మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన | Narendra Modi congratulates Indian hockey team, women athletes | Sakshi
Sakshi News home page

మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన

Published Thu, Oct 2 2014 8:20 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన - Sakshi

మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, మహిళా అథ్లెట్లకు ప్రధాని నరేంద్రమోడీ అభినందన తెలిపారు. దేశ ప్రతిష్టను భారత క్రీడాకారులు మరింత పెంచారని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత దేశానికి స్పూర్తి నిచ్చిన రోజు అని వ్యాఖ్యానించారు. 
 
4x400 మీటర్ల రిలే విభాగంలో భారత మహిళా అథ్లెట్లు బంగారు పతకం సాధించడంపై మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. 
 
16 ఏళ్ల తర్వాత భారత జట్టు బంగారు పతకం సాధించి.. 2016 లో రియోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత హాకీ జట్టు అర్హత సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement