cards gambling
-
గుట్టుచప్పుడు కాకుండా తప్పించారు
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కొందరు పోలీసులు అక్రమార్కులకు అండగా నిలిస్తున్నారు. తప్పు సొంతవారు చేస్తే వదిలేయడం..సామాన్యులు చేస్తే రూల్స్ మాట్లాడడం పరిపాటిగా మారింది. ఇటీవల వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తూ పట్టుబడిన ఓ కానిస్టేబుల్‌కు వన్‌టౌన్ పోలీసులు అండగా నిలిచారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ సత్యయేసు బాబు దీనిపై విచారణ చేపడితే అసలు బాగోతం వెలుగు చూస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. (పోలీస్ స్టేషన్లోనే మద్యం తాగిన కానిస్టేబుళ్లు) ఇదీ సంగతి: గత నెలలో వన్‌టౌన్ పరిధిలోని లెనిన్‌నగర్‌లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. ఓ ఎస్ఐ నేతృత్వంలో పేకాట నిర్వహిస్తున్న ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఆరుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. పేకాట నిర్వహిస్తున్న వ్యక్తి ఓ కానిస్టేబుల్ అని తెలిసింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా కానిస్టేబుల్‌ను తప్పించేశారు. కేవలం ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.55 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఎస్ఐ అండదండలతోనే కానిస్టేబుల్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో భారీగానే చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : తంగెళ్ళమూడి పంట కాలువ సమీపంలో పేకాట యథేచ్చగా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 29060 నగదుతో పాటు 3 సెల్ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. డీఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్సై రామారావు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
ఎల్బీనగర్లో 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా నడుపుతున్నారు. తాజాగా ఎల్బీనగర్లో ఓ హెటల్పై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 3.75లక్షల రూపాయల విలువ చేసే కారు, ఐదు బైక్‌లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.