‘సాక్షి స్పెల్‌బీ’ తెలంగాణ విజేతలు వీరే
♦ నాలుగు కేటగిరీల్లో విజేతలకు బహుమతులు
♦ తెలంగాణ చాంప్ చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్
♦ విజ్ఞాన్ వర్సిటీ సహకారంతో ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ-2015’
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ-2015’ తెలంగాణ ఫైనల్ పోటీల విజేతలను ఆదివారం ప్రకటించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారంతో ఈ పోటీలను సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ చాంపియన్ స్కూల్‌గా కొండాపూర్ చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ నిలిచింది. ఇక నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన స్పెల్‌బీ ఫైనల్స్ విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. స్వర్ణ పతకం విజేతకు రూ.25 వేలు, రజత పతక విజేతకు రూ.15 వేలు, కాంస్య పతక విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందజేశారు. ప్రతి కేటగిరీ నుంచి 20 మంది పోటీ పడ్డారు.
తొలి మూడు స్థానాలు దక్కించు కున్న వారికి వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్ డెరైక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాణిరెడ్డి, గుంటూరు విజ్ఞాన్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యుడు కృష్ణా లావు, ‘సాక్షి’ దినపత్రిక జీఎం (అడ్వర్టైజ్మెంట్) రమణకుమార్ విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.
కేటగిరీ 1 విజేతలు..
స్వర్ణ పతకం: శ్రేయస్‌రెడ్డి ముప్పన, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బంజారాహిల్స్ హైదరాబాద్
రజత పతకం: ఆరిష్ యేలూరి, శ్రీఅరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్
కాంస్య పతకం: మయుక్ జయసింహ, గీతాం జలి దేవ్‌శాల, బాలంరాయ్, హైదరాబాద్
కేటగిరీ 2 విజేతలు..
స్వర్ణ పతకం: డి.వెగా, అగాఖాన్ అకాడమీస్, హైదరాబాద్
రజత పతకం: పహి శ్రీవాస్తవ, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్
కాంస్య పతకం: అరిత్రో రాయ్, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్
కేటగిరీ 3 విజేతలు..
స్వర్ణ పతకం: ఇషా సంతోష్, చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్
రజత పతకం: సిద్ధార్థ్ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్
కాంస్య పతకం: వందనా వారియర్, భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్
కేటగిరీ 4 విజేతలు..
స్వర్ణ పతకం: సర్వజ్ఞ పొట్టూరి, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్
రజత పతకం: మాథ్యూ పీటర్ థారప్పీల్, వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్, బాచుపల్లి, హైదరాబాద్
కాంస్య పతకం: ఆకాశ్ సింగిరికొండ, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్