basara iiit
-
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్ ఐటీలో వాకథాన్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్‌లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మిస్సింగ్ కలకలం.. బన్నీకి ఏమైంది?
సాక్షి, బాసర: నిజామాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో మరో కలకలం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సదరు విద్యార్థి మూడు రోజులుగా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విద్యార్థి పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. దీంతో, తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వివరాల ప్రకారం.. బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ(18) ఏళ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి స్వస్థలం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి. ఈ నెల 6న తాను ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఔట్‌పాస్ తీసుకున్నాడు. వర్సిటీ నిబంధనల మేరకు సిబ్బంది అతడికి ఔట్‌పాస్ జారీ చేశారు. అయితే, బన్నీ మాత్రం ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం.. తాము ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్‌కు వచ్చి ఆరాతీశారు. కాగా, బన్నీ ఇంటికి వెళ్తుతున్నానని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా యాజమాన్యం తెలిపింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని యాజమాన్యాన్ని నిలదీశారు. బన్నీ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఇంటికి వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం -
బాసర ట్రిపుల్ ఐటీ: బాలిక ఆత్మహత్యలపై తమిళిసై ఆవేదన
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో బాలికల ఆత్మహత్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విద్యార్ధుల ఆత్మహత్యలపై వర్సిటీ తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ నివేదిక కోరారు. ఈ క్రమంలో 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై జోక్యం చేసుకోవాలని వీసీకి సూచించారు. విపరీత చర్యలకు పాల్పడవద్దని విద్యార్థులకు తమిళిసై విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు -
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం
-
బాసర: దీపిక కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక సూసైడ్ వ్యవహారంలో కీలక విషయం ఒకటి వెలుగు చూసింది. ఇవాళ్టి పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడిన దీపిక.. డిబార్ చేస్తారనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు ధృవీకరించకపోగా.. దీపిక మృతిపై పారదర్శకంగా విచారణ జరపాలని పోలీసులను విద్యార్థులకు కోరుతున్నారు. ఆర్జీయూకేటీ పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక.. A3 బ్లాక్‌లోని బాత్రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న దీపికను భైంసా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. అంతకు ముందు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ముగ్గురు మాస్ కాపీయింగ్‌కు పాల్పడగా.. అందులో దీపిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిబార్ భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్. వార్షిక పరీక్షల అనంతరం బాత్రూంకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్ధలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం బైంసా ఏరియాసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇదీ చదవండి: శిరీష కేసుపై నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఆదేశాలు -
అమ్మా.. నన్ను క్షమించు.. అక్కను బాగా చూసుకో..
బాసర(ముథోల్): ‘అమ్మా నన్ను క్షమించు.. అక్కను బాగాచూసుకో.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా మానసిక సమస్యలే నా చావుకు కారణం’అని బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ–2 విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఆదివారం మధ్యాహ్నం భానుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం బహిర్గతమైన ఈ సూసైడ్ నోట్లో తాను ఓసీడీ(అనవసరపు భయాందోళన)తో తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు వెల్లడించాడు. గతంలో ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నానని, చదువుపై «శ్రద్ధ పెట్టలేకపోతున్నానని, పరీక్షల్లో మార్కులు సరిగా రావడం లేదని వివరించాడు. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం, రహస్యంగా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడంపై ఆదివారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేశారు. అడ్మిని్రస్టేటివ్ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. సూసైడ్‌నోట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నోట్ బహిర్గతం చేయడంతో ఆందోళన విరమించారు. కాగా, వర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం విద్యార్థి సంఘాలతోపాటు, బీజేపీ, ఆప్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టడంతో ట్రిపుల్ ఐటీ, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు వర్సిటీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ నోట్ విడుదల
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు అందిస్తామన్నారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. క్యాంపస్‌కు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో ఉన్న చెరువును సుందరీకరణ చేస్తామని తెలిపారు. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం 10 పడకలతో కూడిన ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రపంచంతో పోటీపడే సత్తా ఉందని కొనియాడారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ తెలిపారు. అనేక స్టార్టప్‌లకు తెలంగాణ వేదికగా మారుతోందని, ప్రఖ్యాత సంస్థలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయని పేర్కొన్నారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకైనా పోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహా అనేక కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఈ కోర్సులను అర్జీయూకేటి నుంచి ప్రారంభించాలని వీసీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బాసర: బాసరలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరోసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. బుధవారం భోజనం చేసిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. వారిని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి హాస్టల్‌కు పంపించినట్లు సమాచారం. ఇదీ చదవండి: తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి! -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులను వేధించిన ఘటనలో బుధవారం ఇద్దరు కళాశాల ఉద్యోగులపై అధికారులు వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ శాఖలోని అటెండర్ విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేయగా.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడినట్టు తెలుస్తోంది. ఆ విద్యార్థిని ఇచ్చిన ఆధారాల ప్రకారం ఉద్యోగుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం. తనకు దగ్గరి బంధువులు కావడంతో పలకరించేవాడినని సదరు ఉద్యోగి చెప్పగా, అతని భార్యను కళాశాల లోని భవనంలో అధికారులు రహస్యంగా విచారించినట్టు తెలిసింది. సదరు విద్యార్థినులతో తమకు బంధుత్వం లేదని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు వివరించిన కళాశాల అధికారులు ఓ కమిటీ వేసి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, మరో ఉద్యోగికి సైతం ఈ వ్యవహారంతో సంబంధం ఉండగా.. తను విధులు నిర్వర్తించే సెక్షన్లో అవకతవకలకు పాల్పడినందుకు వేటు వేసినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై కళాశాల డైరెక్టర్ సతీ‹Ùను సంప్రదించగా.. కొందరు కళాశాల నియమాలను అతిక్రమించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఏకసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏ అంశంపై కమిటీని ఏర్పాటు చేశారని ప్రశ్నించగా జవాబు దాటవేశారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్ రయ్! -
ట్రిపుల్ ఐటీలో ఇంటర్ తరహా పరీక్షలు
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారన్నారు. డిసెంబర్లో స్నాతకోత్సవం బాసర ట్రిపుల్ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్లో నిర్వహిస్తామని ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్సైట్లో వీసీ డాష్ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్ పోర్టల్‌ను ప్రారంభించారు. -
TS: ట్రిపుల్ ఐటీలో టీ-హబ్
భైంసా (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో సమస్య లన్నింటినీ పరిష్కరిస్తామని.. విద్యార్థులు ఆవిష్కర ణలపై దృష్టిపెట్టేలా టీ–హబ్‌ను ఏర్పాటు చేస్తా మని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు. ‘తక్కువ జనాభా ఉన్న అమెరికా ఉత్పత్తులు చేస్తుంటే ఎక్కువ జనం ఉన్న మనం ఇంకా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనలోనే ఉంటు న్నాం. విద్యార్థులు ఆవిష్కరణల కోసం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. త్వరలోనే 1,000 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. సోమవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్ర కరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను ఎంతమంది చూశారని కేటీఆర్ విద్యా ర్థులను ప్రశ్నించారు. అలా బాసర ట్రిపుల్‌ఐటీలోనే టీ–హబ్ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మామూలుగా ఉద్యోగాలు చేయడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఉద్యోగాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా.. కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల ఏర్పాటు ఆలోచనలు చేయాలని సూచించారు. అలాంటి ఆలోచనలున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. హాస్టల్ కష్టాలు నాకూ తెలుసు తాను చదువుకున్నప్పుడు 70శాతం జీవితం హాస్టల్లోనే గడిచిందని, హాస్టల్ కష్టాలు తనకూ తెలుసని మంత్రి కేటీఆర్ చెప్పారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో ఔట్‌డోర్ మినీ స్టేడియాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామని.. 50 అదనపు మోడల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవంబర్‌లో విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ ఇక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని విద్యార్థులకు సూచించారు. ట్రిపుల్ ఐటీ న్యూమెస్‌లో తాను వెళ్లిన బాత్రూం తలుపులు సరిగా పడలేదని.. ఇలాంటి ఇబ్బందులన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. రెండు నెలల తర్వాత విద్యా మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మళ్లీ వస్తానన్నారు. క్యాంపస్‌ను కాపాడుకోవాలి 10 వేల మంది ఉండే ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మించడం, ప్రారంభించడం సులువైన పని అని.. కానీ వాటి నిర్వహణే ప్రధాన సమస్య అని, వీటిని పద్దతిగా ఉంచే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పరిశుభ్రతకు జపాన్, సింగపూర్లలో ఇచ్చే ప్రాధాన్యతపై తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నెలలో ఒకరోజైనా శ్రమదానం చేసి.. 272 ఎకరాల్లో ఉన్న క్యాంపస్ పరిసరాలను శుభ్రంగా, చెత్తా చెదారం లేకుండా చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి నచ్చింది ట్రిపుల్ ఐటీలో విద్యార్థులంతా శాంతియుతంగా చేసిన ఉద్యమ స్ఫూర్తి తనకు బాగా నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీజీ సత్యాగ్రహం తరహాలో.. తమ సమస్యల పరిష్కారం కోసం ఎండావానలకు వెరవక వారం పాటు విద్యార్థులు చేసిన పోరాటం బాగుందని కొనియాడారు. తాను విద్యార్థుల ఆందోళనను ప్రతిరోజు చూశానని.. ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులను పిలవకుండా విద్యార్థులే ఎస్జీసీ ఏర్పాటు చేసుకుని, ఉద్యమించడం నచ్చిందని అభినందించారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశం
-
మీ పోరాటం నాకు నచ్చింది.. బాసర ట్రిపుల్ ఐటీలో కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, బాసర(ఆదిలాబాద్): కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టల్ మెస్‌లో భోజనం విషయంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. దీంతో, విద్యార్థుల ఆందోళనలు తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సైతం సృష్టించాయి. గవర్నర్ తమిళిసై సహా పలువురు రాజకీయ నేతలు సైతం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి.. విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్.. సోమవారం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ సందర్భంగా హాస్టల్లో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ ఆరా తీశారు. విద్యార్థులతో సమావేశమై.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమలోనే వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మీ పోరాటం నాకు నచ్చింది. రాజకీయాలకు తావు లేకుండా ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా పోరాటం చేసి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మెస్ సరిగా లేదన్న విషయం ఇప్పటికే గుర్తించాము. ప్రతీరోజు మంచి ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాము. విద్యార్థులకు త్వరలోనే ల్యాప్‌టాప్‌లు ఇస్తాము. హాస్టల్లో ఉండే కష్టాలు నాకు కూడా తెలుసు. మెస్‌ల్లోనూ, బాత్రూమ్లోనూ ఉండే ఇబ్బందులు నాకూ తెలుసు. నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఇక్కడున్న సమస్యలు తెలుసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మరో రెండు నెలల తర్వాత మళ్లీ ట్రిపుల్ ఐటీకి వస్తాను. ట్రిపుల్ ఐటీలో వసతులను మరింత అభివృద్ధి చేసాము’ అంటూ హామీ ఇచ్చారు. -
బాసరకు మంత్రి కేటీఆర్
నిర్మల్: ఎట్టకేలకు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కలవనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఆర్జీయూకేటీకి రానున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడకు వెళ్లనున్నారు. అక్కడ జోగు రామన్నను పరామర్శించి బాసరకు రానున్నారు. విద్యార్థులతో మాటాముచ్చట.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు ఆర్జీయూకేటీ చేరుకోనున్నారు. ముందుగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత వారితో మాట్లాడనున్నారు. రెండు గంటలు కేటీఆర్‌తోపాటు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి వర్సిటీలో ఉండనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇందుకు సీఎం లేదా మంత్రి కేటీఆర్ తమవద్దకు రావాలని జూన్‌లో విద్యార్థులు వారంపాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడిచ్చిన హామీ మేరకు కేటీఆర్ క్యాంపస్‌కు వస్తున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. -
విద్యార్థుల సమస్యలపై సీఎంకు లేఖ రాస్తా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బాసర ట్రిపుల్ ఐటీతోపాటు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లాలోని బోనకల్ ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. గురుకులంలో 550 మంది విద్యార్థులు ఉండగా, సరిపడా గదులు, పడకలు లేక నేలపైనే పడుకుంటున్నట్లు బాలికలు భట్టి దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల సందర్శన అనంతరం భట్టి ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను స్వయంగా పరిశీలించి విద్యార్థుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావే శాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. బాసర ట్రిపుల్ ఐటీతో పాటు సిద్దిపేట, మహబూబాబాద్, మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులు పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడతానని భట్టి తెలిపారు. -
డిచ్ పల్లి చేరుకున్న విద్యార్థి సురేశ్ మృతదేహం
-
బాసర ట్రిపుల్ ఐటీలో సురేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర/నిర్మల్/డిచ్పల్లి: వరుస ఘటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం మరో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ–1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్పాస్ట్ చేశాడు. అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్ మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్‌కు వచ్చిన సహచరులకు సురేశ్ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సురేశ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి చికిత్స చేశారు... గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్ గో బ్యాక్’అంటూ నినదించారు. పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సురేశ్ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు. తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్‌కు ట్విట్టర్లో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఆçస్పత్రిలో సురేశ్ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గంజాయితో సంబంధం లేదంటూ ఆవేదన రాథోడ్ సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండా. రాథోడ్ గంగారాం, సరోజ దంపతులకు సురేశ్‌తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో సురేశ్ సైతం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో గంజాయి తాగుతున్నారంటూ సురేశ్‌తోపాటు కొందరు విద్యార్థులను వారం క్రితం పిలిపించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వేధింపులతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (డ్యామిట్ కథ అడ్డంతిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి) -
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
-
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల తొలి జాబితా విడుదల
బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాల తొలి జాబితాను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో 1,404 సీట్లకుగాను మెరిట్ జాబితాను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ విడుదల చేశారు. జాబితాను వర్సిటీ అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో తొలిజాబితాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 212 సీట్లు దక్కగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాకు 07 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపికైనవారిలో 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులేనని అధికారులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పాలిసెట్‌లో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేయడంతో 60 శాతం సీట్లు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకే దక్కాయి. కానరాని ఆసిఫాబాద్, నారాయణపేట తొలి జాబితాలో కుమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలకు ఒక్క సీటూ దక్కలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్ జిల్లాకు చోటు లభించకపోవడం గమనార్హం. పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 258 సీట్లు దక్కగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 63 సీట్లు రావడం గమనార్హం. మొదటిదశ కౌన్సెలింగ్ మూడురోజులపాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 28న 1 నుంచి 500 వరకు, 29న 501 నుంచి 1,000 వరకు, 30న 1001 నుంచి 1,404 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటిసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం(140) సీట్లను కేటాయించినట్లు తెలిపారు. తొలి జాబితాలో73 శాతం బాలికలే ఉన్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. -
సమస్యలు నాకు వదిలేయండి..
