Bhagavad Gita
-
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం
భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్లమెంటులో హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. భగవద్గీతపై ప్రమాణం చేసి కింగ్ ఛార్లెస్ రాజుకు విదేయతగా ఉంటానని పేర్కొన్నారు.శివాని రాజా చేసిన స్వీకారోత్సవం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. మన పవిత్ర గ్రంథాలకు మీరు తగిన గౌరవం ఇవ్వడం సంతోషంగా ఉంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఈ భగవద్గీత మార్గదర్శకంగా పనిచేస్తుందని భావిస్తున్నాం* అంటూ కామెంట్ చేస్తున్నారు.It was an honour to be sworn into Parliament today to represent Leicester East. I was truly proud to swear my allegiance to His Majesty King Charles on the Gita.#LeicesterEast pic.twitter.com/l7hogSSE2C— Shivani Raja MP (@ShivaniRaja_LE) July 10, 2024 కాగా గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ నుంచి ఆమె కన్జర్బేటివ్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. అక్కడ గత 37 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేతలెవరూ గెలవకపోవడం గమనార్హం. ఇన్నేళ్ల తరవాత గెలిచి శివాని రాజా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడించింది కూడా భారత సంతతికి చెందిన నేత (రాజేశ్ అగర్వాల్) కావడం విశేషం. శివానికి 14,526 ఓట్లు రాగా రాజేశ్‌కు 10,100 ఓట్లు పడ్డాయి.ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారాన్ని కోల్పోగా.. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. -
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం: యంగ్ హీరో
ఇటీవలే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈనెల 8న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో విశ్వక్ అఘోరా పాత్రలో కనిపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే తాజాగా విశ్వక్ సేన్ ఓ ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప దర్శనం అధ్యాయాన్ని లాంచ్ చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు ధన్యవాదాలు తెలిపారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. 'ఈ వేడుకలో భాగం కావడం గర్వంగా వుంది. భగవద్గీత విశ్వరూప దర్శనం అధ్యాయం లాంఛ్ చేయడం నా అదృష్టం. కేవలం పాడ్ కాస్ట్‌లా వినొచ్చేమో అనుకున్నా. కానీ విజువల్ కూడా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా చేశారు. నేటి యువతతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంను చాలా చక్కగా రికార్డ్ చేసిన ఆర్పీ పట్నాయక్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప కార్యం. ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది' అని అన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'ఈ కార్యాన్ని భగవంతుడే నా చేత చేయించాడు. నేను కేవలం నిమిత్తమాత్రుడినే. స్వామి ముకుందనంద రాసిన భగవద్గీత అందరికీ సులువుగా అర్ధమైయ్యేలా ఉంటుంది. వారి అనుమతితోనే రికార్డ్ చేశాను. ఈ ప్రయాణంలో ఎంతగానో తోడ్పడిన దివాకర్ గారికి ధన్యవాదాలు. జానకీరామ్ అద్భుతమైన విజువల్స్ చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. మొత్తం మన పురాణాలన్నింటిని తన బొమ్మలతో ప్రపంచానికి చెప్పే మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారాయన. నా వంతుగా సపోర్ట్ చేస్తూ లక్ష రూపాయిలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ కోసం మౌళి చాలా కష్టపడ్డాడు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. యూత్‌ని దృష్టిలో పెట్టుకొని చేసిన భగవద్గీత ఇది. అందుకే అతిథిగా యంగ్ హీరో విశ్వక్‌ను పిలిచాం. దేవుడు కల్పించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు. దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ...'భగవద్గీత ఆర్పీ పట్నాయక్ తాత్పర్యంతో రికార్డ్ చేస్తున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఇది చాలా బాగుంది. చిరకాలం నిలిచిపోయే ప్రాజెక్ట్' అని అన్నారు. ఈ వేడుకలో జేకే భార్గవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సురేష్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారి.. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం!
