Bengal violence
-
బెంగాల్లో నాటు బాంబు పేలుడు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. నార్త్ 24 పరగణ జిల్లాలోని కంకినారలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎండీ ముక్తర్(68) తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్నసమయంలో గుర్తు తెలియని దుండగులు అతని నివాసం ముందు నాటు బాంబును పేల్చారు. ఈ ఘటనలో పేలడంతో ముక్తర్‌తో పాటు మరొకరి ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాంబు దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కంకినారలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు బాగా తీరుగుతారని, దోపిడీ కోసమే ఇలాంటి ఘటనలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడ్డవారికి సహాయం అందించవల్సిందగా స్థానిక అధికారులును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా బాండు పేలుడు ఘటనలో రాజకీయ వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. -
‘కళ్ల ముందే నా భర్తను కాల్చిచంపారు’
కోల్కత్తా: తన కళ్ల ముందే తన భర్తను తృణమూల్ కార్యకర్తలు కాల్చిచంపారని రెండురోజుల క్రితం హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రదీప్ భార్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి బెంగాల్‌లోని 24 పరగణా జిల్లాలో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ మద్దతుదారులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ప్రదీప్ మొండల్ అనే వ్యక్తిని తన ఇంట్లోనే భార్య ముందే దారణంగా కాల్చిచంపారని ఆయన భార్య పద్మ మొండల్ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రదీప్‌తో పాటు శంకర్ మొండల్‌ను కూడా ఇదే విధంగా కాల్చి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదిలావుడంగా.. పశ్చిమబెంగాల్లో (టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణల అనంతరం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బెంగాల్లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించింది. ఆందోళనలు, అల్లర్లను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి జవాబు ఇచ్చింది. సంఘవిద్రోహక శక్తుల కారణంగా చెలరేగిన అల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో శనివారం రాత్రి టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు మాటలయుద్ధానికి దిగారు. టీఎంసీ శ్రేణుల దాడుల్లో బీజేపీ కార్యకర్తలు చనిపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సయతన్ బసూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘర్షణల్లో కయూమ్ మొల్లాహ్ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయానికి కమలనాథులు ఊరేగింపుగా తీసుకురాగా, పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ముకుల్‌రాయ్ ఆరోపించారు. తమ కార్యకర్తల చావుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 11 మంది మహిళలు సహా 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బెంగాల్ హింసపై కేంద్రం ఆందోళన
సందేశ్‌ఖలీ/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణల అనంతరం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బెంగాల్లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించింది. ఆందోళనలు, అల్లర్లను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు మాటలయుద్ధానికి దిగారు. టీఎంసీ శ్రేణుల దాడుల్లో బీజేపీ కార్యకర్తలు సుకాంత మొండల్, ప్రదీప్ మొండల్, శంకర్ మొండల్ చనిపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సయతన్ బసూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘర్షణల్లో కయూమ్ మొల్లాహ్ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయానికి కమలనాథులు ఊరేగింపుగా తీసుకురాగా, పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ముకుల్‌రాయ్ ఆరోపించారు. తమ కార్యకర్తల చావుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 11 మంది మహిళలు సహా 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి జవాబు ఇచ్చింది. సంఘవిద్రోహక శక్తుల కారణంగా చెలరేగిన అల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేసింది. -
ప్రధానమంత్రి మోదీకి సీఎం సవాల్
మీలో ఎంత దమ్ముందో చూస్తానంటూ వ్యాఖ్య కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ధూలాగఢ్ ప్రాంతం మతఘర్షణలు, లూటీలు, దాడులతో అట్టుడికిపోతున్నది. ఈ నేపథ్యంలో గతవారం రోజులుగా మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 'రాజకీయ హింసలో ఎలాంటి అర్థం లేదు. ఇదే విషయం నరేంద్రమోదీకి, బీజేపీకి చెప్పదలుచుకున్నాను. ఎవరినీ గాయపరచాల్సిన అవసరం లేదు. నన్ను ఒక్కరిని అరెస్టు చేయండి సరిపోతుంది. మమతా బెనర్జీపై మీకున్న రాజకీయ కక్ష తీరిపోతుంది' అని ఆమె ఆగ్రహంగా పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న ధూలాగఢ్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలాఘాట్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీకి, బీజేపీకి బంహిరంగ సవాళ్లు విసిరారు. బెంగాల్లో మతఘర్షణలు రేకెత్తించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 'మీలో ఎంత దమ్ముందో నేను కూడా చూస్తాను. మీరు ఎన్ని ఘర్షణలు సృష్టిస్తారో, ఎంతగా లూటీ చేస్తారో చూద్దాం. మీరు నన్ను ఆపాలనుకుంటున్నారు. ఎన్నో కుట్రలు చేస్తున్నారు. మీ కుట్రలన్నీ చూశాను. మీకు చాలెంజ్ చేస్తున్నాను' అని మమత విరుచుకుపడ్డారు. గత అక్టోబర్ నెల నుంచి బెంగాల్లో తరచూ మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ధూలాగఢ్లో మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తుండగా ఘర్షణలు చెలరేగి.. దాడులు, లూటీలు సంభవించాయి. అయితే, మరోవైపు సీఎం వెళ్లిపోగానే అదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఈ ప్రాంతంలో ఘర్షణలకు అధికార తృణమూల్ పార్టీయే కారణమని, ఇందులో సీఎం మమత, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తముందని ఆరోపించారు.