congratulation
-
'సైనా విజయం చిరస్మరణీయం'
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం గెలిచిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ తో సైనా చిరస్మరణీయ విజయం సాధించిందని మోదీ కొనియాడారు. ఆమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు. మలేసియాలో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సైనా నెహ్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో ఓడిపోయి సిల్వర్ పతకంతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ లో ఫైనల్ కు చేరి భారత తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా ఆమె ఖ్యాతి దక్కించుకుంది. -
మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, మహిళా అథ్లెట్లకు ప్రధాని నరేంద్రమోడీ అభినందన తెలిపారు. దేశ ప్రతిష్టను భారత క్రీడాకారులు మరింత పెంచారని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత దేశానికి స్పూర్తి నిచ్చిన రోజు అని వ్యాఖ్యానించారు. 4x400 మీటర్ల రిలే విభాగంలో భారత మహిళా అథ్లెట్లు బంగారు పతకం సాధించడంపై మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. 16 ఏళ్ల తర్వాత భారత జట్టు బంగారు పతకం సాధించి.. 2016 లో రియోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత హాకీ జట్టు అర్హత సాధించింది.