birth centenary celebrations
-
గ్రేటెస్ట్ షో మేన్‌కి గ్రాండ్ షో
భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచడంలో కృషి చేసిన ఎందరో సినీ ప్రముఖుల్లో నటుడు–దర్శక–నిర్మాత రాజ్‌కపూర్ ఒకరు. రాజ్ సాహెబ్, ది షో మేన్ ది గ్రేటెస్ట్ షో మేన్ ఆఫ్ ఇండియన్ సినిమా, చార్లీ చాప్లిన్ ఆఫ్ ఇండియన్ సినిమా... ఇలా రాజ్‌కుమార్‌ను ఆయన ఫ్యాన్స్, సన్నిహితులు, ప్రేక్షకులు పిలుచుకునేవారు. రాజ్ కపూర్ చేసిన ఎన్నో అద్భుత చిత్రాలు ఆయన్ను ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి. కాగా ఈ నెల 14న రాజ్‌కపూర్ శత జయంతి. ఈ సందర్భంగా డిసెంబరు 13 నుంచి 15 వరకు రాజ్‌కుమార్ ఐకానిక్ సినిమాలను దేశంలోని 40 నగరాల్లో దాదాపు 150 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ పేరిట ‘ఆర్కే ఫిలిమ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా’ల నేతృత్వంలో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుంది. రాజ్‌కపూర్ కెరీర్‌లోని ఐకానిక్ ఫిల్మ్స్ ‘ఆగ్ (1948), బర్సాత్ (1949), ఆవారా (1951), శ్రీ 420 (1955), జాగ్తే రహో (1956), జిష్ దేశ్ మే గంగా బహ్తీ హై (1960), సంగం (1964), మేరే నామ్ జోకర్ (1970), బాబీ (1973), రామ్ తేరీ గంగా మైలీ (1985)’ వంటి సినిమాలు ‘రాజ్‌కపూర్ – 100 సెలబ్రేటింగ్ ది సెంచరీ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో మేన్’ వేడుకల్లో ప్రదర్శితం కానున్నాయి. పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్ సినిమాస్‌లో ఈ సినిమాల ప్రదర్శన ఉంటుందని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాల టికెట్ ధర వంద రూపాయలుగా నిర్ణయించారు. భారతీయ సినిమా దార్శనికుడు‘‘రాజ్‌కపూర్ భారతీయ సినీ తెరకు భావోద్వేగాలు అద్దిన దార్శనికుడు. ఆయన విజన్‌కు ఈ ఫెస్టివల్ ఓ నివాళి’’ అన్నారు రణ్‌ధీర్ కపూర్ (రాజ్‌కపూర్ తనయుడు). ‘‘రాజ్ కపూర్ సినిమాలు మాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి’’ అన్నారు రణ్‌బీర్ కపూర్ (రాజ్‌కపూర్ మనవడు).అవిభక్త భారతదేశంలోని పెషావర్‌లో పృథ్వీ రాజ్‌కపూర్, రామ్ సర్నీదేవి దంపతులకు డిసెంబరు 14, 1924లో జన్మించారు రాజ్‌కపూర్ (అసలు పేరు సృష్టినాథ్ కపూర్). యాక్టర్‌గా పృథ్వీరాజ్ కపూర్ కెరీర్‌ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఆయన పలు ప్రాంతాలకు మకాం మార్చాల్సి వచ్చింది. ఇలా రాజ్ కపూర్ చదువు వివిధ స్కూల్స్‌లో జరిగింది. ఇక తన తండ్రి ఓ లీడ్ రోల్లో నటించిన ‘ఇన్క్విలాబ్’ (1935) చిత్రంతో బాల నటుడిగా పదేళ్ల వయసులో తెరపైకి వచ్చారు రాజ్ కపూర్. ‘నీల్ కమల్’ (1947) మూవీతో లీడ్ యాక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత హీరోగా ‘బర్సాత్’తో తొలి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో రాజ్‌కపూర్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఇక 1951లో విడుదలైన ‘అవారా’ చిత్రం రాజ్ కపూర్ కేరీర్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాకు విదేశీ ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందంటే ఆయన కెరీర్ ఈ టైమ్‌లో ఎంతటి పీక్ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నాటి తరంలో ఇండియన్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వారిలో రాజ్ కపూర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన స్టార్డమ్ కొనసాగేలా ‘శ్రీ 420, సంగం’ వంటి సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక రాజ్‌కపూర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేరా నామ్ జోకర్’ చిత్రం ఆయన్ను నిరాశకు గురిచేసింది. ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. నాలుగు గంటల నిడివితో రెండు ఇంట్రవెల్స్తో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే సినిమాకు కాలక్రమేణా కల్ట్ మూవీ స్టేటస్ దక్కడం విశేషం. ఇక 1948లో ఆర్కే స్టూడియో సంస్థను స్థాపించి, సినిమాలు నిర్మించారు రాజ్ కపూర్. తన కుమారుడు రిషి కపూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బాబీ’ సినిమా 1973లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్శకుడిగానూ రాజ్ కపూర్ సూపర్‌హిట్. ‘బర్సాత్, ఆవారా, శ్రీ 420, సంగం, మేరా నామ్ జోకర్’ వంటి చిత్రాలు అందుకు ఓ నిదర్శనం. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఇంకా జాతీయ అవార్డులతో పాటు పలు అవార్డులు అందుకున్నారు రాజ్ కపూర్. ఈ గ్రేట్ షో మేన్ 1988 జూన్ 2న ఢిల్లీలో కన్నుమూశారు. -
భారత్‌కు కాళీమాత అపార ఆశీస్సులు
కోల్‌కతా: భారత్‌కు కాళీమాత అపరిమిత ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’కు స్వామీజీలు, సాధువులు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తున్నారని కొనియాడారు. రామకృష్ణ మిషన్ సైతం ఆ దిశగా పనిచేస్తోందని అన్నారు. రామకృష్ణ మిషన్ మాజీ అధినేత స్వామీ ఆత్మస్థానందా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మోదీ ఆదివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. మన నమ్మకం పవ్రిత్రమైనది అయినప్పుడు కాళీమాత మనకు మార్గదర్శనం చేస్తుందని అన్నారు. ప్రపంచ సంక్షేమం అనే స్ఫూర్తితో ఆధ్యాత్మిక శక్తి సహకారంతో భారత్ ముందడుగు వేస్తోందని మోదీ పేర్కొన్నారు. ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి కాళీమాతను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్వామీ ఆత్మస్థానందకు మోదీ నివాళులర్పించారు. ఫొటో బయోగ్రఫీ, డాక్యుమెంటరీని విడుదల చేశారు. మరోవైపు, రైతులంతా సహజ సాగు పద్ధతుల వైపు మళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఇదొక సామూహిక ఉద్యమంగా మారి, విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రకృతి వ్యవసాయంపై ఆదివారం జరిగిన సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రకృతి సేద్యం చేయడం భూమాతకు సేవ చేయడమే అవుతుందన్నారు. ఆర్థిక ప్రగతికి ప్రకృతి సేద్యమే ఆధారమని స్పష్టం చేశారు. గోమాతను సేవించుకొనే అవకాశం లక్ష్యాన్ని సాధించాలన్న గట్టి పట్టుదల ఉంటే అడ్డంకులు ఏమీ చేయలేవని మోదీ వివరించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే పెద్ద లక్ష్యమైన సాధించడం సులువేనని అన్నారు. ప్రకృతి సేద్యం విషయంలో అంతర్జాతీయంగా అందుబాటులోకి వస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. మన అన్నదాతల సౌభాగ్యానికి, మన వ్యవసాయ రంగం అభివృద్ధికి, మన దేశ ప్రగతికి ప్రకృతి వ్యవసాయం ఒక చుక్కాని కావాలని ఆకాంక్షించారు. సహజ సాగు పద్ధతులతో నేల తల్లిని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, గోమాతను సేవించుకొనే అవకాశం లభిస్తుందని తెలిపారు. రసాయనాలకు తావులేని వ్యవసాయం ద్వారా ప్రాణాంతక రోగాల బారి నుంచి మనుషులను రక్షించుకోవచ్చని వివరించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ‘పరంపరాగత్ కృషి వికాస్ పథకం’ ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30,000 క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. -
ఘన నివాళి
► ఎంజీఆర్ శత జయంతి వేడుకలు ►ఎంజీఆర్ నివాసంలో విగ్రహావిష్కరణ ►ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల ► ప్రసంగాల జోలికి వెళ్లని సీఎం పన్నీర్, శశికళ అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే పాలనలో ఎంజీఆర్ శతజయంతి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధికార లాంఛనాలతో అట్టహాసంగా నిర్వహించారు. ఎంజీఆర్ శత జయంతి వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నైః చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకకు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ హాజరయ్యారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ఎంజీఆర్ శత జయంతి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఎంజీఆర్ ప్రత్యేక తపాలా బిళ్లను సీఎం పన్నీర్‌సెల్వం ఆమెకు అందజేశారు. పది నిమిషాలపాటూ పార్టీ కార్యాలయంలో గడిపిన శశికళ అక్కడి నుంచి ఎంజీఆర్ నివాసం రామాపురంతోటకు వెళ్లి అక్కడ కొత్తగా నెలకొల్పిన ఎంజీఆర్ విగ్రహాన్ని, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రసంగాలు లేని శత జయంతి తమిళనాడు సినీ, రాజకీయాల్లో ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎంజీ రామచంద్రన్ ను కీర్తిస్తూ కనీస ప్రసంగాలు లేకుండానే మంగళవారం నాటి కార్యక్రమాలను ముగించారు. ఎంజీఆర్ ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించే కార్యక్రమం చెన్నై గిండిలోని డాక్టర్ ఎంజీఆర్ వైద్య వర్సిటీలో జరిగింది. సీఎం పన్నీర్‌సెల్వం ముఖ్యఅతి«థిగా హాజరై అక్కడి ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ప్రత్యేక తపాలా బిళ్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తపాలాశాఖ సంచాలకులు డి. మూర్తి తపాలా బిళ్లను ఆవిష్కరించగా ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అందుకున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా ఎంజీఆర్ జీవిత పయనం, రాజకీయ విజయాలపై సీఎం పన్నీర్‌సెల్వం ప్రసంగిస్తారని ఆహూతులంతా ఆశించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తపాలా బిళ్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని 15 నిమిషాల్లోనే ముగించుకుని నిష్క్రమించడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి శశికళ ఎంజీఆర్ణు ఉద్దేశించి ప్రసంగిస్తున్నారని, ఆమె ప్రసంగమే హైలైట్ కావాలన్న ఉద్దేశంతో సీఎం ప్రసంగంపై నిషే««దlం విధించారని అన్నాడీఎంకే శ్రేణులు గుసగుసలాడుకున్నారు. ఇదిలా ఉండగా, పార్టీ ప్రధాన కార్యాలయంలో శశికళ సైతం ఎంజీఆర్ గురించి నాలుగు మాటలు కూడా మాట్లాడకుండానే కేవలం పదినిమిషాల్లో వెళ్లిపోయారు. సత్యమూర్తి భవన్ లో తమిళనాడు కాంగ్రెస్ కమిటి రాష్ట్ర కార్యాలయమైన సత్యమూర్తి భవన్ లో సైతం ఎంజీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించడం విశేషంగా మారింది. టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తమ కార్యాలయంలో ఎంజీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంజీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ ప్రజలకు, అన్నాడీఎంకేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీఆర్ చదువుకున్న తంజావూరు జిల్లా కుంభకోణంలోని పాఠశాలలో సైతం శతజయంతి జరిపారు. ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం పొన్నేరిలో కట్టిన బ్యానర్లోని శశికళ బొమ్మను కొందరు చించివేశారు. దీంతో పోలీసులు హడావిడిగా అక్కడికి చేరుకుని అగంతకులను గుర్తించే ప్రయత్నం చేసినా వారు దొరకలేదు. కొత్త పార్టీ ఆవిర్భావం అన్నా ఎంజీఆర్ ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో చెన్నైలో మంగళవారం కొత్త పార్టీ వెలిసింది. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేను సరైన దిశలో నడిపించే నాయకత్వం లేకపోవడంతో ఎంజీఆర్ శత జయంతి రోజున ఈ పార్టీని స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షులు మురుగన్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తంగమారియప్పన్, కోశాధికారిగా కరుణానిధి అనే వ్యక్తులను నియమించినట్లు ఆయన చెప్పారు. -
14న కొవ్వలి శతజయంతి వేడుకలు
కిన్నెర ఆర్ట్స్ థియేటర్‌తో కలసి సాహిత్య అకాడమీ సుప్రసిద్ధ నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు శతజయంతి వేడుకలను నిర్వహిస్తోంది. రవీంద్రభారతి మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ నెల 14న ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకుడు ఎన్.గోపి సభాధ్యక్షత వహిస్తారు. ‘నవ్య’ వారపత్రిక సంపాదకుడు ఎ.ఎన్.జగన్నాథ శర్మ గౌరవ అతిథిగా, కొవ్వలి లక్ష్మీనరసింహారావు కుమారుడు కొవ్వలి లక్ష్మీనారాయణ ఆత్మీయ అతిథిగా హాజరవుతారు. సాహితీవేత్త ద్వా.నా.శాస్త్రి కీలకోపన్యాసం చేస్తారు. ఈ సందర్భంగా కొవ్వలి రచనలపై మూడు సదస్సులను కూడా నిర్వహించనున్నారు. ఇదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌తో ‘కథాసంధి’ కార్యక్రమం జరుగుతుంది. -
'కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేను'
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బాధించిందని మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఎం సత్యనారయణ రావు (ఎమ్మెస్సార్) అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి జీవీ నర్సింగరావు శత జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెస్సార్, పీసీసీ చీఫ్ పొన్నాల, ఎంపీ పాల్వాయి, నర్సారెడ్డితో పాటు జీవీ నర్సింగరావు కుమారుడు రూపేందర్ రావు పాల్గొన్నారు. జీవీ నర్సింగరావు సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలే అయింది. అప్పడే కేసీఆర్ పాలనపై కామెంట్ చేయలేనని అన్నారు. పారిశ్రామిక విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రూపేందర్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాతే స్పందిస్తానని ఆయన చెప్పారు.