Billings
-
ఫేక్ బిల్లింగ్ స్కాం : భారీ నగదు, నగలు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ : కోట్ల రూపాయల విలువైన నకిలీ బిల్లింగ్ రాకెట్‌ను ఆదాయపు పన్ను శాఖ ఛేదించింది. ఈ మేరకు ఆదాయ పన్నుశాఖ సోమవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, గోవా, హర్యానా, పంజాబ్ తదితర 42 ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నగదు, విలువైన ఆభరణాలను సీజ్ చేశారు. నకిలీ కంపెనీల ద్వారా ఈ నగదును దారి మళ్లిస్తున్నట్టు తేలిందని వెల్లడించారు. నకిలీ బిల్లింగ్ రాకెట్లో 500 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని ప్రత్యక్ష పన్నుల బోర్డు ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్) ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎంట్రీలతోపాటు, ఇతర ఆధారాలున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అక్రమాలకు పాల్పడుతున్న ఎంట్రీ ఆపరేటర్లు, మధ్యవర్తులు, నగదు నిర్వహణదారులు, లబ్ధిదారులతో కూడిన నెట్‌వర్క్‌ను గుర్తించినట్టు సీబీడీటీ అధికారులు తెలిపారు. తాజా దాడుల్లో రూ .2.37 కోట్ల నగదు, 2.89 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతోపాటు 17 బ్యాంక్ లాకర్లను కూగా గుర్తించినట్టు చెప్పారు. బీరువాల్లోదాచి పెట్టిన కట్టల కొద్దీ నగదును అధికారులు స్వాధీనం చేసుకోగా ఇందులో ఒక కట్టలో 180 బండిల్స్, 9 కోట్లు అని రాసి ఉండటం గమనార్హం. కాగా బ్యాంకు అధికారులతో కుమ్మక్కై, షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, ఇందులో తమ వ్యక్తిగత సిబ్బందినే భాగస్వాములుగా, డమ్మీ డైరెక్టర్లుగా నియమించుకుని అక్రమాలకు తెరతీసారని తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. -
ద్రవిడ్ శిక్షణలో రాటుదేలుతా: బిల్లింగ్స్
పుణే: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో తన బ్యాటింగ్ మరింత మెరుగవుతుందని ఇంగ్లండ్ కీపర్, బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. గత సీజన్ నుంచి బిల్లింగ్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్లో ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకున్నానన్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం, ఒత్తిడిలో ఆడటం మెరుగైనట్లు బిల్లింగ్స్ పేర్కొన్నాడు. ఢిల్లీ మెంటర్ రాహుల్ ద్రవిడ్, కోచ్ ప్యాడి ఆప్టన్ నేతృత్వంలో ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు బిల్లింగ్స్ తెలిపాడు. వారిచ్చే సూచనలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నాడు. వారి అనుభవాలు పంచుకోవడం, సలహాలు ఇవ్వడంతో బ్యాటింగ్‌లో రాటుదేలుతానని బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ మంచి నైపుణ్య ఆటగాళ్లు ఉన్న జట్టు అని , కానీ తొలి మ్యాచ్ బెంగళూరుపై ఓడిపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది మాకు నిజంగా ఊహించలేని ఫలితమని, జరగబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించమని బిల్లింగ్స్ తెలిపాడు. ఐపీఎల్లో ప్రతి జట్టు బలమైనదే అని, ప్రతి జట్టులో హిట్టర్లు, స్పిన్నర్లున్నారని చెప్పాడు. కాకపోతే వారి బలాలను ప్రదర్శించినపుడే ఫలితం ఉంటందన్నాడు. ఢిల్లీలో కేవలం పేస్ బౌలింగ్ కాకుండా మంచి స్పిన్నర్లు జయంత్ యాదవ్, నదీమ్‌లు ఉన్నారని బిల్లింగ్స్ వ్యాఖ్యానించాడు.