Corneal transplantation surgery
-
కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?
బాలీవుడ్ నటి జాస్మిన్ భాస్మిన్కి ఎదురైన చేదు అనుభవం కాంటాక్స్ లెన్స్ వాడే వాళ్లందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. బాబోయ్ కాంటాక్ట్ లెన్స్ ఇంత ప్రమాదమా అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ లెన్స్‌లు వాడచ్చా? దీని వల్ల కళ్లకు ప్రమాదమా? అంటే..ఇటీవల్ బాలీవుడ్ నటి జాస్మిన్ బాస్మిన్ ఒక ఈవెంట్‌కి హాజరవ్వయ్యేందుకు కాంటాక్ట్ లెన్స్ ధరించింది. దీంతో కళ్లు విపరీతమైన నొప్పి వచ్చి కనిపించకుండా పోయింది. తీరా వైద్యల వద్దకు వెళ్తే కార్నియా తీవ్రంగా డ్యామేజ్ అయ్యిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. దీంతో ఒక్కసారిగా అందరిలో లెన్స్ వాడొచ్చా?. దీని వల్ల కళ్లకు సమస్యలు వస్తాయా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..ఎందువల్ల అంటే..కార్నియా అనేది గోపురం-ఆకారపు కణజాలం. ఇది కంటి బయట స్పష్టమైన పొరను ఏర్పరుస్తుంది. ఇది మన దృష్టిని కేంద్రీకరించేలా లెన్స్‌లా పనిచేసే కీలకమైన రక్షణ పొర. కళ్లలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఇది వక్రీభవించేలా చేస్తుంది. రెటినాకు, కార్నియాకు ఏదైనా నష్టం ఏర్పడితే కణజాలం దెబ్బతినడం జరుగుతుంది. ఈ కార్నియల్ దెబ్బతినడానికి పలు రీజన్లు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ప్రమాదాలు, శస్త్ర చికిత్సలు, లేదా వస్తువుల కారణంగా ఎదురయ్యే ప్రమాదాల్లో ఈ కార్నియా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్నియ సమస్యలకు రీజన్..కాంటాక్ట్ లెన్స్‌లను సరిగా వాడకపోతే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. యూవీ కిరణాలకు గురికావడం, మధుమేహం లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులు, పోషకాహార లోపం తదితరాలు కార్నియా డ్యామేజ్‌కి గల కారణాలని చెబుతున్నారు వైద్యలు. అలాగే ప్రమాదాల్లో కన్ను దెబ్బతిన్న తీవ్రతను బట్టి ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఇలా కార్నియా దెబ్బతింటే మాత్రం ఒక్కోసారి చూపుకూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. లెన్స్‌లు హాని చేస్తాయా..?లెన్స్‌లు సరిగా ఉపయోగించకపోతే కార్నియాకు ప్రమాదమనే చెబుతున్నారు వైద్యులు. అవి పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. లెన్స్‌లు తప్పుగా ఉపయోగించినట్లయితే కంటిపై ఒక విధమైన రాపిడి వచ్చి ప్రమాదం కలిగిస్తుంది. ఈ సమస్యలు చాలా అరదుగా జరిగేవే అయినా..సకాలంలో చికిత్స తీసుకోకపోతే కార్నియాపై మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట లెన్స్‌లు ఉపయోగించటం వల్ల ఒక్కోసారి కార్నియా వాపుకి గురవ్వుతుంది.ఎదురయ్యే సమస్యలు..కంటి నొప్పి లేదా అసౌకర్యంకంటిలో ఎరుపు కాంతికి సున్నితత్వంఉత్సర్గకంటిలో ఏదో ఉన్నట్లుగా పీలింగ్చికిత్స: కార్నియల్ ఇన్ఫెక్షన్ను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దురద, తేలికపాటి సమస్యలకు ఐ డ్రాప్స్ ఇస్తారు. ఆ తర్వాత నుంచి కాంటాక్ట్ లెన్స్‌లు వాడకం తగ్గించడం లేదా ప్రత్యేక కాంటాక్ట్ లెన్సులు ధరించడం వంటివి చేయాలి. లెన్స్‌లు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..నిపుణులు సూచించిన విధంగా లెన్స్‌లు, లెన్స్ కేసులను మార్చండిలెన్స్లను ఎల్లప్పుడూ కాంటాక్ట్ లెన్స్ కేస్‌లో మాత్రమే ఉంచండిప్రతిసారీ తాజా ద్రావణాన్ని శుభ్రం చేయడానికి, అలాగే ఉపయోగించేందుకు రాత్రిపూట లెన్స్‌ను ద్రావణంలో ఉంచండిలెన్స్ డ్యామేజ్ కాకుండా ఉండేలా సురక్షిత క్లాత్‌ని ఉపయోగించండి.నేత్ర వైద్యునితో ఎప్పటికప్పుడూ పరీక్షలు చేయించుకోండిపడుకునే ముందు ఎల్లప్పుడూ లెన్స్‌లను తీసివేయండివేరే వాళ్లతో షేర్ చేసుకోవద్దు.(చదవండి: వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
కుడి కన్ను కనిపించలేదు, కిడ్నీ కూడా పాడైపోవడంతో.. : రానా
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికీ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రానా. ఈ క్రమంలో తాజాగా మరో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన గతంలో తను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. 'కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి మాట్లాడే అతి తక్కువమందిలో నేను ఒకడిని. ఇదెలా మొదలైందంటే.. ఓ పిల్లవాడు తన తల్లికి కన్ను కనిపించడం లేదని ఎంతో బాధపడ్డాడు. అతడిని చూసి జాలేసింది. ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుందని నచ్చజెప్పాను. అంతెందుకు, నాకు కూడా ఓ కన్ను కనిపించదని చెప్పాను. చాలామంది ఏదైనా శారీరక అనారోగ్యానికి గురైతే ఎంతో మనోవేదన చెందుతారు. చివరికి వారు కోలుకున్నా సరే నాకు ఇలా జరిగిందేంటి? అని పదేపదే దాని గురించే ఆలోచిస్తారు. అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నాకు కుడి కన్ను సరిగా కనిపించడం లేదని శస్త్రచికిత్స చేయించుకున్నా, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నా. చెప్పాలంటే నేనొక టెర్మినేటర్‌ని(నవ్వుతూ). మరి ఇన్ని చేయించుకున్నా నేను బాగానే ఉన్నాను కదా మరి మీరెందుకు అక్కడే ఆగిపోతున్నారు? అనవసర ఆలోచనలు మానేసి హాయిగా ముందుకు వెళ్లండి' అని చెప్పుకొచ్చాడు. కాగా రాగా 2016లో తన అనారోగ్య సమస్యల గురించి మొదటిసారి నోరు విప్పాడు. కుడి కన్ను ద్వారా సరిగా చూడలేకపోతున్నానని, పైగా కిడ్నీ కూడా పాడైందని చెప్పాడు. అయితే చికిత్స ద్వారా తాను పూర్తి స్థాయిలో కోలుకున్నానన్నాడు.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
ఆ శస్త్రచికిత్స ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ..
సత్తెనపల్లి(గుంటూరు జిల్లా): మెట్రో నగరాల్లోని ఆస్పత్రులకే పరిమితమైన కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వార ఎల్వీపీఈఐ అరుదైన ఘనతను సాధించిందని ఎల్.వి.ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ తేజోకోలి కార్నియల్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్, ప్రముఖ కార్నియల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌కృష్ణ వడ్డవల్లి తెలపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వెద్యశాలలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నగరాలకు వెళ్లడంతోపాటు ఆర్థి వ్యయప్రయాసలు పడాల్సివచ్చేదని, రోజువారి కూలీలు, వ్యవసాయ కార్మికులు అయితే తమ వేతనాలను ఫణంగా పెట్టాల్సివచ్చేదన్నారు. ఈ శస్త్రచికిత్స గ్రామీణ ప్రాంతానికి తీసుకు రావడం ద్వారా ఎల్వీపీఈఐ ప్రజల ముంగిటకు నేత్ర వైద్యాన్ని పూర్తిస్థాయిలో తెచ్చినట్లు అయిందన్నారు. ధూళిపాళ్లలోని ఎడ్వర్డ్ అండ్ సూనా బ్రౌన్ సెకండరీ సెంటర్ నేత్ర వైద్య విజ్ఞాన రంగానికి సంబంధించి పూర్తిసౌకర్యాలతో ఉందన్నారు. కేవలం కాటరాక్ట్, గ్లకోమాకు సంబంధించిన చికిత్సలే కాకుండా కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా నిర్వహించడం ద్వారా అరుదైన ఘనత సాధించిందన్నారు. హైదరాబాద్ ఎల్వీపీఈఐకు సంబంధించి రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంకు ద్వారా దాతల నుంచి సేకరించిన టిష్యూని ధూళిపాళ్లకు రవాణాచేసి ఎల్వీపీఈఐ తేజోకోలి కార్నియా ఇనిస్టిట్యూట్‌కు చెందిన సర్జికల్ బృందం ఈ ప్రక్రియ పూర్తి చేయగలిగారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 15సెకండరీ సెంటర్ల ద్వారా ఎల్వీపీఈఐ ప్రజలకు తన సేవలు అందిస్తుందన్నారు. కార్నియల్ ప్లాంటేషన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. శ్రస్త్రచికిత్స అనంతరం సేవలు కూడా ఇక్కడే పొందవచ్చన్నారు. కార్నియా సంబంధిత వ్యాధుల కారణంగా దేశంలో అనేకమంది అంధత్వం బారిన పడుతున్నారని, 1.1 మిలియన్ల ప్రజలు రెండు కళ్లల్లో కార్నియా సంబంధిత వ్యాధుల కారణంగా పూర్తిగా అంధులయ్యారన్నారు. కార్నియా సంబంధిత అంధత్వం నుంచి పరిరక్షించబడాలంటే కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కార మార్గమన్నారు. ఈ దిశగా గత 25ఏళ్లుగా ఎల్వీపీఈఐ కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ గురించి పరిశోధనలు జరపడమేకాక అంధత్వం నుంచి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సెంటర్ ద్వారా డయాబేటిక్ రెటినోపతి, గ్లకోమా, చిన్నపిల్లల కంటి వైద్యసేవలు కూడా లభ్యమవుతాయన్నారు. తెనాలికి చెందిన షేక్ బీబీకి కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎల్వీపీఈఐ వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.