contracters
-
గుండెపోటుతో మున్సిపల్ సీనియర్ కాంట్రాక్టర్ మృతి
జ్యోతినగర్: గుండెపోటుతో మున్సిపల్ సీనియర్ కాంట్రాక్టర్ గడ్డం(సుందిల్ల) నారాయణగౌడ్(59) బుధవారం మృతిచెందాడు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న రామగుండం మున్సిపల్ సీని యర్ కాంట్రాక్టర్ నారాయణగౌడ్ ఉదయం అస్వస్థతకు గురి కాగా.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందించే లోపు మృతిచెందాడు. మృతుడికి భార్య విజయతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. పలువురు కాంట్రాక్టర్లు, గౌడ సంఘం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తే టీడీపీకి ఎందుకు బాధ?
సాక్షి, ప్రకాశం: గతంలో చేపట్టిన కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంటే టీడీపీ వాళ్లు ఎందుకు అంతలా బాధపడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. కాంట్రాక్టులలో తప్పు జరిగినప్పుడు వాటిని రద్దు చేయడంలో తప్పు లేదని, తప్పు జరగకుండా కావాలని రద్దు చేస్తే తప్పన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు కాంట్రాక్టర్లని టీడీపీ ఎందుకు వెనకేసుకొస్తోందని నిలదీశారు. టీడీపీ ఏమైనా కాంట్రాక్టర్ల పార్టీనా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని పట్టించుకోలేదనీ, ఎన్నికల పేరుతో శంకుస్థాపనలంటూ హడావుడి చేసిందనీ విమర్శించారు. రామాయపట్నం పోర్టు విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాయకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యతో పాటు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అయినా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానన్నారు. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులకు ఆమోదం తెలిపిందని, ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. -
నత్తనడకన ‘‘డబుల్ ఇళ్ల’’ నిర్మాణం
సాక్షి, మోతె(నల్గొండ) : మండలంలో మోతె, అప్పన్నగూడెం, విభళాపురం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు నిర్మించి ఇవ్వనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు. అంతేకాకుండా పనుల్లో నాణ్యత లోపిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో సిమెంట్ తక్కువగా ఉండి కంకర, ఇసుక ఎక్కువగా కలిపి నాసిరకంగా నిర్మిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. సొంతింటి కల నెరవేరేనా అని పేదలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని అప్పన్నగూడెంలో గ్రామానికి ఊరుబయట 40 ఇళ్లు నిర్మిస్తున్నారు. పనులు మొదలు పెట్టి ఏడాది గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. గ్రామంలో సుమారుగా 50 మందికి పైగా పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. అధికారులు స్పందించాలి. నాణ్యతగా నిర్మించాలి మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో కాంట్రాక్లర్లు నాణ్యత పాటించాలి. ప్ర భుత్వం నిబంధనల ప్ర కారం కాంట్రాక్లర్లు వ్యవహరించాలి. పిల్లర్ స్థా యిలో వాటర్ క్యూరింగ్ చేయాలి. పనులు స కాలంలో పూర్తి చేయాలి. – లచ్చుమళ్ల అనిల్, మోతె త్వరితగతిన పూర్తి చేయిస్తాం మండలంలో మోతె, విభళాపురం, అప్పన్నగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న 170 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తి కావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఇళ్లు నిర్మిస్తున్న గ్రామాలను విజిట్ చేస్తున్నాం. త్వరలోనే నిర్మాణ పనులు çపర్తయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – రంగయ్య, పీఆర్ ఏఈ -
ఇదీ అవినీతి రంగు!
ఏలూరు(సెంట్రల్): కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛందంగా ప్రైవేట్ సంస్థలు చేసిన పనులకు డబ్బులు డ్రా చేసేందుకు కుయుక్తులు పన్నారు. బిల్లులు సిద్ధం చేశారు. ఈ ఉదంతం నగరపాలక సంస్థలో చర్చకు దారితీసింది. ఈ బిల్లుల తయారీలో నగరపాలక సంస్థ కీలక విభాగంలోని ఓ ముఖ్య అధికారి ప్రత్యేక పాత్ర పోషించినట్టుగా సమాచారం. అసలేం జరిగింది.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, వంతెనలు, డివైడర్ల గోడలపై కొందరు వాల్‌పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటించడం, ఇతర ప్రకటనల రంగులు వేయడం చేస్తున్నారు. దీనివల్ల అవి అధ్వానంగా తయారవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు కళ్లు తెరిచిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా మార్పు రాకపోవడంతో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, వంతెనలు, ఫ్లైఓవర్ల గోడలను సుందరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని తలంచారు. సుందరీకరణలో భాగంగా 3డీ బొమ్మలు, రంగులు వేయాలని నిర్ణయించారు. రంగులు, 3డీ డిజైన్లను వేసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఈ ఏడాది జనవరిలో టెండర్లను పిలిచారు. విశాఖపట్నానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా చేసిన వ్యాపార సంస్థలు.. అయితే 3డీ డిజైన్లు, బొమ్మలు వేసేందుకు నగరంలోని పలు వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. నగరపాలకసంస్థ కార్యాలయం, నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న దామరాజు వెంకట్రావు పంతులు పార్కు, కర్రల వంతెన, లోబ్రిడ్జి, ప్రభుత్వాస్పత్రి, ఓవర్ బ్రిడ్జి గోడలకు వివిధ రకాల డిజైన్లతో కూడిన బొమ్మలను వేసి, వారి వ్యాపార సంస్థల పేర్లను వాటి పక్కనే వేసుకున్నారు. ఇదంతా ఉచితంగానే చేశారు. కాంట్రాక్టరే చేసినట్టుగా బిల్లులు అయితే ఈ పనిని కాంట్రాక్టరే చేసినట్టుగా నగరపాలక సంస్థ అధికారులు బిల్లుల కాజేతకు యత్నిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా రూ.8.14 లక్షలకు బిల్లు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. నగరంలోని గోడలకు ప్రైవేట్ సంస్థలు రంగులు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. కాంట్రాక్టరే రంగులు వేసినట్లు అధికారులు బిల్లులు సిద్ధం చేయడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రైవేట్ సంస్థల సౌజన్యంతోనే.. నగరంలోని డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలకు పోస్టర్లను అంటించి అధ్వానంగా చేస్తున్నారు. దీంతో గోడలపై ఎటువంటి పోస్టర్లను వేయకుండా ఉండేలా 3డీ బొమ్మలు, రంగులు వేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. అయితే వీటిని వేసేందుకు నగరంలోని వ్యాపారసంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వాటితోనే రంగులు, బొమ్మలు వేయించాం. ఈ పనికి నగరపాలకసంస్థ నిధులు ఏమీ ఖర్చు చేయలేదు. బిల్లులు సిద్ధం చేసినట్టుగా నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేస్తాం. –ఎ.మోహన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ -
‘మహా’ దోపిడీ మళ్లీ షురూ!
