Chief Justice G Rohini
-
వాట్సాప్‌కు ఎదురుదెబ్బ
ప్రముఖ మెసేజింగ్ సర్వీసు యాప్ వాట్సాప్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందటి ప్రైవసీ పాలసీ ఆధారంగా 2016 సెప్టెంబర్ 25వరకు సేకరించిన యూజర్ల సమాచారాన్ని ఫేస్బుక్ లేదా మరే ఇతర కంపెనీకి షేరు చేయడానికి వీలులేదని హైకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ జీ రోహిణి నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చాక వాట్సాప్‌ను వాడకూడదని నిర్ణయించుకున్న యూజర్ల డేటాను పూర్తిగా డిలీట్ చేయాలని కూడా ఆదేశించింది.యూజర్లు కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చుకోవడానికి వాట్సాప్ 30 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గడువు సెప్టెంబర్ 25తో ముగియనుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీ విధానం ద్వారా యూజర్ల సమాచారాన్ని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ షేరు చేయనుంది. ఫేస్‌బుక్‌తో తమ సమాచారాన్ని షేరు చేసుకోవడానికి ఇష్టపడని వారు అకౌంట్ డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నట్టు బెంచ్ సభ్యులు జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్ తెలిపారు. అదేవిధంగా వాట్సాప్ లాంటి ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులను చట్టబద్ధమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వాట్సాప్ డేటా షేరింగ్‌ను సవాలు చేస్తూ ఇద్దరు విద్యార్థులు కర్మాన్య సింగ్ సరీన్, శ్రేయ సేతీలు ఢిల్లీ హైకోర్టు గడపతొక్కారు. విద్యార్థుల ఫిర్యాదుపై విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. విద్యార్థుల తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రతిభా ఎమ్ సింగ్ వాదనలు వినిపించారు. -
'అలా చేయకుంటే న్యాయ వ్యవస్థ కుంటుపడుద్ది'
న్యూఢిల్లీ: న్యాయసంబంధమైన సంస్థలకు భారీ మొత్తంలో న్యాయ కోవిదులు అవసరం అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ న్యాయ సంస్థలకు, న్యాయ వ్యవస్థకు స్వచ్ఛమైన, మంచి మేథావులు అవసరం అని, న్యాయవాద వృత్తిలో కొనసాగేందుకు మరింత యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరారు. ఆధునిక సమాజానికి తగినట్లుగా పనిచేసే యువత న్యాయవ్యవస్థకు చాలా అవసరం అని తెలిపారు. ప్రస్తుత తరుణంలో న్యాయపరమైన అవసరాలకు తగినట్లుగా సాంప్రదాయబద్ధమైన మేథస్సుగల వారు సేవలు అందించలేకపోతున్నారని చెప్పారు. కేవలం న్యాయ వ్యవస్థవైపు రావడంతోనే ఆగిపోకుండా ఉన్నత న్యాయస్థానం బెంచ్‌లకు చేరుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అంకితభావంతో, కచ్చితత్వంతో కృషి చేసినప్పుడు మాత్రమే అధిసాధ్యం అవుతుందని చెప్పారు. ఒక వేళ అలా చేయలేకపోతే మొత్తం న్యాయవ్యవస్థే కుంటుపడే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీ రోహిణి కూడా హాజరయ్యారు.