భైంసా: ‘మీ డిమాండ్లు న్యాయమైనవి. అవన్నీ పరిష్కరించదగ్గవే. సమస్యలను నాకు వదిలేయండి.. చదువుపై దృష్టిపెట్టండి. మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’అని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులకు హామీ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వర్సిటీ సందర్శన కోసం హైదరాబాద్ (కాచిగూడ) నుంచి శనివారం రాత్రి 11:30 గంటలకు రామేశ్వరం–ఓఖా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన గవర్నర్ తమిళిసై.. అర్ధరాత్రి 2:40 గంటలకు నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం వేకువజామున 4 గంటలకు బాసర చేరుకొని తొలుత వర్సిటీ గెస్ట్‌హౌస్‌లో 3 గంటలపాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వర్సిటీకి చేరుకున్నారు. 6 గంటలు వర్సిటీలో.. క్యాంపస్‌లోని పరిసరాలను గవర్నర్ తమిళిసై తొలుత పరిశీలించారు. విద్యార్థుల వసతిగృహాలు, బాత్రూంలలో వసతులను చూశారు. విద్యార్థులతో కలసి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో వండిన వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తర్వాత అధికారులతో భేటీ అయ్యారు. ఆపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు 6 గంటలపాటు వర్సిటీలోనే గడిపారు. మంచి భోజనం, వసతి, మెరుగైన బోధన కోరుతున్నారు.. వర్సిటీ నుంచి తిరుగు ప్రయాణంలో క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఇబ్బందులు న్యాయమైనవేనని.. వారంతా మంచి భోజనం, వసతి, మెరుగైన బోధన కావాలని అడుగుతున్నారని చెప్పారు. అవన్నీ కల్పించడం పెద్ద విషయమేకాదన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడంలేదని.. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదన్నారు. వర్సిటీలో సిబ్బంది కొరత, భద్రతాపరమైన ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. విద్యార్థులకు తన వంతుగా నైతిక స్థైర్యం అందించానని గవర్నర్ తెలిపారు. విద్యార్థులకు తరచూ మెడికల్ చెకప్‌లు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇకపై ఒక్కో సమస్య తీరుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. తెలంగాణ వర్సిటీలో పరిశోధనలు పెరగాలి.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు మరింత పెరగాలని గవర్నర్ తమిళిసై సూచించారు. నూతన ఆవిష్కరణలతోనే జాతీయ స్థాయిలో పేరు వస్తుందని, పరిశోధనలు అత్యున్నత స్థాయిలో ఉంటే తెలంగాణ యూనివర్సిటీని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకుళ్లడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘న్యాక్’ఏ–గ్రేడ్ ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ సందర్శన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎన్ఎస్ఎస్ కేడెట్లు, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎంసీఏ కళాశాలలో విద్యార్థులతో తమిళిసై సమావేశమయ్యారు. అధ్యాపకులు, భవనాల కొరత గురించి విద్యార్థులు చెప్పగా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లైబ్రరీని, బాలికలు, బాలుర వసతిగృహాలను గవర్నర్ పరిశీలించారు. వర్సిటీ అతిథిగృహంలో భోజనం చేశారు. మధ్యాహ్నం 3:28 గంటలకు డిచ్పల్లి రైల్వేస్టేషన్ నుంచి అకోలా–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, గవర్నర్ పర్యటనలో కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. వర్సిటీల సందర్శన తొలిసారి... 2008లో బాసర ట్రిపుల్ ఐటీ ఏర్పాడ్డాక విద్యార్థుల సమస్యలు తెలుసుకొనేందుకు ఒక గవర్నర్ క్యాంపస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న తొలి గవర్నర్ తమిళిసై కావడం విశేషం. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటయ్యాక క్యాంపస్‌కు వచ్చిన తొలి చాన్స్‌లర్ సైతం తమిళిసై సౌందరరాజనే కావడం గమనార్హం. ఇది కూడా చదవండి: యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి