14న కొవ్వలి శతజయంతి వేడుకలు | on 15th kovvali Birth Centenary Celebrations | Sakshi
Sakshi News home page

14న కొవ్వలి శతజయంతి వేడుకలు

Published Thu, Dec 11 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

14న కొవ్వలి శతజయంతి వేడుకలు

14న కొవ్వలి శతజయంతి వేడుకలు

కిన్నెర ఆర్ట్స్ థియేటర్‌తో కలసి సాహిత్య అకాడమీ సుప్రసిద్ధ నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు శతజయంతి వేడుకలను నిర్వహిస్తోంది. రవీంద్రభారతి మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ నెల 14న ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకుడు ఎన్.గోపి సభాధ్యక్షత వహిస్తారు.

‘నవ్య’ వారపత్రిక సంపాదకుడు ఎ.ఎన్.జగన్నాథ శర్మ గౌరవ అతిథిగా, కొవ్వలి లక్ష్మీనరసింహారావు కుమారుడు కొవ్వలి లక్ష్మీనారాయణ ఆత్మీయ అతిథిగా హాజరవుతారు. సాహితీవేత్త ద్వా.నా.శాస్త్రి కీలకోపన్యాసం చేస్తారు. ఈ సందర్భంగా కొవ్వలి రచనలపై మూడు సదస్సులను కూడా నిర్వహించనున్నారు. ఇదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌తో ‘కథాసంధి’ కార్యక్రమం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement