరెంట్, మంచినీరు.. కేజ్రీవాల్ వరాల జల్లు
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (aap) విజయం సాధిస్తే.. అద్దె దారులకు ఉచిత కరెంట్, నీటిని అందిస్తామని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (delhi assembly elections) నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘వివిధ కారణాల వల్ల ఉచిత విద్యుత్, నీటి పథకాల ప్రయోజనాలను అద్దెదారులు పొందలేకపోతున్నారు. అద్దెదారులు కూడా ఢిల్లీ నివాసితులేనని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఈ ప్రయోజనాలు వారికి వర్తిస్తాయని ఆయన అన్నారు. బీజేపీ సైతంమరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్‌ను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామని తెలిపారు.పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని కీలక హామీలిచ్చారు. ఈ సందర్భంగా జేపీనడ్డా మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు.బీజేపీ ‘సంకల్ప పాత్ర’ పేరుతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ.2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయి.బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయంఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. 👉చదవండి : సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ముడా ఉచ్చు? -
బీజేపీ 29 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల
-
Magazine Story: ముక్కోణపు పోరులో విజేతగా నిలిచేదెవరు ?
-
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి నోటి దురుసు వ్యాఖ్యలు
ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి (Ramesh Bidhuri) మరోసారి నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అతిషి మర్లెనా సింగ్ తన తండ్రినే మార్చేసిందంటూ కొత్త వివాదానికి తెరతీశారు.త్వరలో ఢిల్లీ అసెంబ్లీ (delhi assembly elections) ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ (bjp) విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మోదీ ఇప్పటికే ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. పనిలో పనిగా ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదంతో ఢిల్లీ ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారు.ఇక ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. 👉చదవండి : ‘శీష్‌మహల్’ కోసం పెట్టిన ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్మొన్నటికి మొన్న ఓటర్లు తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తానో ఉదహరిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రమేష్ బిదురితో పాటు బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో తాను ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదంటూ క్షమాపణలు చెప్పారు.అలా క్షమాపణలు చెప్పారో లేదో.. కొన్ని గంటల వ్యవధిలో సీఎం అతిషీపై నోరు పారేసుకున్నారు. ఆమె(అతిషి) ఇంటి పేరు మర్లేనా నుంచి సింగ్‌గా మారింది. తన తండ్రినే మార్చేసింది. అవినీతి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనని ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేశారు. అదే క్రేజీవాల్ ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నారు. ఈ ఇద్దరి తీరు ఆమ్ ఆద్మీ పార్టీ లక్షణాల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని ’ మండిపడ్డారు. అంతేకాదు, మన సైనికులు మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురు మరణశిక్షకు వ్యతిరేకంగా అతిషి మర్లెనా తల్లిదండ్రులు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారు. అఫ్జల్ గురు మరణానికి క్షమాపణలు కోరిన వారికి మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? అని నేను ఢిల్లీ ప్రజలను ప్రశ్నించారు.ప్రస్తుతం అతిషిపై రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతుండగా..బీజేపీ నేతలు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.బీజేపీ నేతలు హద్దు మీరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని దుర్భాషలాడుతున్నారు. ఢిల్లీ ప్రజలు మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని సహించరు. ఢిల్లీ మహిళలందరూ దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు ’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
ప్రధాని మోదీపై కేజ్రీవాల్ సెటైర్లు
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ,బీజేపీలు విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ ఆమ్ ఆద్మీ అంటే విపత్తు అని సంబోధించగా.. అందుకు ఆమ్ ఆద్మీ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ రూ.2,700 కోట్లతో ఇల్లు కట్టుకుని, రూ.8,400 కోట్లతో విమానంలో ప్రయాణించే వ్యక్తి మోదీ అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు ఢిల్లీకి నిజమైన విపత్తు బీజేపీతోనే ఉంది. మొదటి విపత్తు ఏంటంటే? ఢిల్లీకి సీఎం అభ్యర్థిపై స్పష్టత లేకపోవడం, రెండవ విప్తత్తు ఢిల్లీ భవిష్యత్‌పై స్పషటత లేకపోవడం. మూడవది ఢిల్లీ ఎన్నికలకు బీజేపీకి ఎజెండా లేదు’ అని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో నివాసితుల కోసం 1,675 ఫ్లాట్లు ఢిల్లీ డెవలప్మెంట్ అథారటీ నిర్మించింది. ఆ ఇళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఇటీవల చోటుచేసుకున్న సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీని విపత్తుగా పేర్కొన్న మోదీ.. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు. -
