ప్రమాదకర రైల్వే మార్గం.. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే!
అత్యంత సురక్షితమైన ప్రయాణాల్లో రైలు ప్రయాణం ఒకటి. కానీ చెప్పలేనంత థ్రిల్‌ని అందిస్తూ ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోయే అతి ప్రమాదకరమైన రైల్వే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దామా? అర్జెంటీనాలోని సాల్టాలో చిలీ పోల్వోరి రైల్వే లైన్ 13,845 అడుగుల ఎత్తులో మబ్బుల్లో తేలుతూ ఉంటుంది. దీన్ని 1948లో ప్రారంభించారు. ఇది కట్టడానికి 27 ఏళ్లు పట్టింది.
217 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం మధ్యలో 29 బ్రిడ్జీలు, 21 సొరంగాలుంటాయి. ఈ మొత్తాన్ని దాటడానికి సుమారు 16 గంటలు పడుతుంది. ఈ రైల్లో వెళ్తుంటే.. ప్రయాణికులకు చెప్పలేంత థ్రిల్ కలుగుతుంది. భారత్‌లో కూడా అలాంటి ప్రమాదకరమైన రైలు మార్గం ఉంది.
చెన్నై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు మార్గంలో 2.3 కిలోమీటర్ల దూరం సముద్రంపై నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లకు, బలమైన గాలులకు ఎదురీదుతున్నట్లుగా ఈ రైలు దూసుకుపోతుంది. ఇది ప్రయాణికులకు ఎంతో ఉద్విగ్న భరితమైన ప్రయాణం. ఈక్వెడార్‌లోని డెవిల్స్ నోస్ రైలు మార్గం, కొలరాడోలోని జార్జ్ టౌన్ లూప్ రైల్వే మార్గం, ఆస్ట్రేలియాలోని కురండా రైల్వే మార్గం, అలస్కాలోని వైట్ పాస్ – యుకోన్ రైల్వే మార్గం ఇలా.. ప్రమాదకరమైన రైల్వే మార్గాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.