BC movement
-
ఆర్ కృష్ణయ్య: గోల్డ్ మెడలిస్ట్.. విద్యార్థి దశ నుంచే పోరుబాట
సాక్షి, అమరావతి: బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్యను వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. దశాబ్దాలపాటు బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఉద్యమనేతకు సముచిత స్థానం ఇవ్వాలనే సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేపథ్యం ఏంటో చూద్దాం. ఆర్ కృష్ణయ్య.. పూర్తి పేరు ర్యాగ కృష్ణయ్య. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉద్యమ నేతగా ఎదిగారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు-ఆర్ కృష్ణయ్య -
హే కృష్ణయ్యా...
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆర్.కృష్ణయ్యే సీఎం!... ఏడాది కిందట ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన ఈ మాటలతో 40 ఏళ్ల బీసీ ఉద్యమాన్ని పక్కనబెట్టి తెలుగుదేశంలో చేరిండు కృష్ణయ్య. ఎల్.బి.నగర్ నుంచి పోటీ కూడా చేసి గెలిచిన ఆయనకు ఎన్నికల తరువాత జ్ఞానం బోధపడింది. ‘సీఎం క్యాండిడేట్‌ను కదా! 15 సీట్లు గెలుచుకున్న పార్టీకి టీడీఎల్పీ లీడర్‌ను నేనే అవుతా’ అనుకున్నాడాయన. అయితే సీను మారిపోయింది. కృష్ణయ్య అసెంబ్లీకి కొత్త. తెలంగాణలో పార్టీ బలపడాలంటే సీనియర్ ఎర్రబెల్లి దయాకర్ రావు బెస్ట్ అనుకున్నడు బాబు. సీఎం క్యాండెట్‌కు లేని అనుభవం శాసనసభలో లీడర్ కావాలంటే అవసరమా అని మధనపడ్డాడు కృష్ణయ్య. పక్కనబెట్టిన బీసీ ఉద్యమ కాడిని మళ్లీ భుజాన వేసుకున్నాడు. పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాంరాం చెప్పాలనుకున్నాడు. కానీ హోదా, గన్మెన్లు, అలవెన్సులు... వదులుకోవడం ఎందుక నుకున్నాడో లేక చంద్రబాబు వద్దన్నాడో తెలియదు గానీ... పార్టీలనే ఉన్నడు. అయితే పార్టీ మీటింగ్‌లకు రానని తెగేసి చెప్పిండు. నేను ఎమ్మెల్యేగా ఉంట. పార్టీ కార్యక్రమాల కోసం ఇన్చార్జిని పెట్టుకోమని బాబుకు చెప్పిండు. ఎల్బీ నగర్‌కు పార్టీ ఇన్చార్జిగా వేరే నాయకుని పేరు కృష్ణయ్యే చెప్పిండు. మొన్న ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, బాబు బీసీలను మోసం చేస్తున్నారు’ అని ప్రకటించిండు. స్వచ్ఛ హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ అంటే ... హైదరాబాద్ కోసం సీఎం బాగా పనిచేస్తున్నడు అని కూడా అనౌన్స్ చేసిండు. టీడీపీ ఎమ్మెల్యేవు కదా... అని అంటే... బీసీలే నాకు ముఖ్యం. పార్టీ, ఎమ్మెల్యే పదవులు కాదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నడు. అసలే గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు టీఆర్ఎస్ల చేరుతుంటే ఈ కృష్ణయ్య గొడవేంది ‘బాబూ’ అని తెలంగాణ టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నరు.