మంజీర తీరంలో ‘మహా’ అలజడి మొదలైంది.. మన భూభాగంలో ఇసుక దోపిడీ మళ్లీ షురువైంది.. అనుమతుల ముసుగులో మహారాష్ట్ర కాంట్రాక్టర్లు అంతర్రాష్ట్ర సరి‘హద్దులు’ దాటుతున్నారు. జిల్లా భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. మరోవైపు, మన వారే ‘మహా’ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఆ ఇసుకను దెగ్లూర్, మద్నూర్ మీదుగా హైదరాబాద్, బీదర్ తదితర ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఇలాగే ఇసుక తరలిస్తుండగా, జిల్లా అధికారులు దాడి చేసి జేసీబీని పట్టుకున్నారు. సుమారు 16 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించుకు పోయినట్లు అధికారులు నిర్ధారించారు. తరచూ తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుక తవ్వేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారి తీస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘మహా’ దోపిడీ మళ్లీ షురువైంది. మహారాష్ట్ర క్వారీల పేరుతో తెలంగాణ భూభాగంలోని మంజీర నదిలో ఇసుకను తోడేస్తున్నారు. నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. శాఖాపూర్ (మహారాష్ట్ర) ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమంగా తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతుండగా.. నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం గురువారం దాడి చేసి పట్టుకున్నారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడి తోడేస్తున్న భారీ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నదిలో రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా.. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు నాలుగు ఎకరాల లోనికి సరిహద్దు లు దాటి తెలంగాణ భూభాగంలో అక్ర మంగా ఇసుక తోడేసినట్లు గుర్తించారు. ఈ ఒక్కచోటే సుమారు 16 వేల క్యూ బిక్ మీటర్ల ఇసుకను మహారాష్ట్ర కాంట్రాక్టర్లు తవ్వుకు పోయినట్లు ప్రాథమికంగా గుర్తించా రు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. మంజీర న ది వెడల్పులో సగ భూభా గం తెలంగాణది.. మరోసగం మహారాష్ట్రకు ఉంటుంది. అయితే తెలంగాణ భూభాగంలో ఇసుక తోడేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారితీస్తోంది. రాత్రయితే చొరబాట్లు.. చీకటి పడితే చాలు మహారాష్ట్ర జేసీబీలు తెలంగాణ భూభాగంలోకి వచ్చి అక్రమంగా చొరబడుతున్నాయి. భారీ జేసీబీలతో రాత్రికి రాత్రి వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేయడం పరిపాటిగా మారింది. స్థానికులు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికార యంత్రాంగం ఈ అక్రమ చొరబాట్ల గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఇసుక వనరులు దోపిడీకి గురవుతుండగా.. ఈ క్వారీల ఆదాయంతో మహారాష్ట్ర సర్కారు ఖజనా నిండుతోంది. మన వారే ‘మహా’ కాంట్రాక్టర్లు.. మహారాష్ట్ర క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి తెర లేపిన కాంట్రాక్టర్లు మన రాష్ట్రం వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు మహారాష్ట్ర వ్యక్తులను తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీకి తెర లేపుతున్నారు. పైగా ఇక్కడి ఇసుకను దెగ్లూర్ (మహారాష్ట్ర), మద్నూర్ మీదుగా హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఇసుక వాహనాలు ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయి. మన ఇసుకను మహారాష్ట్ర క్వారీల పేరుతో తోడేసి.. మళ్లీ మన తెలంగాణలోనే విక్రయిస్తూ.. మహారాష్ట్ర సర్కారు ఖజానాను నింపుతున్న అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.కోట్లల్లో ఆదాయం ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం మంజీర నదిలో తమ వైపు ఉన్న ఇసుక క్వారీలకు టెండర్లు పిలుస్తుంది. ఈ ఏడాది సుమారు పది క్వారీలకు టెండర్లు పిలిచారు. ఒక్కో క్వారీకి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు మహారాష్ట్ర సర్కారు ఆదాయాన్ని గడిస్తోంది. అక్కడి గనుల శాఖ ద్వారా నాందేడ్ జిల్లా అధికారులు ఈ క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్వారీల్లో ప్రస్తుతానికి శాఖాపూర్, షెల్గాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే, ఆయా క్వారీల కాంట్రాక్టర్లు తమకు నిర్దేశించిన మహారాష్ట్ర భూభాగంలో కాకుండా.. అక్రమంగా తెలంగాణ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి ఇసుకను తోడేస్తున్నారు. అటువైపు నిండుకున్న ఇసుక నిల్వలు.. మంజీర నదికి అవతలి వైపు క్వారీలకు ఏటా టెండర్లు పిలిచి భారీగా తవ్వేస్తుండడంతో అటువైపు ఇసుక నిల్వలన్నీ అయిపోయాయి. నాణ్యత లేని నల్ల ఇసుక, మట్టితో కూడిన ఇసుక మాత్రమే మిగిలింది. దీంతో కాంట్రాక్టర్లు రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ భూభాగం పరిధిలోకి చొచ్చుకొచ్చి తవ్వకాలు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. -
రూ.కోట్లు కొల్లగొట్టారు..
సాక్షి, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల కట్ట నిర్మాణానికి వినియోగిస్తున్న ఒండ్రుమట్టి ఇటు రైతులకు, అటు జిల్లాలోని నాయకులకు కాసులు కురిపిస్తోంది. నల్లరేగడి పొలాలు ఉన్న రైతులతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టర్లు రూ.లక్షలు వెచ్చించి నల్లమట్టి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా రైతుల పొలాలనే కొనుగోలు చేసి కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఒండ్రుమట్టిని తవ్వుతున్నారు. కొన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోని ఒండ్రుమట్టిని తరలించుకుపోయేందుకు ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులకు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు ’లక్షలు ముట్టజెప్తున్నారు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలలో వందల సంవత్సరాల నాటి నుంచి పోగవుతూ వస్తున్న ఒండ్రుమట్టి క్షణాలలో మాయమవుతోంది. రిజర్వాయర్ల నిర్మాణంలో ఒండ్రు తప్పనిసరి నాగర్‌కర్నూల్ జిల్లాలో పాలమూరు –రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వట్టెం గ్రామంలో భారీ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీనికితోడు కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌తోపాటు కోడేరు మండలంలోని తీగలపల్లి వద్ద ఏదుల రిజర్వాయర్‌ను ప్రభుత్వం పెద్దఎత్తున నిర్మించి కృష్ణా జలాలను నిల్వ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రిజర్వాయర్ల నిర్మాణంలో చెరువు కట్టనుంచి నీరు బయటకు ఉసరకుండా ఉండేందుకు తప్పనిసరిగా ఒండ్రుమట్టిని వాడతారు. ఈ మట్టి బంకమట్టి మాదిరిగా ఉండి నీటిని కట్టనుంచి బయటకు వెళ్లకుండా చూస్తుంది. దీంతో ఇంజనీర్లు తప్పనిసరిగా ఒండ్రుమట్టిని వాడాలని నిబంధన విధించడంతో కాంట్రాక్టర్లు దీనికోసం ఎంత దూరమైనా వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా వట్టెం రిజర్వాయర్ కోసం బిజినేపల్లి మండలంలో పెద్దఎత్తున చెరువుల్లోని ఒండ్రును అక్రమంగా తరలించారు. ఇదే విషయంలో గ్రామాలలో గొడవలూ చోటుచేసుకున్నాయి. బిజినేపల్లి మండలం మంగనూరు, నందివడ్డెమాన్, పాలెం గ్రామాలలో కొందరు ఏకపక్షంగా చెరువు ఒండ్రును సొంత ప్రయోజనాల కోసం అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పడంతో గ్రామాలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండానే దీనిని అప్పనంగా కాంట్రాక్టర్‌కు అప్పగించడం జిల్లాలో వివాదాస్పదమైంది. మరోపక్క బిజినేపల్లి మండలం మంగనూర్ గ్రామంలోని ఊరచెరువు ఒండ్రుమట్టి విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. ఈ విషయం గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగనూరు చెరువు ఒండ్రుకు రూ.70లక్షల బేరం మంగనూర్ గ్రామ ఊర చెరువులోని 70 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఒండ్రును తీసుకునేందుకు గానూ ఓ కంపెనీ కాంట్రాక్టర్ కొందరితో అక్రమ ఒప్పందం కుదుర్చుకుని ’70లక్షలకు బేరం మాట్లాడుకున్నట్లు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో మరో వర్గం అదే గ్రామంలోని నక్కలకుంటలోని ఒండ్రును రూ.42 లక్షలకు అమ్ముకున్నారంటూ వీరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పాలెం పెంటోని చెరువులో చేతులు మారిన రూ.3కోట్లు జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరున్న బిజినేపల్లి మండలం పాలెం పెంటోనిచెరువులోని ఒండ్రును తరలించేందుకు కాంట్రాక్టర్ నుంచి కొందరు నాయకులు రూ.3కోట్ల ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రేయింబవళ్లు వందలాది భారీ టిప్పర్ల ద్వారా ఇక్కడి ఒండుమట్టిని తరలిస్తున్నా ఒక్కరు కూడా అభ్యంతరం తెలపకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ నుంచి అన్ని స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులకు పెద్దఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఐబీ అధికారుల పరిధిలోని చెరువుల్లోని ఒండ్రుమట్టిపై దోపిడీ జరుగుతున్నా ఆ శాఖ అధికారులు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పాలమూరు ప్రాజెక్టు పట్ల రైతుల్లో సానుకూల దృక్పథం ఉండటాన్ని నాయకులు క్యాష్ చేసుకున్నారు. మన ప్రాజెక్టుల కోసమేనంటూ రైతులను నమ్మబలికి రూ.కోట్లలో లంచాలు దిగమింగారు. ఇదే ఒండ్రుకు మెట్రిక్ టన్నుల ప్రకారం రాయల్టీ చెల్లిస్తే ఆయా గ్రామ పంచాయతీలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేది. వాస్తవానికి గ్రామ పంచాయతీ పరిధిలోని సహజ వనరులపై పూర్తి హక్కు పంచాయతీలకే ఉంటుంది. పంచాయతీ తీర్మానం, అనుమతి లేకుండా ఒండ్రు తరలించడం చూస్తుంటే దోపిడీదారులను ప్రశ్నించేవారు కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందివడ్డెమాన్‌లోనూ... బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లోనూ భారీగా చెరువుల్లోని ఒండ్రుమట్టితోపాటు రేగడి భూముల్లోని ఒండ్రును ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా తరలించారు. కొందరు కాంట్రాక్టర్లు రైతులతో భూములు కొనుగోలు చేసి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు పెట్టి ఒండ్రును తరలించారు. మరి కొన్ని చోట్ల శిఖం భూములు, ప్రభుత్వ భూముల్లోనూ ఒండ్రు తరలింపు యదేచ్ఛగా సాగింది. బినామీ రైతులను సృష్టించి పెద్ద ఎత్తున ఈ గ్రామంలో భూ మాయ చేశారు. ఇంత జరిగినా ఈ అంశంపై పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లినా సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ.. కొల్లాపూర్ నియోజకవర్గం నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్‌కు భారీగా ఒండ్రును తరలించారు. ఈ నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చెరువుల్లోని ఒండ్రుమట్టిని ప్రొక్లెయిన్ల ద్వారా ఒడ్డుకు చేర్చి పెద్దలుగా కుప్పలు పోసి ఆ తర్వాత కాంట్రాక్టర్లకు విక్రయించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు ఈవిషయమై గగ్గోలు పెట్టినా స్పందించకపోవడం గమనార్హం. రైతు నోట్లో మట్టి... నాగర్‌కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రంలోని ఒండ్రుమట్టిని కొల్లగొట్టేందుకు కొందరు చెరువులో బుద్ధ విగ్రహాన్ని నిర్మించేందుకంటూ అందులోని నీటిని పూర్తిగా బయటకు వదిలేశారు. ఆ సాకుతో చెరువులోని ఒండ్రును యదేచ్ఛగా ప్రాజెక్టుకు అమ్ముకుంటున్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారినప్పటికీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ చెరువు నిండితే పలుగ్రామాల పొలాలు పంటలతో కళకళలాడతాయి. స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలోని అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నా, నాగర్‌కర్నూల్ కేసరి సముద్రంలో నీరు లేకుండా చేసి రైతుల ఆగ్రహానికి గురవుతున్నారు. వట్టెం రిజర్వాయర్‌కు నిత్యం ఇక్కడి నుంచి వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా జిల్లా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ నోరు విప్పడం లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వడ్డెమాన్ గ్రామంలో బినామీ రైతులను సృష్టించి విలువైన ప్రభుత్వ భూములు, శిఖం భూములను కాంట్రాక్టర్లకు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈ విషయం డీఆర్వో మధుసూదన్‌నాయక్ దృష్టికి తీసుకొచ్చాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒండ్రుమట్టిని పెద్ద ఎత్తున విక్రయించడంతోపాటు పర్యావరణానికి ఆటంకం సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. – సుధాకర్, నందివడ్డెమాన్ -
నీరు–చెట్టు... అంతా కనికట్టు!
ప్రతిపాదనలు ఒక చోట.. పనులు మరొక చోట జిల్లాలో మంజూరు ....చేసింది చిత్తూరు భూభాగంలో.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు టీడీపీ నాయకుల అండతో యథేచ్ఛగా దోపిడీ రాయచోటి రూరల్: అధికారపార్టీ నాయకుల అండదండలతో నీరు–చెట్టు పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కనికట్టు చేస్తున్నారు. వారి దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోతోందని పలువురు రైతులు వాపోతున్నారు. జిల్లాలో కాంట్రాక్టు పనులు చేసుకుని జేబులు నింపుకొనేందుకు సరైన కాలువలు, నదులు లేవన్న కారణంగా అధికార పార్టీ నాయకుల అండతో పలువురు చోటా నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి, చిత్తూరు జిల్లా పరిధిలో పనులు చేసి బిల్లులు పెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా పనులు చిన్నమండెం మండలానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పాలేటమ్మ ఆలయం ఎదురుగా ఉన్న పాలేటమ్మ చెరువు నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్న పందిపిర్ల వంక వరకు దాదాపు మూడు పనులు, ఒక్కొక్క పనికి రూ.5లక్షలతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ మొత్తం పనులు 10 మీటర్ల వెడల్పుతో 3కిలోమీటర్ల మేర చేయాల్సి ఉంది. అధికారులు కేటాయించిన పాలేటమ్మ చెరువు–పందిపిర్ల వంకలో ఆ మేరకు భూభాగం లేకపోవడంతో కాంట్రాక్టర్లు చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం పసలవాండ్లపల్లె గ్రామ భూభాగంలో ఉన్న సర్వే నంబర్లు 488 మొదలుకొని, 489, 490, 491, 531, 279/1లలో ఉన్న మాండవ్యనదిలో పనులు చేశారు. ఇందులో మొత్తం 200 మీటర్ల వరకు మాత్రమే జిల్లా భూభాగం కాగా, మిగిలిన భూ భాగం అంతా చిత్తూరు జిల్లా పరిధిలోనిది కావడం విÔó షం. చెరువుకు నీరు రావాలంటే కష్టమే కాంట్రాక్టర్లు జేబులు నింపుకునేందుకు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. కానీ చేసిన పనులు 3కిలోమీటర్ల మేర జరిగినా, మరో ఒకటన్నర కిలోమీటరు దూరంలో పాలేటమ్మ చెరువు ఉంది. చెరువుకు నీరు రావాలంటే ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న సప్లై ఛానల్లో పనులు చేయాల్సి ఉంది. కానీ ఈ విషయం అటు అధికారులకు, ఇటు కాంట్రాక్టర్లకు పట్టడం లేదు. దీంతో చెరువుకు నీరు అందడం కష్టమేనని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు.. పెట్టేవాడు మన వాడే అయితే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అన్నట్లు ఉంది చిన్నమండెం మండల పరిధిలో అధికార పార్టీ నాయకుల తీరు. మండల పరిధిలోని నేరేలవంక– మోటకట్ల రోడ్డు మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో రూ.3లక్షలతో మట్టి రోడ్డు వేస్తున్నారు. దీంతో పాటు రోడ్డు పక్కనే ఉన్న సప్లై చానల్లో నీరు–చెట్టు పనులు కూడా రూ.4 లక్షల వ్యయంతో చేస్తున్నారు. ఇంకేముంది కాలువలో మట్టితీయడం, రోడ్డుపైనే పరచడం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కూడా అవసరం లేకుండానే రెండు పనులూ జరిగిపోతున్నాయి. కాంట్రాక్టర్లే పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇదీ టీడీపీ నాయకుల హవా. ఈ వ్యవహారం అంతా చూస్తే నీరు–చెట్టు పనులు కేవలం అధికార పార్టీ నాయకులకు, వారి అండదండలున్న చోటా నాయకుల జేబులు నింపేందుకు మాత్రమే అన్న విషయ ఇట్టే అర్థమైపోతోంది. జేఈ ఏమంటున్నారంటే.. మీరేమో పాలేటమ్మ చెరువు– పందిపిర్ల వంకలో నీరు చెట్టు పనులు చేశారంటున్నారు.. కాంట్రాక్టర్లేమో చిత్తూరు జిల్లా భూభాగంలోని మాండవ్య నదిలో నీరు–చెట్టు పనులు చేశారని ఇరిగేషన్ జేఈ జగదీశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మాండవ్యనదిలో పనులు చేయలేదని, ఇప్పుడు అక్కడ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మాండవ్యనదిలో పనులు చేశారని, మళ్లీ ప్రతిపాదనలు ఏమిటని జేఈని అడగ్గా.. పనులు చే సి ఉంటే దానికి కూడా బిల్లులు పెడతామంటూనే, మాండవ్య నదిలో పనులు చేసినట్లు తనకు తెలియదన్నారు. చేసిన పనులకు కొలతలు తీసుకున్నారా ? అని అడగ్గా కొన్ని పనులకు మాత్రం తీసుకున్నామన్నారు. -
నిబంధనలు మీరితే లైసెన్సుల రద్దు
గుంటూరు వెస్ట్: జిల్లాలోని బల్లకట్టు, పడవరేవుల కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలు మేరకు ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేయాలని జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో సోమేపల్లి వెంకటసుబ్బయ్య కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక చార్జీలు వసూలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్లో పుట్లగూడెం, గోవిందాపురం, రామాయగూడెం బల్లకట్టు, మాదిపాడు పడవ రేవుల కాంట్రాక్టర్లు, నిర్వాహకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేపల్లి మాట్లాడుతూ నిర్ణీత రుసుం కన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ధరల వివరాలు, పడవ, బల్లకట్టు కెపాసిటీ తెలియజేసేలా బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని చెప్పారు. లైసెన్సులను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో జోసఫ్‌కుమార్, బల్లకట్టు, పడవ రేవుల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన పుష్కర పనుల కాంట్రాక్టర్లు
నరసాపురం : గోదావరి పుష్కరాల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. సోమవారం నరసాపురంలో రిలే దీక్షలు ప్రారంభించారు. పనులు పూర్తి చేసి ఏడాది దాటినా ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తాము అప్పుల ఊభిలో కూరుకుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు గుత్తుల సత్యనారాయణ, కోటిపల్లి దొరయ్య, గోరు సత్తిబాబు మాట్లాడుతూ పుష్కరాల సమయంలో తక్కువ సమయంలో పనులు పూర్తి చేయాల్సి వచ్చిందని, అధికారుల ఒత్తిడి కారణంగా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని, పుష్కరాలు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో రూ.లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పనులు చేశామని, పనులు పూర్తి చేసి 14 నెలలు అయినా బిల్లులు ఇవ్వకపోవడంతో తెచ్చిన అప్పుల కంటే వడ్డీలు ఎక్కువయ్యాయని వాపోయారు. సుమారు రూ. 7 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. తొలిరోజు దీక్షలో కాంట్రాక్టర్లు యర్రంశెట్టి పార్ధసారధి, గుగ్గలపు శివరామకృష్ణ, అడబాల బాబులు, యాతం పెద్దిరాజు, చినిమిల్లి మురళీకృష్ణ, కంబాల మామాజీ, ఆచంట మూర్తి, కొండ్రెడ్డి బాబు, పెరికల హరిబాబు తదితరులు కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. -
మ్యాన్ హోల్ ఘటనలో పాపం వీరిదే..!
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: నగరంలో మ్యాన్‌హోళ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. మూతలు లేనివి, మురుగు ప్రవాహం అధికంగా ఉండి ఉప్పొంగుతున్న మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, నిర్వహణ పనుల్లో లెక్కకుమిక్కిలి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. జలమండలి క్షేత్రస్థాయి, ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లు మిలాఖత్ అయి సాగిస్తోన్న అక్రమాల్లో తరచూ అమాయకులైన కార్మికులు సమిధలవుతున్నారు. మహా నగరంలో సుమారు ఆరువేల కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై రెండులక్షలకు పైగా మ్యాన్‌హోల్ మూతలున్నాయి. వీటిలో నిత్యం పలు ప్రాంతాల్లో మురుగు నీటి ప్రవాహం పెరిగి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగడం సర్వసాధారణం. కొన్నిచోట్ల మ్యాన్‌హోళ్లలో ప్లాస్టిక్, ఇతర ఘనవ్యర్థాలు పోగుపడి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు శేరిలింగంపల్లి, గోపనపల్లి తదితర ప్రాంతాల్లో గతంలో చేపట్టిన సీవరేజి మాస్టర్‌ప్లాన్ పనులకు సంబంధించి మురుగు దారిమళ్లింపు(డైవర్షన్మెయిన్) పనులు, జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేజిక్కించుకున్న సంస్థలు బయటి వ్యక్తులకు సబ్ కాంట్రాక్టులిచ్చి పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో నైపుణ్యంలేని కార్మికులను మ్యాన్‌హోళ్లలోకి దించుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నా ఆయా ప్రాంతాల్లో పనులను పర్యవేక్షించాల్సిన క్షేత్రస్థాయి మేనేజర్లు, డీజీఎంలు, జీఎంలు సహా ఉన్నతాధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతూ, కాంట్రాక్టర్లకు వంత పాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాదాపూర్‌లో జరుగుతున్న సీవరేజి డైవర్షన్ మెయిన్ పనులకు సంబంధించి కొందరు ఉన్నతాధికారులే తమ బినామీలతో పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వరుస తనిఖీలు జరిపి అవసరమైన సలహాలు, సూచనలు అందించడంలోనూ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిగా మూడు దుర్ఘటనలు.. తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా..అంతకు ముందు ఇదే ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ కార్మికుడు మృత్యువాతపడ్డారు. అంతకు ముందు సుల్తాన్‌బజార్‌లో ఇద్దరు అడ్డాకూలీలు మ్యాన్‌హోల్‌ను శుద్ధి చేసే క్రమంలో అందులోకి దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు సంఘటనలు ఇదే ఏడాది చోటుచేసుకోవడం గమనార్హం. గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి ఘోర దుర్ఘటనల్లో 25 మంది వరకు కార్మికులు మృత్యువాతపడడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. -
వెంకటగిరిలో దాదాగిరి
తెలుగుగంగ పనుల కోసం తెగబడ్డ రాజకీయం కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్య నాయకుడి బెదిరింపులు రూ.2.6 కోట్ల టెండరు నోటిఫికేషన్ రద్దు చేసిన అధికారులు మరో రూ.1.30 కోట్ల కల్వర్టు, రోడ్డు పనుల టెండరు రద్దుకూ ఒత్తిడి వెంకటగిరి నియోజకవర్గంలో టెండర్లు వేయాలంటే హడలిపోతున్న కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా టెండర్లు ఎలా వేస్తావు. మీకు ప్రతిసారి నేను చెప్పను. పనులన్నీ నేనే చేసుకోవాలి. మర్యాదగా టెండర్లు వెనక్కు తీసుకుంటే సరి. లేదంటే ఇక్కడకొచ్చి పనిచేయలేరు’’ అంటూ వెంకటగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడు కాంట్రాక్టర్లను నేరుగా బెదిరిస్తున్నారు. కాంట్రాక్టర్లు మాట వినకపోతే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఏ కారణం లేకుండానే టెండర్ నోటిఫికేషన్లను రద్దు చేయిస్తున్నారు. ఆయన దాదాగిరికి హడలెత్తుతున్న కాంట్రాక్టర్లు వెంకటగిరి నియోజకవర్గంలో పనులవైపు చూసే సాహసం చేయడం లేదు. వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుగంగ ప్రాజెక్టు ఎడవ కాలువ వైపు 3.950 కిలోమీటర్ల నుంచి 5.600 కిలోమీటర్ల వరకు ఇన్స్పెక్షన్ రోడ్డు నిర్మాణానికి రూ.1,44,56,750 అంచనాతో జూన్ 22వ తేదీ టెండరు పిలిచారు. ఇదే కాలువ మీద 2.600 కిలోమీటర్ల నుంచి 3.900 కిలోమీటర్ల వరకు రూ.1,13,93,552 అంచనా వ్యయంతో మరో రోడ్డు నిర్మాణానికి కూడా జూన్ 22వ తేదీ ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించారు. అనేక మంది పోటీపడిన రూ.2.60 కోట్ల విలువైన ఈ రెండు పనులకు రూ.50 లక్షల మేర తక్కువకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ నెల 6వ తేదీతో టెండర్ల గడువు ముగిసింది. అధికారులు టెండర్లు ఖరారు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పనులను ఎలాగైనా తానే దక్కించుకోవాలనుకున్న అధికార పార్టీ ముఖ్య నాయకుడు తెలుగుగంగ అధికారులను తన ఇంటì కి పిలిపించుకున్నారు. ఆన్లైన్లో ఎవరెవరు ఎంత తక్కువకు టెండర్లు దాఖలు చేశారో కనుక్కుని వారి పేర్లు, మొబైల్ నంబర్లు తీసుకున్నారు. తాను చెప్పేంత వరకు ఈ పనులు ఖరారు చేయొద్దని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు వణికిపోయారు. కాంట్రాక్టర్లకు బెదిరింపులు∙ అధికారులను లైన్లోకి తెచ్చుకున్న సదరు నాయకుడు నేరుగా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి ఈ పనులు వదులుకోకపోతే ఇబ్బంది పడతారని హెచ్చరించినట్లు తెలిసింది. ఆయన బెదిరింపులకు భయపడిన కొందరు ఈ పనుల నుంచి వెనక్కు పోవడానికి సిద్ధమయ్యారు. ఒకరిద్దరు కాంట్ట్రాక్లరు మాత్రం తాము ఎందుకు పనులు చేయకూడదని ఎదురు ప్రశ్నించి వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే యంత్రాలన్నీ తానే కొనుక్కున్నానని, మీరు ఎలా పనిచేస్తారో చూస్తానని ఆ నాయకుడు బెదిరించారు. అయినా కొందరు కాంట్రాక్టర్లు తగ్గకపోవడంతో, ఇక లా¿¶ ం లేదనుకుని టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేశారు. ఏ కారణం లేకుండా టెండరు నోటిఫికేషన్‌ను