బ్రిటన్ పార్లమెంట్లో ప్రధానిగా రిషి సునాక్ భగవద్గీతపై ప్రమాణం చేయడం భారతీయులకు ఎంతో గర్వంగా అనిపించింది. వలస పాలనతో మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల దేశంలో మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని అవ్వడం, మన హిందూమత గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేయడం ప్రతీ భారతీయుడిని భావోద్వేగానికి గురి చేసింది. అలా చేసిత తొలి యూకే ప్రధానిగా రిషి సునాక్ అందరీ దృష్టిని ఆకర్షించారు కూడా. మళ్లీ అదే తరహాలో ఆస్ట్రేలియా పార్లమెంట్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అంతేగాదు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి ఓ చారిత్రక ఘట్టానికి వేదికయ్యింది. అదేంటంటే.. ఆస్ల్రేలియా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్.. ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలో ఈ ఘటన సాధించిన తొలి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇప్పటికీ మన కోర్టుల్లో దీనిపైనే ప్రమాణం చేస్తారు. మన చట్ట సభల్లో భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా మన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియన్ పార్లమెంటులో మన పవిత్ర గ్రంథంపై భారతీయ సంతతికి చెందిన సెనేటర్(ఎంపీ) ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు. The Legislative Assembly and the Legislative Council have chosen Senator Varun Ghosh to represent Western Australia in the Senate of the Federal Parliament. 📄Read Hansard or view our broadcast archive after the joint sitting: https://t.co/TtFao460FO pic.twitter.com/TMEx59SqTG — Legislative Assembly (@AssemblyWA) February 1, 2024 లెజిస్టేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకి ప్రాతినిథ్యం వహించేందుకు వరుణ్ ఘోషను ఎంపిక చేశాయి. ఈ మేరకు ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో..పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. సెనేటర్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్ మీరు. తొలిసారిగా ఓ వ్యక్తి సరికొత్త అధ్యయానికి తెరతీసినప్పుడూ అతనే చివరి వారు కాదని గుర్తుంచుకోవాలి. సెనేటర్ ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియన్ల బలమైన గొంతుకగా ఉంటారని నమ్ముతున్నా. అని పేర్కొన్నారు పెన్నీ వాంగ్. ఇక ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ కూడా ట్విట్టర్లో పశ్చిమా ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉండటం అద్భుతంగా ఉంది. అని అన్నారు. Welcome Varun Ghosh, our newest Senator from Western Australia. Fantastic to have you on the team. pic.twitter.com/TSnVoSK3HO — Anthony Albanese (@AlboMP) February 5, 2024 వరుణ్ నేపథ్యం.. పెర్త్‌లో నివాసం ఉండే వరుణ్ ఘోష్ వృత్తి రీత్యా న్యాయవాది. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ అండ్ లాలో డిగ్రీని పొందాడు. క్రేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్కూడా. అతను వాషింగ్టన్ డీసీలో ప్రపంచబ్యాంకు సలహదారుగా, న్యూయార్క్ ఫైనాన్స్ అటార్నీగా బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని లేబర్ పార్టీలో చేరడంతో అతని రాజకీయ జీవితం పెర్త్‌లో ప్రారంభమయ్యింది. ఇక వరణ్ ఘోష్ మాట్లాడుతూ..తాను మంచి విద్యను అభ్యసించడం వల్లే అధికారాన్ని పొందగలిగాను కాబట్టి నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని గట్టిగా విశ్వసిస్తాను అని చెప్పారు. కాగా, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయబోతున్న సెనెటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ సెనేటర్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయసులోనే వరుణ్ ఘోష్ లేబర్ పార్టీలో చేరారు. భారతీయ – ఆస్ట్రేలియన్ బారిస్టర్ అయిన ఘోష్ గతవారం లేబర్ పార్టీ అధికారికంగా కీలక పాత్రకు ఎంపిక చేసింది. #VarunGhosh on Tuesday became the first ever India-born member of the Australian Parliament to take oath on #Bhagavadgita. Varun Ghosh from Western Australia has been appointed as the newest Senator after the Legislative Assembly and the Legislative Council chose him to represent… pic.twitter.com/KzIhIYSZC0 — DD India (@DDIndialive) February 6, 2024 (చదవండి: 'ఉక్కు మనిషి' సర్దార్ అని ఎందుకు అంటారంటే..?) -
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్‌కతా: దాదాపు 1,20,000 మందితో కోల్‌కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 'భగవద్గీత పారాయణం
-
‘గీతా’ సంకల్పం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సంకల్పం ఉంటే..సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఎన్ని అవాంతరాలు..ఎన్ని అడ్డుంకులు ఎదురైనా సరే ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రతి ఇంటా భగవద్గీత ఉండాలన్నదే లక్ష్యంగా నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేందర్‌గుప్తా సంకల్పించారు. ఐదేళ్లుగా ఉచితంగా భగవద్గీత గ్రంథాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,618 భగవద్గీత గ్రంథాలను అందజేశారు. తన తుదిశ్వాస ఉన్నంతవరకు భగవద్గీత గ్రంథాలు పంచుతూనే ఉంటానని జ్ఞానేందర్‌గుప్తా చెబుతున్నారు. పదకొండేళ్లుగా తన తండ్రి మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీం, హైకోర్టుల న్యాయమూర్తులు, వైద్యులు, వ్యాపారులు మొదలు... సాధారణ వ్యక్తులు వరకు భగవద్గీత చేరేలా నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు. భగవద్గీతతోపాటు రామకోటి పుస్తకాలు కూడా పంచుతున్నారు. పదుల సంఖ్యలో రామాయణం, మహాభారతం, భాగవతం పుస్తకాలు పంపిణీ చేశారు. 4 భాషల్లో ‘గీతా జయంతి’పేరిట ప్రపంచంలో పుట్టినరోజు జరుపుకునే ఒకే ఒక్క గ్రంథం ‘భగవద్గీత’. ఈ గ్రంథానికి ఉన్న గుర్తింపు ప్రపంచంలో ఏ గ్రంథానికీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు, అత్యున్నతస్థాయి వ్యక్తులు భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినవారే. జ్ఞానేందర్‌గుప్తా గోరఖ్‌పూర్‌లోని గీతాప్రెస్ నుంచి ఆర్డర్‌పై భగవద్గీత గ్రంథాలు తెప్పిస్తున్నారు. ఈ గ్రంథం 880 పేజీల్లో 18 అధ్యాయాలు, 745 శ్లోకాలతో సవివరంగా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, మరాఠీ భాషల్లో ముద్రించిన గ్రంథాలను పంపిణీ చేస్తున్నారు. గీతాసారం అన్ని భాషల్లో ఉన్న వారికి అర్థమయ్యేలా చేర్చాలన్న సంకల్పంతో ఇలా చేస్తున్నారు. ఇటీవల దక్షిణకొరియా ఒకరు అడగ్గా కొరియర్లో భగవద్గీత పంపాడు, యూఎస్‌కు అయితే రెగ్యులర్‌గా ఆయనే కొరియర్ ద్వారా చేరవేస్తున్నారు. మరికొన్ని సేవా కార్యక్రమాల్లో... నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సొంతూరైన సిరిసిల్ల జిల్లా కనగర్తిలలో స్వర్గ రథాలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రెండునెలల్లో కాశీలోనూ స్వర్గరథం ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిజామాబాద్‌లో మృతదేహాలను పెట్టేందుకు 8 ఏళ్ల నుంచి 10 ఫ్రీజర్లు ఉచితంగా అందుబాటులో ఉంచారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ‘అమర్నాథ్ అన్నదాన సేవాసమితి, సిద్దిపేట ట్రస్ట్ ఆధ్వర్యంలో 2011 ప్రతి ఏటా 60 రోజులు అన్నదానం, ఇతర సేవలు అందజేస్తున్నారు. ఎండాకాలంలో పిచ్చుకలు, పక్షులు నీటికోసం అలమటిస్తాయి. వాటి దాహార్తి తీర్చేందుకు రెండేళ్లలో 2,500 పైగా ‘బర్డ్ ఫీడర్ బాక్సులు’ఉచితంగా అందజేశారు. -
సంతృప్తిని మించిన సంపద లేదు
-
ఆ విషయం శ్రీ కృష్ణుడితో చెప్పకపోవడం వల్ల...!
