సీఐ దూషించాడని..
రాజమండ్రి రూరల్(తూర్పుగోదావరి): బొమ్మూరు సీఐ కనకారావు దూషించాడని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గిరిజా చంద్రశేఖర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయమై సీఐ, చంద్రశేఖర్‌ను స్టేషన్‌కు పిలిపించి బండబూతులు తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. బాధితుడు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.