ఎలా రద్దు చేయాలని అధికారులు బేల ముఖం వేస్తే ‘అవన్నీ నాకు తెలియదు. మీరు రద్దు చేయక పోతే ఇబ్బంది పడతారు, ఇక మీదట ఏ పనులకు టెండర్లు పిలిచినా ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే’ అని విరుచుకుపడ్డట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోని తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులు ఈ నెల 22వ తేదీ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఈ పనులకు పోటీ పడిన కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీని అదే రోజు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. టెండరు ఎందుకు రద్దు చేశారని కాంట్రాక్టర్లు అడిగితే కారణాలు అడిగి తమను ఇబ్బంది పెట్టొద్దని, ఈ విషయంలో గొడవ చేయొద్దని అధికారులు వారి కాళ్లా వేళ్లా పడుతున్నారు. రూ.50 లక్షల తక్కువతో పనులు చేయడానికి దాఖలైన ఈ టెండర్లు రద్దు చేయించడంలో సఫలీకృతుడైన ఆ నాయకుడు ఈసారి తన మనుషులతో 5 శాతం ఎక్కువతో టెండర్లు దాఖలు చేయించి ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.60 లక్షలు గండికొట్టేందుకు తెగబడ్డారని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ అన్యాయం చూస్తూ మౌన ంగా ఉండటం తప్ప తామేమీ చేయలేమని అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు పనుల రద్దుకూ ఒత్తిడి తెలుగుగంగ ప్రాజెక్టు పరి«ధిలోని అంతర్గత రోడ్లు, పైప్లైన్ల పై కల్వర్టు, గుండవోలు వద్ద రోడ్డు నిర్మాణం కోసం రూ.1,38,75,748తో ఈ నెల 11వ తేదీ తెలుగుగంగ ఎస్ఈ ఆన్లైన్లో టెండరు పిలిచారు. ఈ నెల 25వ తేదీతో టెండర్ల దాఖలుకు గడువు ముగిసింది. వెంకటగిరి నియోజకవర్గంలోని ఈ పనులకు కూడా పలువురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేత కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి ‘నా నియోజకవర్గంలో మీరెలా పనులు చేయాలనుకుంటున్నారు? మీ కథలన్నీ నాకు చెప్పొద్దు’ అని బెదిరించారు. ఒకరిద్దరి నుంచి ఈ పనులకు కూడా పోటీ తప్పేట్లు లేకపోవడంతో ఈ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేయాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చిన్న పనులకు కూడా అధికార పార్టీ ముఖ్య నేత రంగంలోకి దిగి బెదిరించడం, అన్నీ తానే చేసుకోవాలనడం ఏ మాత్రం బాగా లేదని కాంట్రాక్టర్లు అ«ధికారుల వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముత్యాల రాజును కలిసి తమ బాధలు వివరించాలని జిల్లాలోని కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పసిబిడ్డల బియ్యమూ మింగేశారు!
పక్కదారి పడుతున్న అంగన్వాడీ బియ్యం రెచ్చిపోతున్న కాంట్రాక్టర్లు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ పిల్లలు, గర్భిణులకు అందే పౌష్టికాహారంలో భారీ కోత సాక్షి ప్రతినిధి, తిరుపతి: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులు పక్కదారి పడుతున్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా చేసే బియ్యంలో భారీగా నొక్కేస్తున్నారు. 50 కిలోల బస్తాకు సరాసరి 38 కిలోల నుంచి 40 కిలోలు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నాయని కొంత మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిలో ముఖ్యంగా రెవెన్యూ, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కందిపప్పు, నూనెలో సైతం అంగన్వాడీ కేంద్రాలకు చేరేసరికి పరిమాణం తగ్గిపోతున్నట్లు సమాచారం. దీంతో అంగవాడీ కార్యకర్తలు ఏమీ చేయలేక పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడంతోనే ప్రభుత్వం నిర్థేశించిన పరిమాణంలో పౌష్టికాహారం అందటం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. సరుకుల్లో కోత అంగన్వాడీలకు సరఫరా అయ్యే బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ, నూనెను ఏపీ ఆయిల్‌ఫెడ్, కందిపప్పును ట్రేడర్స్, కోడిగుడ్లు, పాలను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. కాగా కాంట్రాక్టర్లతో ఆయా ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో సరుకుల సరఫరాలో తేడాలున్న పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బియ్యం సరఫరాలోనే భారీగా తూకాల్లో తేడా వస్తున్నట్లు అంగవాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు, నూనె సరఫరాలో సైతం అధికారులతో కుమ్మకై కొన్నిచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పర్సెంటేజీల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి అధికారులు దండుకుంటున్నట్లు కింది స్ధాయి సిబ్బందిలో సైతం చర్చ సాగుతోంది. మొత్తం మీద అంగన్వాడీ కేంద్రాలకే సరుకులు తక్కువ పరిమాణంలో చేరటంలో, కింది స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించడంలో విఫలమవుతున్నారు. మధ్యాహ్నాం బాలింతలు, గర్భిణులకు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిపప్పు, 16 గ్రాముల నూనెతో అన్నం, ఆకుకూర పప్పు రోజువారీ వడ్డించాలి. 200 గ్రాముల పాలు, వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. పిల్లలకు 75 గ్రాముల బియ్యం, 16 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల నూనెతో వంట చేసి వడ్డించాలి. సరుకుల్లో కోతతో వీటిని తక్కువ పరిమాణంలో అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చిన్న గొట్టిగల్లు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమైన ఆర్డీడీ శారద, పీడీ విజయలక్ష్మి సమక్షంలోనే సరుకుల్లో తగ్గుదలపై కొంత మంది కార్యకర్తలు నిలదీసినట్లు సమాచారం. ఆ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
ఇంటి దొంగలు
నిజామాబాద్ నాగారం, న్యూస్‌లైన్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్‌వైర్‌ను అమ్ముకోగా వచ్చిన డబ్బులను, కాంట్రాక్టులు అధికారులు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో యూనియన్ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ అవీనీతిపై ట్రాన్స్‌కో సీఎండీ కార్తికేయమిశ్రా సీరియస్‌గా తీసుకొని ప్రాథమిక విచారణ అనంతరం ఒక ఏడీ, నలుగురు ఏఈలను సస్పెండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ విషయంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక కావాలని ట్రాన్కో ఎస్ఈ నగేశ్కుమార్కు ఆదేశించారు. ఏం జరిగిందంటే కొద్ది నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కోసం జిల్లా స్టోర్ నుంచి రూ. 20 లక్షల విలువ చే సే కాపర్ వైరును విడుదల చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే రూ. 20 లక్షల విలువ చేసే మెటీరియల్ ఇచ్చిన సదరు అధికారులు.. దానిని కాంట్రాక్టరే కొనుగోలు చేశారని రికార్డుల్లో పేర్కొన్నారు. అందుకుగాను రూ. 20 లక్షల బిల్లును కాంట్రాక్టర్లకు చెల్లించారు. అంటే రూ. 20 లక్షల వైరుతోపాటు, 20 లక్షల రూపాయలనూ కాంట్రాక్టర్‌కు దోచిపెట్టారన్నమాట. అధికారులు ఇలా ‘అదనపు సంపాదన’ కోసమే చేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు అనంతరం కాలిపోయిన కాపర్‌వైరును స్టోర్‌లో జమచేయా ల్సి ఉంటుంది. ఇలా చేస్తే పాతదాని బదులు కొత్త వైరు ఇస్తారు. స్టాక్ లేకపోతే డబ్బులు చెల్లిస్తారు. కానీ ఏడాదిగా పాత వైరును స్టోర్‌లో జమ చేయడం లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 20 లక్షల విలువ చేసే పాత వైరుకు లెక్కలు చూపలేదని సమాచారం. కాపర్ వైరుకు డిమాండ్ ఉండడంతో మరమ్మతు కేంద్రాల్లోని అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాత వైరును అమ్ముకున్నట్లు తెలుస్తోంది. రికార్డులు మాయం అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు రికార్డులను సరిగా నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. కొందరైతే రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఏడీ నాగరాజు.. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకు సంబంధించిన రికార్డులను ఏడాది కాలంగా నిర్వహించడం లేదు. తన సెక్షన్‌కు సంబంధించి స్టాక్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేశామన్న వివరాలను ఆయన రికార్డు చేయాల్సి ఉంటుంది. అయితే ఉన్నతాధికారులను బుట్టలో వేసుకొన్న సదరు ఏడీ.. కాంట్రాక్టర్లతో దోస్తీ కట్టి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ఏడీ కార్యాలయానికి వచ్చిన డీఈ.. ట్రాన్స్ఫార్మర్ల సంబంధించిన రికార్డ్స్ చూపించాలని అడగ్గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లను అమ్ముకున్నారని, అందుకే రికార్డులు మెయింటెయిన్ చేయలేదని, ఉన్న రిజిస్టర్లను సైతం మాయం చేశారని తెలుస్తోంది. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి -నగేశ్, ఎస్ఈ, ట్రాన్స్‌కో, నిజామాబాద్ ట్రాన్స్‌కోలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులను విచారణ అధికారులుగా నియమించాం. నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి, సీఎండీకి నివేదిక పంపిస్తాం. ఏ మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది విచారణ నివేదిక అందిన తర్వాతే తెలుస్తుంది. -
టాన్స్‌కో పనుల్లో అక్రమాలపై నివేదిక ఇచ్చిన సీజీఎం
సాక్షి, నిజామాబాద్: విద్యుత్ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధికారులు., కాంట్రాక్టర్లు కలిసి ఈ పనుల్లో నాణ్యతను గాలికొదిలేశారు. నిజామాబాద్ నగరంతో పాటు, కామారెడ్డి, బోధన్ పట్టణాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ పనులను ఇష్టారాజ్యంగా చేసినట్లు విచారణాధికారులు నిర్ధారణకు వచ్చారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, పలుచోట్ల వీటిని ఏర్పాటు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త విద్యుత్ లైన్లు చాలా కాలం మన్నాలంటే నైపుణ్యం (స్కిల్డ్ లేబర్) కలిగిన కార్మికులతో పనులు చేయించాలనేది నిబంధన. అయితే కాంట్రాక్టర్లు ఈ నిబంధనను గాలికొదిలేసి అన్ స్కిల్డ్ లేబర్‌తో పని కానిచ్చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు కూడా కాంట్రాక్టర్లకే వత్తాసు పలికినట్లు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్లకు బిగించిన ఏబీ స్విచ్‌లు కూడా నాణ్యత లేనివి వినియోగించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరా యం ఏర్పడుతున్నట్లు తెలిసింది. పనుల్లో నాణ్యత లోపించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఏఈలు సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక సమర్పించిన విచారణాధికారులు పట్టణ ప్రాంత వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే లక్ష్యంతో జిల్లాలో తొమ్మిది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, లైన్ల పొడువును పెంచడం, లోఓల్టేజీ సమస్యను అరికట్టేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మార్ల ఏర్పాటు, సబ్స్టేషన్ల నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్ర విచారణకు అదేశించిన విష యం విధితమే. విచారణాధికారిగా డిస్కం సీజీఎం సంధ్యారాణిని నియమించారు. ఆమె వారం రోజుల క్రితం జిల్లాకు వచ్చి విచారణ జరిపారు. పనులు జరిగిన చోట్లకు వెళ్లి పరిశీలించారు. పనుల్లో జరిగిన అక్రమాలన్నీ ఆమె దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంధ్యారాణి ఇటీవల విచారణ నివేదికను కార్తికేయమిశ్రకు సమర్పించినట్లు సమాచారం. అధికారులపై వేటు.? విచారణాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలుండే అవకాశాలున్నాయని విద్యుత్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఒకరిద్దరు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులపై కూడా వేటు పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించామని ట్రాన్స్‌కో అధికారులు బయటకు చెబుతున్నారు. గ్యారంటీ పీరియడ్‌లో లోపాలు తలెత్తిన పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్లతో సరిచేయిస్తామని అంటున్నారు.