‘మహా’ ఎన్నికల్లో ట్యాంపరింగ్.. సుప్రీం కోర్టుకు ఇండియా కూటమి నేతలు
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి పార్టీ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యున్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరువురి నేతల భేటీలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు, త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఎన్నికల తరహాలో ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా కార్యకర్తలకు, నేతలకు భవిష్యత్ కార్యచరణపై దిశానిర్ధేశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇండియా కూటమి తరుఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలపై శరద్ పవార్ సుప్రీం కోర్టు ఆశ్రయించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహా ఎన్నికల్లో ఘోర పరాజయంఈ నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. Maharashtra: At the anti-EVM event at Markadwadi village in Solapur district, NCP-SCP chief Sharad Pawar says, "Elections happen...some win some lose...but in recently concluded election in Maharashtra, people have doubt over the election process and voters are not feeling… pic.twitter.com/QkmKK5XNQU— ANI (@ANI) December 8, 2024అయితే, ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ విజయం సాధిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే కూటమిలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్సీపీ నేతలు అంచనా వేశారు. కానీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. ఊహించని విధంగా ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలపై దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్‌పై సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. -
వణికించే చలిలో రాజకీయ వేడి..ఢిల్లీలో ‘ఆప్’ వర్సెస్ బీజేపీ
న్యూఢిల్లీ:వణికించే చలిలో ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేతల మధ్య మాటల తూటాలు పేలడం ఇప్పటి నుంచే మొదలైంది. ముఖ్యంగా అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్),ఢిల్లీ బీజేపీ అగ్ర నేతల మధ్య వాగ్యుద్ధం సార్టైంది. తాజాగా బీజేపీ ‘మార్పు కోసం’ అని ఇచ్చిన నినాదంపై ఆప్ అధినేత,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.తమ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, ఉచిత నీరు లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేయడమే బీజేపీ తెచ్చే మార్పని కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ కామెంట్స్‌పై ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ స్పందించారు. ఎన్నికల వేళ తమ నినాదం జనాల్లోకి బాగా వెళ్లడాన్ని ఆప్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేజ్రీవాల్ సహా ఆప్ అగ్రనేతలంతా పీకల్లోతు అవినీతిలోకి కూరుకుపోయారని ఆరోపించారు. కాగా, వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఇదేనా -
‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్ రా’!..
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ సోదరుడి కుమారుడు రోహిత్ పవార్.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.ఈ తరుణంలో సోమవారం(నవంబర్ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్ జమ్ఖేడ్లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్ పవార్‌ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఆ మాటతో రోహిత్ పవార్.. అజిత్ పవార్ కాళ్లకు నమస్కరించారు.స్వల్ప తేడాది విజయంఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ గెలుపుగత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. स्व. यशवंतराव चव्हाण साहेबांची समाधी प्रितीसंगम म्हणजे पवित्र स्थळ. चव्हाण साहेबांनीच एक सुसंस्कृत अशी राजकीय संस्कृती जपण्याचे संस्कार महाराष्ट्रावर केले. त्यानुसारच आज प्रितीसंगमावर आदरणीय अजितदादांची भेट झाली. त्यांची राजकीय वाटचाल स्वतंत्र दिशेने सुरु असली तरी त्यांचा राजकीय… pic.twitter.com/Oc8eQYdwfN— Rohit Pawar (@RRPSpeaks) November 25, 2024 -
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్ పవార్
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఊహించలేదని, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమని అన్నారు .మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ మాట్లాడారు. 288 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ 41 స్థానాల్ని గెలిచారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ ఫలితాల్ని మేం ఊహించలేదు. ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం. నాకంటే అజిత్ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహరాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.ఈ తరుణంలో పలువురు ఎన్సీపీ నేతలు.. శరద్ పవార్ రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఏం చేయాలో వాళ్లకు అనవసరం నేను ఏం చేయాలో నేను, నా సహచరులు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ
ఢిల్లీ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తాను ఊహించలేదని అన్నారు కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ 288 స్థానాల్లో ఏకంగా 130 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర మిత్ర పక్షాలతో కలిసి మెజార్టీని సాధించారు. దీంతో రెండోసారి మహాయతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఈ తరుణంలో మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహరాష్ట ఫలితాల్ని నేను ఊహించలేదు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఓటమికి గల కారణాల్ని విశ్లేషిస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీకి మద్దతిచ్చిన ఓటర్లకు, సోదరీమణులందరికీ, పార్టీ గెలుపుకోసం కృష్టి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు’అని అన్నారు. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూమి రక్షణ విజయం’అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వం వహిస్తున్న జేఎంఎం 34 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలించింది.झारखंड के लोगों का INDIA को विशाल जनादेश देने के लिए दिल से धन्यवाद। मुख्यमंत्री हेमंत सोरेन जी, कांग्रेस और झामुमो के सभी कार्यकर्ताओं को इस विजय के लिए हार्दिक बधाई और शुभकामनाएं।प्रदेश में गठबंधन की यह जीत संविधान के साथ जल-जंगल-ज़मीन की रक्षा की जीत है।महाराष्ट्र के नतीजे…— Rahul Gandhi (@RahulGandhi) November 23, 2024 -
థ్యాంక్యూ అమ్మ.. తల్లితో దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించింది. మొత్తం 288 స్థానాల్లో అధికార బీజేపీ 229 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కేవలం 54 స్థానాలకే పరిమితమైందిఈ తరుణంలో కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తమ కుమారుడే మహరాష్ట్ర సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తన కుమారుడు 24 గంటలూ కష్టపడుతున్నారని మీడియాతో పేర్కొన్నారు.మరోవైపు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆమె తల్లి సరితా ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోన్ కాల్లో ‘ఎన్నికల తతంగం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తా అమ్మా. మీతో అన్నీ మాట్లాడుతాను. మీరు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.కాగా,ప్రస్తుతం విడుదలైన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 124 స్థానాల్లో ముందంజలో ఉంది. 144 స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహాయుతి కూటమిలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 56, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. శివసేన(యూబీటీ) 18, శరద్ పవార్ ఎన్సీపీ 15 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #WATCH | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM Devendra Fadnavis' mother, #SaritaFadnavis says, "Of course, he will become the CM...It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours..."#ElectionResults… pic.twitter.com/MV36KVSyJe— TIMES NOW (@TimesNow) November 23, 2024 -
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ .. ఎవరి సత్తా ఎంతంటే?
సాక్షి,ఢిల్లీ: మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని వెల్లడించాయి. ఇక, సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర (పీపుల్స్‌పల్స్)బీజేపీ 182, కాంగ్రెస్ 97,ఇతరులు 9 మహరాష్ట్ర (ఏబీపీ) : బీజేపీ 150-170 కాంగ్రెస్ 110-130ఇతరులు 8-10 ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్) ఎన్డీయే-46-58జేఎంఎం కూటమి 24-37 ఇతరులు 6-10 చాణక్య (మహారాష్ట్ర)ఎన్డీఏ 152-160ఇండియా 130-138చాణక్య(ఝార్ఖండ్) ఎన్డీఏ 45-50జేఎంఎం 35-38ఏబీపీ(మహారాష్ట్ర)ఎన్డీఏ 150-170ఎంవీఏ 110-130ఇతరులు 6-8కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు.ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి. -
Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. -
చిన్న పార్టీలే... నిర్ణేతలు!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. కానీ అంతిమ ఫలితాన్ని మాత్రం చిన్న పార్టీలు, స్వతంత్రులే తేల్చే సూచనలు కన్పిస్తుండటం విశేషం. ఈ జాబితాలో మజ్లిస్, ఎంఎన్ఎస్, వీబీఏ వంటి పార్టీలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. వీటికి, స్వతంత్రులకు కలిపి ఈసారి కనీసం 30 స్థానాలకు పైగా రావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అదే జరిగి, హంగ్ వచ్చే పక్షంలో అవి కింగ్మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకూ నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న పార్టీల హల్చల్ రెండు కూటముల్లోనూ గుబులు రేపుతోంది. దాంతో అందరి దృష్టీ 23న వెల్లడయ్యే ఫలితాలపైనే కేంద్రీకృతమైంది...!మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరింది. అధికారం నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్న బీజేపీ సారథ్యంలోని మహాయుతి, దాన్ని ఎలాగైనా గద్దె దించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూటములకు చిన్న పార్టీలు పెద్ద సమస్యగా పరిణమించాయి. జరుగుతున్నది ద్విముఖ పోరే అయినా రెండు కూటముల భాగ్యరేఖలనూ ఈ ‘తృతీయ శక్తులు’ నిర్దేశించేలా కనిపిస్తుంటే ఆసక్తికరంగా మారింది. ఈ చిన్న పార్టీల్లో ఒక్కోదానికీ ఒక్కో ప్రాంతంలో చెప్పుకోదగ్గ పట్టుంది. అగాడీకి ఎంఎన్ఎస్ గుబులు ఈ ఎన్నికల్లో ప్రబల శక్తిగా కనిపిస్తున్న రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) విపక్ష ఎంవీఏ కూటమికి గుబులు పుట్టిస్తోంది. రాజధాని ముంబై, శివార్లలో ఎంఎన్ఎస్ హవా అంతా ఇంతా కాదు. ముంబైలోని 25 స్థానాల్లో ఎంఎన్ఎస్ బరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం మరో 36 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గట్టి ప్రభావం చూపడం ఖాయంగా కన్పిస్తోంది. ముంబైలోని 25 స్థానాల్లో మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) 12, బీజేపీ 10 చోట్ల పోటీ పడుతున్నాయి.ఎంఎన్ఎస్ను బీజేపీకి మిత్రపక్షంగా పరిగణిస్తారు. రాజ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన కుమారుడు అమిత్ పోటీ చేస్తున్న మాహింలో కూటమి ధర్మాన్ని కూడా బీజేపీ పక్కన పెట్టింది! అక్కడ షిండే సేన అభ్యర్థని కాదని మరీ అమిత్‌కే బీజేపీ నేతలు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు! ఇది ఆ రెండు పార్టీల లోపాయికారీ అవగాహనకు, బీజేపీ వ్యూహ చతురతకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.కింగ్‌మేకర్ ఆశల్లో ఒవైసీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్‌కు కూడా మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ పట్టే ఉంది. ముఖ్యంగా ఔరంగాబాద్‌తో పాటు ముంబైలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పార్టీ హవా కొనసాగుతుంది. 2019లో 44 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ ఈసారి కేవలం 16 స్థానాల్లోనే బరిలో ఉంది. కాకపోతే అవన్నీ ముస్లిం ప్రాబల్య స్థానాలే. వాటిలో చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయంపై పార్టీ నమ్మకంగా ఉంది.అంతేగాక మిగతా చోట్ల మజ్లిస్ చీల్చే ముస్లిం ఓట్లు అగాడీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలకు గట్టిగా గండి కొట్టేలా కన్పిస్తున్నాయి. ‘‘హంగ్ వచ్చి ఎంవీఏ కూటమి గనక మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోతే మేం గెలవబోయే సీట్లే కీలకం కావచ్చు. అప్పుడు మజ్లిస్ కింగ్‌మేకర్ అవుతుంది’’ అని ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎంవీఏ కూటమిలో చేరేందుకు మజ్లిస్ విఫలయత్నం చేసింది.గత ఎన్నికల్లోనూ దుమ్ము రేపాయిమహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిన్న పార్టీలు దుమ్మురేపాయి. మొత్తమ్మీద 29 సీట్లు గెలుచుకోవడమే గాక ఏకంగా మరో 63 అసెంబ్లీ స్థానాల్లో చిన్న పార్టీల అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈసారి కూడా ఆ ఫలితాలే పునరావృతమైతే కూటములకు కష్టకాలమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఓటర్లు 4 లక్షలు, అంతకన్నా తక్కువే ఉంటారు. 60 శాతం పోలింగ్ జరుగుతుందనుకున్నా సగటున ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో 2.5 లక్షల ఓట్లు పోలవుతాయి. పార్టీపరమైన చీలికల దృష్ట్యా ప్రతి స్థానంలోనూ కేవలం లక్ష ఓట్లే విజేతను తేల్చే అవకాశముంది.సరిగ్గా ఈ అంశమే పలు స్థానాల్లో చిన్న పార్టీలను ప్రబల శక్తులుగా మారుస్తోంది. దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్రలో ఈసారి రాజకీయ రంగస్థలం నానారకాలుగా చీలిపోయింది. దాంతో చిన్న పార్టీ, గట్టి ఇండిపెండెంట్ బరిలో ఉన్న అన్ని స్థానాల్లోనూ మిగతా అభ్యర్థులందరి భాగ్యరేఖలూ ప్రభావితమ య్యే పరిస్థితి నెలకొంది! ఈ కారణంగానే ఈసారి ఫలితాలను అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దళిత ఓట్లను చీల్చనున్న వీబీఏ! ఎన్నికల బరిలో ఉన్న వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) నిజానికి పలు చిన్న పార్టీల కూటమి. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని ఈ కూటమికి దళితులు, బౌద్ధ దళితులు, ఇతర అణగారిన వర్గాలతో పాటు ముస్లింలలో కూడా మంచి ఆదరణే ఉంది. రిజర్వేషన్లే ప్రధాన నినాదంగా ఈసారి ఏకంగా 67 స్థానాల్లో వీబీఏ బరిలో దిగింది. వీటిలో అత్యధిక స్థానాలు ముంబై, విదర్భ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర జనాభాలో దళితులు 14 శాతం, బౌద్ధ దళితులు 7 శాతమున్నారు. గతంలోనూ పలు ఎన్నికల్లో వీబీఏ సత్తా చాటింది.విదర్భతో పాటు మరాఠ్వాడా ప్రాంతంలోనూ పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణ ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాకపోయినా 7 శాతం ఓట్లు సాధించింది. ఈసారి వీబీఏ భారీగా దళిత ఓట్లు సాధిస్తే ప్రధానంగా ఎంవీఏ కూటమికే దెబ్బ పడుతుంది. 2019లో కూడా కనీసం 10 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్థుల ఓటమికి వీబీఏ సాధించిన ఓట్లే కారణమని తేలింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా పలు స్థానాల్లో ఎంవీఏ అభ్యర్థుల ఓటమికి వీబీఏ కారణంగా నిలిచింది. ఇవే గాక మరికొన్ని చిన్న పార్టీలతో స్థానికంగా గట్టి పట్టున్న స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు స్థానాల్లో కూటముల అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.జరంగే ఫ్యాక్టర్? మరాఠా హక్కుల ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ కూడా ఈసారి ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపేలా ఉన్నారు. ఈసారి అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి రెండు కూటములకూ ఆయన చెమటలు పట్టించారు. మహారాష్ట్ర జనాభాలో ఏకంగా 30 శాతానికి పైగా ఉండే మరాఠాల్లో ఆయనకు గట్టి పట్టుండటమే ఇందుకు కారణం. చివరి క్షణంలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా ఎన్నికల ఫలితాలపై మాత్రం జరంగే గట్టి ప్రభావమే చూపనున్నారు.ముఖ్యంగా మరాఠ్వాడాలో చాలా స్థానాల్లో ఆయన మద్దతిచ్చే అభ్యర్థులే గట్టెక్కే పరిస్థితి నెలకొని ఉంది! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జరంగే సహాయ నిరాకరణ మరాఠ్వాడాతో పాటు పశ్చిమ మహారాష్ట్ర, విదర్భల్లోని పలు స్థానాల్లో మహాయుతి అవకాశాలను బాగా దెబ్బతీసింది. ఆ చేదు అనుభవం ఈసారీ పునరావృతం అవుతుందేమోనని బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
మహా ఎన్నికలు: ‘నన్ను గెలిపిస్తే.. బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు జరిపిస్తా’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థుల విచిత్ర హామీలు ఇస్తున్నారు. అయితే.. ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తానను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పర్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘‘యువతకు పని కల్పిస్తాం. పెళ్లి సమయంలో యువకులకు ఉద్యోగం లేదా వ్యాపారం ఉందా? అడుగుతారు. జిల్లా మంత్రి ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు, మీరు ఏవిధంగా ఉద్యోగాలు పొందుతారు. ధనుంజయ్ ముండే.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగాలు లేక.. స్థానిక బ్యాచిలర్లు వివాహం చేసుకోవడం కష్టంగా మారింది. నన్ను గెలిపిస్తే.. ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్‌కు పెళ్లిలు చేస్తా’ అని అన్నారు.Unique poll promise@NCPspeaks candidate #RajasahebDeshmukh says on getting elected from Beed district's #Parli assembly constituency, he will get all the bachelors married#Maharashtra #PoliticsToday #MaharashtraAssembly pic.twitter.com/TfRm7kRtO8— Mohammed Akhef TOI (@MohammedAkhef) November 6, 2024 దేశ్‌ముఖ్ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే పరిశ్రమలు తేకపోవడంతో ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక యువత ఇబ్బంది పడుతున్నారని ర రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆరోపణలు చేశారు.చదవండి: నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ -
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
జార్ఖండ్‌లో కూటమి పార్టీలు ఆరిపోయిన టపాసులు: కేంద్ర మంత్రి
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని అభివర్ణించారు. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. దీపావళి పండుగ ఇప్పుడే ముగిసిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్ , ఆర్జేడీ పార్టీలు ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌తో కలిసిపోయాయి. కానీ, బీజేపీ మాత్రమే జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిమంతమైన రాకెట్. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని నేను హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నా. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది?. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్ నిలబెడతాం. మేం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే కాకుండా వ్యవస్థను కూడా మారుస్తాం’’అని అన్నారు.మరోవైపు.. సోమవారం జార్ఖండ్‌లోని గర్వాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జేఎంఎం కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నందుకు జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ‘చొరబాటుదారుల కూటమి’గా అభివర్ణించారు. ‘‘జార్ఖండ్‌లో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గిరిజన సమాజానికి, దేశానికి పెనుముప్పు. ఈ సంకీర్ణ కూటమి.. చొరబాటుదారుల కూటమి’’ అని మోదీ అన్నారు. ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా పై ఈసీ వేటు