'అక్కడే విమానం అదృశ్యమై ఉండొచ్చు'
జకర్తా: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతూ గగన తలంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501లో ఏడుగురు సిబ్బంది, 155 మంది ప్రయాణికులున్నారని ఇండోనేసియా రవాణా శాఖ అధికారి హాది ముస్తోఫా వెల్లడించారు. కాలిమాంటన్- బెలిటుండ్ ఐలాండ్ మధ్య విమానం అదృశ్యమై ఉండొచ్చని తెలిపారు.
ఏటీసీతో సంబంధాలు తెగిపోవడానికి ముందు అసాధారణమైన దారిలో(అన్యూజ్వల్ రూట్) ప్రయాణించడానికి పైలట్లు అనుమతి కోరారని వెల్లడించారు. అదృశ్యమైన విమానాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.