-
యదు వంశపు చరిత్ర
-
శ్రీ కృష్ణుని భార్యలు చేసిన పుణ్యం
-
గోపికలు పరమాత్ముడి యొక్క భుజాలు చూసి ఆనందపడేవారు
-
ఆత్మఘాతకులు అంటే వాళ్ళే
-
వాళ్ళే స్థూల ద్రుష్టి కలవారు
-
శృతి గీత అంటే ఇదే
-
దుఃఖం నుంచి బయటకు రావాలి
-
అందుకే కృష్ణుడు సర్వాంతర్యామి అయ్యాడు
-
పాండవులందరూ అందుకే సంతోషించారు
-
శ్రీకృష్ణుడు కీర్తి అమృతమైంది ఎందుకంటే ?
-
సైన్స్ యే పరమాత్మా..!
-
ఇంద్రియ భోగములు అంటే ఏంటి..?
-
శ్రీకృష్ణుడు దర్శనమే...గొప్ప లాభాన్ని చేకూరుతుంది అన్నాడు
-
భగవద్గీత పరాయణంతో పులకించిన డాలస్
-
దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!
భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్(ఒడిషా)లో జరిగింది. భువనేశ్వర్‌లోని గోపీనాథ్‌పూర్ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి. చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు. Video Source: OTV News English -
గురువాణి: యువత భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలి
మహాభారతం పంచమవేదంగా చెప్పబడుతోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతలోని సారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత భగవద్గీత చదివి సారాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ముందుకెళ్లాలి. గీతాసారాన్ని తెలుసుకుంటే మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు తిరుగులేని కచ్చితత్వంతో ఉంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే సారం గీతలో ఉంది. దత్తాత్రేయుడిగా గురువు అవతారమెత్తిన మహావిష్ణువు కృతయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి మానవాళికి మార్గదర్శకులయ్యారు. వీరి అవతారాలకు భారతదేశం వేదిక కావడం అదృష్టం. దీంతో ప్రపంచ దేశాలకు భారతదేశం ఎనలేని విజ్ఞానాన్ని అందించినట్లైంది. భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలోని అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటూ వస్తోంది. ఇతర దేశాలతో ప్రేమపూర్వకంగా ఉంటూ వస్తున్న భారతదేశ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలి. దీంతో యువతలో సానుకూల దృక్పథం కలుగుతుంది. అనేక దేశాల అభివృద్ధిలో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్న భారత యువత అక్కడ భారత సంస్కృతి, సాంప్రదాయాల గురించి గర్వంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రకృతి, పంచభూతాలను ఎవరు నడిపిస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలి. దీంతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది. పరమాత్మను పరిపూర్ణంగా శరణు వేడడమే అన్నింటికీ పరిష్కార మార్గం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది. భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారం ్ర΄ారంభం నుంచి ముగింపు వరకు ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా కష్టాలు అనుభవిస్తూ ధర్మమార్గంలో ఎలా నడవాలో చూపించిన పరమాత్మ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడో భాగవతం చదివితే తెలుస్తుంది. చిన్నతనం నుంచే భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం గురించి తెలుసుకుంటే యువత తిరుగులేని సానుకూల దృక్పధాన్ని సాధిస్తుంది. – తూమాటి భద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్